నవంబర్ కల్లా టీడీపీకి యువనాయకత్వం..! అంటే వారసులేనా..?

తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో యువత దూరమయ్యారు. ఎన్టీఆర్ టైంలో… రాజకీయ రంగ ప్రవేశం చేసిన వారే.. కొంత కీలకంగా ఉన్నారు. అదే.. యువతను..పార్టీకి దూరం చేసిందనే అభిప్రాయం… ఇప్పుడు … టీడీపీలో వినిపిస్తోంది. యువ నాయకత్వం లేకపోతే.. .పార్టీ భవిష్యత్ ఇబ్బందికరమేనని నిర్ణయానికి వచ్చారు చంద్రబాబు. పార్లమెంట్ వారీగా జిల్లా కమిటీలు నియమించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీటిలో యువతకే ప్రాధాన్యం ఇవ్వబోతున్నామని చెబుతున్నారు. పార్టీ భవిష్యత్ కోసం యువనాయకత్వాన్ని ప్రోత్సహించడం ఇప్పుడు టీడీపీ అధినేతకు తప్పనిసరి.

నిజానికి టీడీపీలో యువనేతలకు కొదవలేదు. కాకపోతే.. వారిలో వారసులే ఎక్కువగా ఉన్నారు. చాలా మంది.. తమను తాము నిరూపించుకుంటున్నారు కూడా. అయితే.. ఎక్కువ మంది వారసులే. పాత తరం పోయి.. కొత్త తరానికి మళ్లీ పగ్గాలిస్తే.. వారసులకే ఇస్తారా.. అనే అనుమానం టీడీపీ శ్రేణుల్లో ప్రారంభమయింది. కింది స్థాయి నుంచి పని చేసుకుంటూ వచ్చిన వారికి అవకాశం ఇస్తే… వచ్చే గెలుపే స్థిరంగా ఉంటుంది. అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా నాయకులయ్యే వారి పరిస్థితి ఎప్పుడూ డొలాయమానంలో ఉంటుంది. ఈ విషయం .. విద్యార్థి దశ నుంచి రాజకీయంగా ఎదిగిన టీడీపీ అధినేతకు తెలియనిదేం కాదు. కానీ.. కారణాలేమైనా… టీడీపీలో.. ఆ స్థాయిలో నాయకత్వం ఎదుగలేదు. ఎదగలేదు అనే కంటే… అవకాశాలు కల్పించలేదు .

ఎప్పుడూ సీనియర్లకు అవకాశాలు కల్పిస్తూ పోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఇప్పుడు పార్టీ ఓడిపోయిన తర్వాత తీరిగ్గా.. సమస్యలన్నీ.. సర్దుబాటు చేసుకుని.. యువ నాయకత్వానికి.. సీనియర్లతో ట్రైనింగ్ ఇప్పించగలిగే వెసులుబాటు దొరికింది. టీడీపీ అధినేత కూడా అదే అంచనా వేశారు. అందుకే.. యువతరానికి పార్టీ పదవుల్లో ప్రోత్సాహం ఇచ్చి.. వారిని ప్రభుత్వంపై పోరాటానికి రంగంలోకి దింపాలనుకుంటున్నారు. అయితే చంద్రబాబు ఎప్పుడూ ఆలోచించి.. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. చివరికి.. ఆ ఆలోచన..అమల్లోకి వచ్చే సరికి.. సమయం మించిపోతుంది. మరి ఈ సారైనా ముందడుగు వేస్తారా.. అన్నది కీలకం..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close