జగన్ మోసానికి నిండా మునిగిన వైసీపీ క్యాడర్ – ఇదే గగ్గోలు !

” జగన్ రెడ్డి లక్షణం మోసం చేయడం ఆయన.. ఒకరిని మోసం చేసి.. మరొకరికి మేలు చేస్తారని నమ్మడం అత్యాశే. నమ్మినందుకు బిర్యానీ పెడతారని చేత పట్టుకున్న ప్లేటుతోనే మనం కొట్టుకోవాలి ” అని వైసీపీ క్యాడర్ ఖాండ్రిస్తోంది. దీనికి కారణం ఆయన మోసం చేసిన వారి జాబితాలో క్యాడర్ కూడా ఉన్నారు. మన ప్లేట్లో మన బిర్యానీ కథలు చెప్పి అధికారంలోకి రాగానే వారిని నిర్వీర్యం చేసి పడేశారు జగన్. వారికి ప్రత్యామ్నాయంగా వాలంటీర్లను తెచ్చారు. వారినే నాయకులుగా చేస్తామంటున్నారు. దీంతో క్యాడర్ పరిస్థితి దారుణంగా తయారైంది.

టార్గెట్ చేసుకుంది సొంత క్యాడర్ నే!

అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బిల్లులను ఎక్కడక్కకడ నిలిపివేసి టీడీపీ క్యాడర్ ను ఇబ్బంది పెట్టానని అనుకున్నారు. అయితే కోర్టుల కు వెళ్లి.. మరో రకమైన ప్రయత్నాలు చేసి వారి డబ్బులు వారు తెచ్చుకున్నారు. అయితే మన ప్రభుత్వం వచ్చిందని ఆశపడి చిన్నా చితకా పనులు తీసుకుని చేసిన వైసీపీ క్యాడర్ కు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ నిధులు రావడం లేదు. అప్పుల పాలయ్యారు. కొంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. టీడీపీ వాళ్లని వాళ్ల బిల్లులు ఆపేశారు సరే.. వైసీపీ క్యాడర్ ను ఎందుకు వేధిస్తున్నారంటే ప్రభుత్వం వద్ద స్పందన లేదు.

సోషల్ మీడియా కార్యకర్తల్ని నిండా ముంచేసిన వైనం !

క్షేత్ర స్థాయి కార్యకర్తల్నే కాదు..సోషల్ మీడియా కార్యకర్తల్నీ పట్టించుకోలేదు. సొంత డబ్బుతో ఊరూరా ప్రచారం చేసి.. చివరికి అనారోగ్యంతో ఆస్పత్రి పాలైతే పట్టించుకునే దిక్కు లేక చనిపోయిన శ్యామ్ కలకడ అనే వ్యక్తి దగ్గర్నుంచి జగన్ అధికారంలోకి రావడానికి పని చేసిన కొన్ని వేల మంది అన్యాయానికి గురయ్యారు. కొంత మంది ఇతర పార్టీల మద్దతుదారులుగా మారిపోతే వారిపై గంజాయి కేసులు పెట్టారు. రేపు మా పరిస్థితి కూడా ఇదేనేమో అని చాలా మంది జగనన్నకు దండం పెట్టారు. వైసీపీ పెద్దల మాటలు విని కోర్టులపై దాడి చేస్తే..కేసులయితే.. ఒక్కరూ సాయం చేయలేదు. ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందుతున్న కొంత మంది మాత్రమే పని చేస్తున్నారు. ప్రభుత్వం మారితే వారూ కంటికి కనిపించరు. మొత్తంగా వైసీపీ సోషల్ మీడియా నిర్వీర్యానికి కారణం ..ఎంతసేపూ వాళ్లను వాడుకుందామనుకోవడమే కానీ.. ఏదో ఓ సాయం చేద్దామని అనుకోలేదు.

బిల్లులిస్తే చాలంటున్న క్యాడర్ !

ప్రభుత్వాన్ని నమ్మి పని చేశామని.. బిల్లులుఇస్తే చాలని..ఇక జగన్ జోలికి రాబోమని దండం పెట్టుకుంటున్నారు క్యాడర్. జనంలోకి వెళ్లేందుకు జగన్ భయపడటానికి ఇదే ప్రధాన కారణం. ఎంత మంది పోలీసుల్ని అడ్డం పెట్టుకున్నా. సొంత క్యాడర్ కూడా తిరుగుబాటు చేసే పరిస్థితిలో ఉంది కాబట్టి.. వీలైనంత వరకూ వరకూ ఆయన గ్యాప్ మెయిన్ టెయిన్ చేస్తున్నారు. చివరికి నమ్మి నట్టేట మునిగిపోయామని ప్రజలతో పాటు క్యాడర్ కూడా గగ్గోలు పెడుతున్నారు. నీరో చక్రవర్తిలా ఆయన విని ఆనందిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close