తాజ్‌ని తొక్క‌నేల‌…రోడ్లు ఊడ్చ‌నేల సిఎంగారూ…

తెలుగులో ఓ సామెత ఉంది అడుసు తొక్క‌నేల కాళ్లు క‌డ‌గ‌నేల అని… అలాగే ఉంది ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాధ్ వైఖ‌రి. రాష్ట్రంలోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ అంద‌క పెద్ద సంఖ్య‌లో పిల్లలు చ‌నిపోయిన లాంటి ఉదంతాలు పున‌రావృతం కాకుండా గ‌ట్టి చ‌ర్య‌లు తీసుకోవాల్సిన ఈ సిఎం గారు… అంత‌కు మించి ప‌నేమీ లేదన్న‌ట్టు తాజ్‌మ‌హ‌ల్ లాంటి ప్ర‌తిష్టాత్మ‌క క‌ట్ట‌డం విలువ‌ను దిగ‌జార్చ‌బోయి కంగుతిన్నారు. చివ‌ర‌కు రోడ్లు ఊడ్చి శుభ్ర‌ప‌డే ప్ర‌య‌త్నం చేశారు.
ఇటీవ‌ల ఉత్త‌ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప‌ర్యాట‌క ప‌రంగా అభివృధ్ధి ప‌ర‌చాల్సిన జాబితాతో బుక్‌లెట్ ప్ర‌చురించి అందులో భార‌త‌దేశ‌పు గొప్ప నిర్మాణమైన ఆగ్రాలోని తాజ్‌మ‌హ‌ల్ కు చోటు క‌ల్పించ‌క‌పోవ‌డం వివాదాస్ప‌ద‌మైంది. అయితే ఈ విష‌యంపై ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌ని ముఖ్య‌మంత్రి, ఆయ‌న మంత్రివ‌ర్గం, ఎమ్మెల్యేలు, ఎంపి కూడా తాజ్‌మ‌హ‌ల్‌పై ఇష్టారాజ్యంగా మాట‌ల దాడులు చేశారు. అదొక స‌మాధి త‌ప్ప ప్రేమ‌కు చిహ్నం కాద‌న్నారు. అస‌లు ఒక‌ప్పుడు అక్క‌డ శివాల‌యం ఉండేద‌ని దాన్ని కూల్చి ఈ స‌మాధిని నిర్మించార‌న్నారు. ముఖ్య‌మంత్రి గారేమో.. విదేశీ ప్ర‌ముఖులు భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు ఇవ్వాల్సింది తాజ్ న‌మూనాలు కాద‌ని, భ‌గ‌వ‌ద్గీత పుస్త‌కం అనీ సెల‌విచ్చారు.

అయితే దీనిపై ఇంటా బ‌య‌టా విమ‌ర్శ‌లు చెల‌రేగాయి. భాజాపా ప్రభుత్వం మ‌త‌భావాల‌ను రెచ్చ‌గొడుతోంద‌ని, మ‌త ఛాంద‌స భార‌తాన్ని నిర్మించాల‌ని చూస్తోందంటూ చేసే ఆరోప‌ణ‌ల‌కు ఇది బ‌లం చేకూర్చేలా ఉందంటూ భాజాపాలో మిత‌వాదులు ఆందోళ‌న చెందారు. వీట‌న్నింటి నేప‌ధ్యంలో యుపి ముఖ్య‌మంత్రి న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించారు. త‌న మందీ మార్బ‌లంతో క‌లిసి గురువారం తాజ్‌మ‌హ‌ల్‌ని సంద‌ర్శించారు. చాలాసేపు అక్క‌డ గ‌డిపారు. అంతేకాదు స్వ‌ఛ్చ‌భార‌త్ లో భాగంగా తాజ్ ప‌రిస‌రాల‌ను ఊడ్చేశారు. తిరిగి వెళుతూ తాజ్ ఒక అద్భుత‌మ‌ని కితాబిచ్చారు. ఇది ఎవ‌రు క‌ట్టినా అందులో వేలాది మంది భారతీయుల శ్ర‌మ దాగి ఉంద‌న్నారు. త‌మ ప‌ర్యాట‌క ప్రాంతాల ప‌రిర‌క్ష‌ణ కార్య‌క్ర‌మంలో తాజ్‌కు స‌ముచిత స్థానం క‌ల్పిస్తామ‌న్నారు. తాజ్ బ‌య‌ట విదేశీయుల‌తో క‌లిసి ముచ్చ‌ట్లు సాగించి ఫొటోల‌కు ఫోజిచ్చారు.

ఆయ‌న ప‌ర్య‌ట‌న‌లో దాదాపు 500 మంది వ‌ర‌కూ భాజాపా నేత‌లు, ప‌ర్యాట‌క మంత్రి, ఆర్కియాల‌జీ శాఖ అధికారులు… ఉన్నారు. ఏకంగా 14వేల మంది పోలీసుల‌ను ఆయ‌న భ‌ధ్ర‌త కోసం ఉప‌యోగించారు. మొత్తం మీద ఆయ‌న ప‌ర్యట‌న‌కు త‌గ్గ ప్రచార‌మే ల‌భించింది. అయితే ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాధ్ వ‌ర్యులు… ఇక‌నైనా లేనిపోని వివాదాల‌ను రేకెత్తించే అంశాల జోలికి వెళ్లే బ‌దులు… ఎంతో న‌మ్మ‌కంతో త‌మ‌ను పెద్ద మెజారిటీతో పీఠ‌మెక్కించిన ప్ర‌జ‌ల కోసం త‌న స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేస్తే… మేలేమో…

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close