క‌థల ఎంపిక‌లో యంగ్ హీరోల త‌డ‌బాటు..

క‌థ‌ల ఎంపిక ద‌గ్గ‌రే సినిమా విజ‌యం స‌గం నిర్ణ‌య‌మైపోతుదంటారు. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడు క‌థ‌ను తెర‌పై తీసుకొచ్చే విధానం, నిర్మాణ సంస్థ‌ల ప్రామాణిక‌త సినిమా స‌క్సెస్‌కు నిర్ణ‌యాత్మ‌క కార‌ణాల‌వుతాయి. గ‌త విజ‌యాలు ఎన్నివున్నా స‌రే ఒక్క అప‌జ‌యం ప‌ల‌క‌రిస్తే చాలు హీరోలు కుదేల‌వుతారు. తిరిగి కెరీర్‌ను గాడిలోకి పెట్టుకోవ‌డానికి శ్ర‌మిస్తుంటారు. గ‌త కొంత‌కాలంగా టాలీవుడ్ యువ హీరోలు ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. క‌థ‌ల ఎంపిక‌లో వారి జడ్జిమెంట్ అంచ‌నాల్నిత‌ప్పుతోంది.

ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం మొద‌లుకొని ఆ! వ‌ర‌కు వ‌రుస‌గా తొమ్మిది విజ‌యాల‌తో జైత్ర‌యాత్ర సాగించారు నాని. గ‌డ‌చిన మూడేళ్ల‌లో టాలీవుడ్‌లోనే మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కృష్ణార్జున‌యుద్ధం చిత్రంతో నాని విజ‌య‌ప‌రంప‌ర‌కు బ్రేక్‌ప‌డింది. నాని ద్విపాత్రాభిన‌యం చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. సక్సెస్ హ్యంగోవ‌ర్‌లో నాని చిత్ర క‌థాంశం ఎంపిక‌లో నిర్ల‌క్ష్యం చేశార‌నే విమ‌ర్శ‌లు వినిపించాయి. ఇక మ‌రో యువ‌హీరో నితిన్‌తో జ‌యాప‌జ‌యాలు దోబుచూలాడుతుంటాయి. ఇష్క్ సినిమాకు ముందు వ‌రుస‌గా 11 ప‌రాజ‌యాల‌తో నితిన్ కెరీర్‌లో బ్యాడ్‌ఫేజ్‌ను ఎదుర్కొన్నాడు. ఒకానొక‌ద‌శ‌లో ఆయ‌న కెరీర్ ప్ర‌శ్నార్థక‌మైంది. ఇష్క్‌, గుండెజారి గ‌ల్లంత‌యిందే చిత్రాల‌తో తిరిగి పుంజుకున్నారు. ఆ త‌ర్వాత మ‌రో రెండేళ్లు నితిన్‌కు ప‌రాజ‌యాలే ప‌ల‌క‌రించాయి. అఆ విజ‌యంతో మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చాడు. అయితే నితిన్ గ‌త రెండు చిత్రాలు లై, ఛ‌ల్ మోహ‌న‌రంగ ఫెయిల్యూర్స్‌గా నిలిచాయి. థ్రిల్ల‌ర్‌, రొమాంటిక్ కామెడీ జోన‌ర్‌లో రూపొందిన ఈ చిత్రాలు నితిన్‌కు నిరాశ‌ను మిగిల్చాయి. ప్ర‌స్తుతం ఆయ‌న దిల్‌రాజు సంస్థ‌లో శ్రీనివాస క‌ల్యాణం చేస్తున్నారు. ఈ సినిమా తిరిగి త‌న‌కు విజ‌యాన్ని తెచ్చిపెడుతుంద‌నే ధీమాతో వున్నారు నితిన్‌.

ఇక కెరీర్ ఆరంభంలోనే హ్యాట్రిక్ విజ‌యంతో ప‌రిశ్ర‌మ దృష్టిని ఆక‌ట్టుకున్నాడు రాజ్‌త‌రుణ్‌. ప్రామిసింగ్ యంగ్ హీరోగా గుర్తింపు పొందాడు. గ‌త మూడేళ్ల‌లో రాజ్‌త‌రుణ్ ఒక్క విజ‌యానికి నోచుకోలేదు. అంధ‌గాడు మొద‌లుకొని ఇటీవ‌ల వ‌చ్చిన ల‌వ‌ర్ వ‌ర‌కు ప్ర‌తి చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తాకొట్టింది. ప్రేమ‌క‌థ‌ల‌తో పాటు ప్ర‌యోగాత్మ‌క ఇతివృత్తాల్ని ఎంచుకున్నప్ప‌టికీ రాజ్‌త‌రుణ్ విజ‌యాల్ని అందుకోలేక‌పోయాడు. ఇక సాయిధ‌ర‌మ్‌తేజ్ కూడా ఇదే పంథాలో సాగుతున్నాడు. సుప్రీమ్ త‌ర్వాత సాయిధ‌ర‌మ్‌తేజ్‌కు స‌రైన విజ‌యం క‌రువైపోయింది. జ‌వాన్‌, ఇంటిలిజెంట్‌, తేజ్ ఐ ల‌వ్ యూ చిత్రాల‌తో హ్యాట్రిక్ ఫెయిల్యూర్స్‌ను మూట‌గ‌ట్టుకున్నాడు. ఇక మంచు హీరోలు విష్ణు, మ‌నోజ్‌లు రేసులో లేకుండా పోయారు. దేనికైనా రెడీ త‌ర్వాత విష్ణు న‌టించిన సినిమాలు ఒక్క‌టి కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేక‌పోయింది. ఇటీవ‌ల విడుద‌లైన ఆచారి అమెరికా యాత్ర అట్ట‌ర్‌ఫ్లాప్‌గా మిగిలిపోయింది. మంచు మ‌నోజ్ కూడా వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు.

యువ హీరోల చిత్రాలు వ‌రుస‌గా ప‌రాజ‌యం చెంద‌డం టాలీవుడ్‌ను క‌ల‌వ‌ర‌పెడుతున్న‌ది. క‌థ‌ల ఎంపిక‌లో తడ‌బాటే వారి వైఫ‌ల్యాల‌కు కార‌ణ‌మ‌ని అభిమానులు భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close