ప్రొ.నాగేశ్వర్ : వైసీపీ .. బీజేపీ బంధంపై స్టింగ్ ఆపరేషన్..! అంతా బహిరంగమే..!

ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీతో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుందని… ఇంగ్లిష్ న్యూస్ చానల్ టైమ్స్ నౌ సంచలన కథనం ప్రసారం చేసింది. దానికి.. ఓ స్టింగ్ ఆపరేషన్‌ను కూడా జోడించింది. కొంత మంది బీజేపీ అభ్యర్థులపై బలహీనమైన అభ్యర్థులని పెడతారని కూడా చెప్పుకొచ్చారు. అందులో… వైసీపీ నేత ఒకరు.. తమకు బీజేపీతో ఉన్న సంబంధాలను.. పక్కాగా వివరించారు. దీంతో… వైసీపీ బీజేపీ పక్షమేనని ప్రచారం జరుగుతోంది.

బీజేపీ మిత్రపక్షాల జాబితాలో ఉన్న వైసీపీ.. !

వాస్తవానికి భారతీయ జనతా పార్టీ – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధాలపై ప్రత్యేకంగా స్టింగ్ ఆపరేషన్ చేయాల్సిన పని లేదు. చాలా రోజుల నుంచి ఆ పార్టీ.. బీజేపీతో సన్నిహితంగా వ్యవహరిస్తోంది. దేశంలో రాజకీయ పార్టీలన్నింటినీ మూడు వర్గాలుగా విభజించవచ్చు. భారతీయ జనతా పార్టీకి నేరుగా మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు కొన్ని ఉన్నాయి. ఇవి ఎన్డీఏలో నేరుగా భాగస్వామిగా మారాయి. తాజాగా.. తమిళనాడులో అన్నాడీఎంకే కూడా ఆ కూటమిలో చేరింది. ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీకి మిత్రులుగా మారే అవకాశం ఉన్న పార్టీలు మూడు ఉన్నాయి. టీఆర్ఎస్, వైసీపీ, బిజూ జనతాదళ్ ఆ కోవలోకి వస్తాయి. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కాబ్టటి.. ఎన్నికల తర్వాత కూడా. .. టీఆర్ఎస్ ఆ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉండదు. ఆంధ్రప్రదేశ్‌లో…చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీతో నడవాలని నిర్ణయించుకున్నారు. అందుకే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వదు. ఇదే.. స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడిన అంశం.

ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైనా విధానాలను మార్చుకోగలవు..!

టీఆర్ఎస్, వైసీపీ, బిజూజనతాదళ్‌లు.. ఎన్నికల తర్వాత బీజేపీ గూటికి చేరుతాయన్నది బహిరంగ రహస్యం లాంటి విషయం. కాంగ్రెస్ పార్టీతో కొన్ని పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీతో కొన్ని కలసి ఎన్నికల్లో కలసి పోటీ చేస్తున్నాయి. ఇవి కాకుండా.. ఢిల్లీ రాజకీయాల్లో… ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు తృణమూల్ కాంగ్రెస్, టీడీపీ లాంటి పార్టీలు ఉన్నాయి. ఎన్నికల తర్వాత.. నికరంగా.. ఈ పార్టీలన్నీ ఎంత మేరకు కాంగ్రెస్ పార్టీతో ఉంటాయనేది ఆసక్తికరం. ఏ క్షణంలోనైనా అవసరం అయితే… విధానాన్ని మార్చుకోవచ్చు. 2004లో… టీడీపీ, వామపక్షాలతో కలిసి పోటీ చేసి చేసిన కేసీఆర్.. పోలింగ్ ముగిసిన తర్వాత వెంటనే.. బీజేపీకి మద్దతు ప్రకటించారు. అంటే.. ప్రాంతీయ పార్టీలు.. తమ ప్రయోజనాల కోసం.. రాజకీయాలు చేస్తూంటాయి.

స్టింగ్ చేసినా, చేయకపోయినా వైసీపీ, బీజేపీ కలిసి ఉన్న పార్టీలే..!

ఇంకా చెప్పాలంటే.. ప్రాంతీయ పార్టీలన్నీ.. ఆయా పార్టీల అధ్యక్షుల ప్రయోజనాల మీద ఆధారపడి ఉంటాయి. ఆయా పార్టీల ప్రయోజనాలకు ఏది మంచి నిర్ణయం అయితే.. దాన్నే తీసుకుంటూ ఉంటారు. ఆ మాటకొస్తే బీజేపీతో ఉన్న వాళ్లు బీజేపీతో ఉంటారా అన్నది కూడా చెప్పలేము. ఎందుకంటే… బీహార్ లో జేడీయూ చూశాం. మధ్యలో బీజేపీని వదిలేసి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీతో కలిసి పోటీ చేసి గెలిచిన తర్వాత.. మళ్లీ బీజేపీతో కలిశారు. ఇక శివసేన సంగతి చెప్పనవసరం లేదు. కలసి పోటీ చేస్తున్నా.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే.. స్టింగ్ ఆపరేషన్ జరిగినా.. జరగకపోయినా.. ఈ పార్టీల చంచల స్వభావం… జాతీయ. పార్టీలకు తెలుసు కాబట్టి… తమకు అవసరానికి తగ్గట్లుగా వాడుకుంటున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.