ముఖ్యమంత్రి ఎవరికీ మేలు చేయాలి? రైతులకా..సింగపూర్ సంస్థలకా? రోజా ప్రశ్న

వైకాపా ఎమ్మెల్యే రోజా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. రాష్ట్రానికి, రైతులకి తీవ్ర నష్టం కలిగించబోయే స్విస్ ఛాలెంజ్ విధానంలో రాజధాని నిర్మాణానికి తమ పార్టీ అంగీకరించదని, దానిని అడ్డుకొనేందుకు తన సర్వ శక్తులు ఒడ్డి పోరాడుతుందని చెప్పారు. ప్రకృతి విపత్తులు, ప్రభుత్వాల మార్పు వలన కానీ మరే ఇతరత్రా కారణాల చేత గానీ మద్యలో ఒప్పందం రద్దు చేసుకొన్నట్లయితే అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం సింగపూర్ నిర్మాణ సంస్థలకి చాలా బారీగా నష్టపరిహారం, భారీగా వడ్డీ కూడా చెల్లించే విధంగా ఒప్పందం చేసుకోవడం అంటే భవిష్యత్ తరాలని కూడా అప్పుల ఊబిలో త్రోసినట్లే అవుతుందని ఆమె ఆరోపించారు.

రైతులకి మేలు చేయవలసిన ముఖ్యమంత్రి సింగపూర్ సంస్థల ప్రతినిధిలాగ ఎందుకు వ్యవహరిస్తున్నారు? వారికే ఎందుకు ఎక్కువ లబ్ది కలిగేలాగ ఒప్పందాలు ఎందుకు చేసుకొంటున్నారు? అని రోజా ప్రశ్నించారు. ఆయన ఏపికి ముఖ్యమంత్రా లేకపోతే సింగపూర్ కి ముఖ్యమంత్రా? అని ప్రశ్నించారు. ఆయన సింగపూర్ సంస్థలతో కుమ్మకైనందునే వాటికి మేలు కలిగే విధంగా ఒప్పందాలు చేసుకొని రాష్ట్రాన్ని వాటికి దోచిపెట్టేయాలని ప్రయత్నిస్తున్నారని రోజా ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, ప్రజల కోసం రాజధాని నిర్మిస్తున్నట్లు లేరని, సింగపూర్ సంస్థలకి తద్వారా తన కుటుంబానికే లబ్ది కలిగించడానికే రాజధాని నిర్మిస్తున్నట్లుందని ఆక్షేపించారు.

ముఖ్యమంత్రి ఇంత బరి తెగించి దోపిడీకి సిద్దం అవుతుంటే, తెదేపాకి మిత్రపక్షంగా ఉన్న భాజపా నేతలు ఏమి చేస్తున్నారు? ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా భాజపా నేతలు ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడుని అడ్డుకోవాలని లేకుంటే భవిష్యత్ తరాలు ఎవరినీ క్షమించవని అన్నారు. స్విస్ ఛాలెంజ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తమ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంతో గట్టిగా పోరాడుతుందని, అవసరమైతే డిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కూడా దీనిని అడ్డుకొని రాష్ట్రాన్ని కాపాడమని కోరుతామని అన్నారు. మోడీ ‘మేడ్ ఇన్-ఇండియా’ అంటుంటే చంద్రబాబు నాయుడు ‘టేక్ ఇన్-ఇండియా’ అంటున్నారని రోజా ఆక్షేపించారు. ఒకప్పుడు రాష్ట్ర ప్రజలని మోసం చేసినందుకు కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని రాష్ట్ర ప్రజలు ఏవిధంగా శిక్షించారో, ఇప్పుడు ఈ స్విస్ ఛాలెంజ్ పద్దతిలో రాజధాని నిర్మాణానికి అనుమతించి రాష్ట్రాన్ని దోచుకోవడానికి అనుమతిస్తే, ప్రధాని నరేంద్ర మోడీని, భాజపాని కూడా ఏపి ప్రజలు క్షమించబోరని రోజా హెచ్చరించారు.

ఒకప్పుడు వ్యాపారానికని వచ్చిన బ్రిటిష్ వాళ్ళు భారత్ ని పట్టి పీడించుకొని తింటుంటే వారిని అతికష్టం మీద తరిమి కొట్టామని, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడే స్వయంగా అంతకంటే కర్కోటకులని పేరు పొందిన సింగపూర్ సంస్థలని తీసుకువచ్చి రాష్ట్రాన్ని వారికి అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని రోజా అన్నారు. దేశానికి, రాష్ట్రానికి కూడా నష్టం కలిగించే ఈ స్విస్ ఛాలెంజ్ విధానాన్ని, సింగపూర్ సంస్థలని అడ్డుకోవడానికి తమ సర్వశక్తులు ఒడ్డి పోరాడుతుందని, భాజపాతో సహా అన్ని పార్టీలు, ప్రజలు కూడా తమతో కలిసి రావాలని రోజా పిలుపునిచ్చారు.

రోజా చేసిన ఈ విమర్శలు, ఆరోపణలను తెదేపా నేతలు చాలా గట్టిగా త్రిప్పికొట్టవచ్చు కానీ ఆమె వ్యక్తం చేసిన అనేక సందేహాలకి కూడా వారు సమాధానం చెపితే ఎవరి వాదన సరైనదో ప్రజలకి తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close