సాక్షి పెట్టుబడులపై ఐటీ ట్రిబ్యూనల్ తీర్పంటూ వైసీపీ సంబరాలు ! నిజమేంటి?

వైసీపీ నేతలు ఆనందోత్సాహాలతో ఉన్నారు. వారికి ఆనందం వస్తే ఏం చేస్తారు..? చంద్రబాబును తిడతారు. ఇప్పుడు అదే చేస్తున్నారు. మంత్రి కన్నబాబు కాకినాడలో ప్రెస్‌మీట్ పెట్టి చంద్రబాబును రెండు ఎకరాల దగ్గర్నుంచి వ్యవస్థల్ని మేనేజ్ చేయడం దాకా … ఎప్పుడూ తిట్టే తిట్లన్నింటినీ తిట్టారు. ఎప్పుడు ఎవరు ప్రెస్‌మీట్ పెట్టినా వారికి అది తప్పదు. ఈ తిట్ల మధ్యలో కన్నబాబు కొన్ని విషయాలు చెప్పారు. అదేమిటంటే.. సాక్షిలో పెట్టుబడులను పెట్టుబడులుగానే ఐటీ శాఖ గుర్తించిందని.. అది తమ నిజాయితీకి చిహ్నమన్నారు. అంటే జగన్ నిజాయితీకనన్నమాట.. ఒకప్పుడు ఈ పెట్టుబడులను ప్రశ్నించిన వారిలో కన్నబాబు కూడా ఉన్నారు..

సాక్షిలో పెట్టుబడులు గానే అందరూ చెప్పుకుంటున్నారు. క్విడ్ ప్రో కో పెట్టుబడులని కేసులు నమోదయ్యాయి. కొత్తగా పెట్టుబడులను పెట్టుబడులుగా గుర్తించారని ఐటీ ట్రిబ్యూనల్ ఆదేశాలివ్వడం దానికి.. వైసీపీ సంబరాలు చేసుకోవడం.. వెంటనే… చంద్రబాబే అవినీతి పరుడని చెప్పడం ఏమిటన్న సందేహం చాలా మందికి వస్తోంది. దీని వెనుక చిన్న స్టోరీ ఉంది. మొదట్లో ఐటీ శాఖ ఈ పెట్టుబడులను ఆదాయంగా గుర్తిస్తూ ఆదేశాలు ఇచ్చింది. దానిపై పన్ను కట్టాలని ఆదేశించింది. అయితే అవి ఆదాయం కాదని.. పెట్టుబడులని .. పన్ను కట్టలేమని ఐటీ శాఖ ట్రైబ్యూనల్‌ను జగన్ అండ్ కో ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై ఇప్పుడు తీర్పు వచ్చినట్లుగా తెలుస్తోంది. అధికారిక ఆదేశాలు ఇంకా ఎవరికీ తెలియలేదు. కానీ వైసీపీ నేతలు మాత్రం క్లీన్ చిట్ అని ప్రచారం చేసుకుంటున్నారు.

ఐటీ శాఖ ట్రైబ్యునల్ ఇచ్చిన ఓ చిన్న తీర్పును పట్టుకుని అవినీతి కేసుల్లో క్లీన్ చిట్ వచ్చిందన్నంతగా సంతృప్తి పడిపోతున్న వైసీపీ నేతల్ని చూసి టీడీపీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. నిజంగానే అలాంటి తీర్పు వచ్చిందా అని చెక్ చేసుకుంటున్నారు. చివరికి విషయం తెలిసి అల్పసంతోషులను సరి పెట్టుకుంటున్నారు. ఎంతైనా రాజకీయం అంటే.. బురత చెరుపుకోవడానికి ఏ చిన్న అవకాశం దొరికినా ఉపయోగించుకోవడం.. ఎదురువారిపై టన్నుల కొద్దీ పోయడం. ఈ విషయంలో చాంపియన్లు కొంతమందే ఉంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close