జగన్‌ను ధిక్కరిస్తున్న వై.వి.సుబ్బారెడ్డి..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల ఖరారు కసరత్తును వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రారంభించలేదు. కానీ ఏ ఏ స్థానాల్లో ఎవరు ఎవరు అభ్యర్థులు అన్న విషయంపై ఆ పార్టీ అధినేత ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. అంత కంటే మెరుగైన అభ్యర్థులు దొరికితే తప్ప వారినే ఖరారు చేసే అవకాశం ఉంది. ఇలా టిక్కెట్లు ఖరారు కాని నేతల్లో ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ఒకరు. జగన్‌కు సమీప బంధువు అయినా వై.వి.సుబ్బారెడ్డి ఈ సారి పార్టీ కార్యక్రమాలకే పరిమితమవుతారని ఏడాది కిందటే జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ విషయం వైసీపీ వర్గాలకు తెలుసు. ఈ సారి టీడీపీ నుంచి వచ్చి చేరుతారని భావిస్తున్న మాగుంట శ్రీనివాసులరెడ్డి ఒంగోలు నుంచి పోటీ చేస్తారని … చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. మాగుంటను పార్టీలోకి తీసుకునేందుకు విజయసాయిరెడ్డి చాలా తీవ్రమైన ఒత్తిడే తీసుకువచ్చారు.

కానీ ఆయన అటూ ఇటూ కాకుండా మధ్యలో ఉండిపోయారు. అయితే మొగ్గు వైసీపీ వైపే ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో వై.వి.సుబ్బారెడ్డి ఒక్క సారిగా బ్లాస్టయిపోయారు. తన సిట్టింగ్ సీటు నుంచి తానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఇప్పుడే కాదు వచ్చే ఎన్నికల్లోనూ తాను ఒంగోలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఓడిపోయిన అభ్యర్థులను చేర్చుకుని వాళ్లను గెలిపించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. వైసీపీకి కొత్త నాయకులు అవసరం లేదని ఫైరయ్యారు. మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీలో చేరితే ఆయన సేవలను వినియోగించుకుంటాం కానీ టిక్కెట్ ఇవ్వబోమని తేల్చి చెప్పారు.

ఓ వైపు ఆయన వస్తే రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించాలనుకుంటున్న వైసీపీ అధినేతకు వై.వి.సుబ్బారెడ్డి షాక్ ఇస్తున్నారు. తనను కాదంటే తిరుగుబాటుకు సిద్ధమన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉండటంతో వైసీపీలో కాక రేపేదే. కొసమెరుపేమిటంటే.. ఈ సారి జగన్ కుటుంబం నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్న జగన్ సోదరి షర్మిల పేరు కూడా ఒంగోలు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తారన్న ప్రచారం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close