హీరోల ఫ్యాన్స్ మూర్ఖత్వం..హీరోలు ఎంకరేజ్ చేస్తున్నారా?

అభిమానులంటే మాకు ప్రాణం…వాళ్ళకు పాదాభివందనం లాంటి కబుర్లు చెప్పని ఇండియన్ సినిమా హీరో ఎవ్వరూ ఉండరేమో. సినిమాలు కూడా అభిమానుల ఆనందం కోసమే తీస్తున్నామని చెప్తూ ఉంటారు. అంటే అభిమానుల ఆనందం కోసమే మేం కష్టపడుతున్నాం అని చెప్పడమన్నమాట. ఇలాంటి కహానీలు చెప్పే, అభిమానులకు ఉన్న పిచ్చి అభిమానాన్ని మూర్ఖత్వ స్థాయిలకు తీసుకెళతారు. అభిమానుల మధ్య గొడవలు, కొట్టుకోవడాలు, చంపుకోవడం వరకూ వెళ్ళిన విషయాలు పక్కన పెడితే సినిమా హీరోల అభిమానుల మూర్ఖత్వం….ఆ అభిమానుల అభిమాన హీరోలకంటే గొప్పవాళ్ళయిన చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. వాళ్ళను అవమానిస్తోంది. స్టార్ హీరోలు కూడా ఈ పిచ్చిని ఎంకరేజ్ చేస్తున్నట్టే కనిపిస్తోంది.

సల్మాన్ ఖాన్…ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్‌లో రజనీకాంత్, పవన్ కళ్యాణ్‌లు ఎలాగో హిందీలో ఈ సూపర్ స్టార్ అలాగన్నమాట. సల్మాన్ ఖాన్‌ని రియో ఒలింపిక్స్‌కి భారత సుహృద్భావ రాయబారిగా నియమించడాన్ని రెజ్లర్ యోగేశ్వర్ దత్ ప్రశ్నించాడు. విమర్శించాడు. ఆయన విమర్శలు వాస్తవం కూడా. ఏ ప్రాతిపదికన సల్మాన్ ఖాన్‌ని నియమిస్తారు? సల్మాన్ ఖాన్ ఏ రకమైన స్ఫూర్తిని ఇస్తాడు? ఆయన ‘సుల్తాన్’ సినిమా చూసి మన వాళ్ళు ఇన్‌స్పైర్ అవ్వాలి అని మాట్లాడేవాళ్ళకు ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. యోగేశ్వర్ దత్ విమర్శలకు సల్మాన్ అభిమానులు సివియర్‌గా రియాక్టయ్యారు. ఒలింపిక్స్‌ పోటీలలో అర్హత రౌండ్స్‌లోనే యోగేశ్వర్ ఓడిపోవడంతో సల్మాన్ ఖాన్ అభిమానులు సోషల్ మీడియాలో యోగేశ్వర్‌ని బూతులు తిడుతున్నారు.

భారతదేశానికి పేరు తీసుకురావాలని డే అండ్ నైట్ శ్రమించి సామర్థ్యం సరిపోకో, దురదృష్టం వెంటాడో ఓడిపోయిన యౌగేశ్వర్ దత్‌ని తిడుతున్న మూర్ఖపు సల్మాన్ ఖాన్ అభిమానుల విషయం పక్కన పెడదాం. ఒలింపిక్స్‌లో భారత్ తరపున పార్టిసిపేట్ చేసిన ఆటగాళ్ళకు నేనూ సహాయం చేస్తానన్న సల్మాన్ ఖాన్‌కి ఈ ఇష్యూ గురించి తెలియదా? లేకపోతే నన్ను విమర్శించినవాడికి అలాగే జరగాలి. మళ్ళీ జన్మలో ఎవ్వడూ.. నన్ను ఏ విషయంలో కూడా విమర్శించకూడదు అన్న అహంకారంతో ఉన్నాడా? ఇంటర్నెట్ యుగంలో సల్మాన్ ఖాన్‌లాంటి స్టార్‌కి తన అభిమానులు చేస్తున్న మూర్ఖపు పని గురించి తెలియదంటే నమ్మలేం. తెలిసిన వెంటనే ట్విట్టర్‌లోనో, ఫేస్ బుక్‌లోనో అది తప్పని చెప్పడానికి కూడా రెండు నిమిషాలు చాలు. అలా జరగడం లేదంటే……….?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close