‘పెళ్లి చూపులు’ చూసి క‌థ రాస్తే..

చిత్ర‌సీమ‌లో హిపోక్ర‌సీ ఎక్కువ‌. `నేనే గొప్ప‌` అనుకునే ర‌కాలు కోకొల్ల‌లుగా దొరికేస్తారు. ఏమోత్రం మొహ‌మాటం లేకుండా ప‌క్క సినిమాల నుంచి కాపీ కొట్టేసి – `ఇదంతా నా క్రెడిట్టే సుమా.. ఎవ్వ‌రికీ ఇవ్వ‌ను` అనే టైపులో మాట్లాడ‌తారు. అయితే ఎక్క‌డో ఓ చోట ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ లాంటి ద‌ర్శ‌కులు క‌నిపిస్తారు. సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌గా ఇంద్ర‌గంటికి మంచి పేరుంది. హ్యూమ‌ర్‌ని ఆయ‌న భ‌లే తెర‌కెక్కిస్తారు. ఆయ‌న్ని జూ. జంథ్యాల అనేవాళ్లూ ఉన్నారు. `స‌మ్మోహ‌నం`తో ఆయ‌న మార్క్ మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. `ఆహా.. ఓహో` అంటూ ఈ సినిమాని పొగ‌డ్త‌ల‌తో ముంచేస్తున్నారు. దానికి తోడు బాక్సాఫీసు ద‌గ్గ‌ర కూడా మంచి రిజ‌ల్ట్ ద‌క్కించుకుంది. అయితే.. ఈ సినిమా క‌థ రాసుకోవ‌డానికి స్ఫూర్తినిచ్చింది మాత్రం `పెళ్లి చూపులు` సినిమా అట‌. ఈ విష‌యాన్ని ఇంద్ర‌గంటి చెప్పారు.

పెళ్లిచూపులు త‌న‌కిష్ట‌మైన చిత్రాల్లో ఒక‌ట‌ని, అందులో ఓ సీన్ చూసి, ఇలాంటి క‌థ మ‌నం కూడా రాసుకుంటే బాగుంటుంది క‌దా అని భావించాన‌ని, దాన్నే స్ఫూర్తిగా తీసుకుని `స‌మ్మోహ‌నం` క‌థ త‌యారు చేసుకున్నాన‌ని ఇంద్ర‌గంటి స్వ‌యంగా చెప్పాడు. త‌రుణ్ భాస్క‌ర్‌కి ఇది నిజంగా గొప్ప కాంప్లిమెంట్‌. త‌రుణ్‌తో పోలిస్తే.. ఇంద్ర‌గంటి చాలా సీనియ‌ర్‌. ఆయ‌న చేతిలో చాలా హిట్లున్నాయి. అలాంటిది ఎలాంటి హిపోక్ర‌సీకి పోకుండా.. మ‌రో ద‌ర్శ‌కుడి సినిమానే త‌న‌కు స్ఫూర్తి అని చెప్ప‌డం ఇంద్ర‌గంటికే చెల్లింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close