జగన్ క్లారిటీ ..! ఏపీలో ఫిరాయింపులకు షరతులు వర్తిస్తాయి..!

YS-Jagan
YS-Jagan

అధికారం ఎక్కడ ఉంటే.. నేతలు అక్కడ ఉంటారు. అది కామన్. అందుకే అందరి దృష్టి ఇప్పుడు… టీడీపీపై పడింది. టీడీపీలో గెలిచిన వాళ్లే అతి తక్కువ. వారిని వైసీపీ లాగేస్తుందా..? వారే.. వెళ్లిపోతారా..? అన్న చర్చ నడుస్తోంది. అయితే.. ఈ వలస విషయంలో జగన్మోహన్ రెడ్డి.. చాలా క్లారిటీతో ఉన్నారు. వచ్చే వాళ్లు ఎవరైనా.. పదవులన్నీ త్యాగం చేసి రావాల్సిందేనని చెబుతున్నారు. అలా అయితే సరే.. లేకపోతే లేదంటున్నారు.

జగన్ అలా అన్న తర్వాత ఎమ్మెల్యేలను లాక్కోగలరా..?

“దేవుడు చాలా పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రాశాడు. వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను లాగేశారు. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలే మిగిలారు… ” ఇదీ ..ఎమ్మెల్యేల సమావేశంలో జగన్ చెప్పిన మాట. దేవుడ్ని అమితంగా విశ్వసించే జగన్… ఇలాంటి వాక్యాలు చెప్పిన తర్వాత.. జగన్ లాంటి నేతలు.. మళ్లీ ఇతర పార్టీల ఎమ్మెల్యేల్ని చేర్చుకుంటారని ఎవరూ ఊహించలేరు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరిన వారికి కొంతమందికి టిక్కెట్లు దక్కకపోగా…మిగతా వారిలో కేవలం ఇద్దరు మాత్రమే గెలిచారు. ఇపుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో మళ్లీ ఫిరాయింపుల విషయం తెరపైకి వచ్చింది.

వైసీపీలోకి వెల్కం..! కానీ షరతులు వర్తిస్తాయి..!

తెలుగుదేశం పార్టీ తరపున 23 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. అటు లోక్ సభకు, ఇటు శాసనసభకు పోటీ చేసిన వారిలో అనేక మంది పరాజయం పాలవడంతో వీరిలో కొంతమంది వైసీపీ వైపు చూస్తున్నారు. జగన్ ఆహ్వానిస్తే కొంత మంది కొత్తగా ఎన్నికైన వారు కూడా.. చేరే అవకాశం ఉందని.. తెలంగాణ పరిణామాలను బట్టి స్పష్టమవుతోంది. కానీ వైసీపీలో మాత్రం ఇప్పట్లో తెలుగుదేశం నుంచి చేర్చుకునే అవకాశాలు కల్పించడం లేదు. వైసీపీకి పూర్తిస్థాయి మెజారిటీ రావడం, మరోవైపు తెలుగుదేశం నుంచి ఎవరైనా రావాలనుకుంటే వారు పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలలో ప్రజల తీర్పు తీసుకునేందుకు సిద్ధమైన వస్తేనే చేర్చుకుటామని చెబుతున్నారు.

స్థానిక ఎన్నికల్లోనే అసలు వ్యూహాలు..!

స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా రంగం సిద్దమయింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలలో ఓటర్ల జాబితాలను ప్రకటించి, ఎన్నికలకు రంగం సిద్దం చేసింది. సీఎం గా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే స్థానిక సంస్థల సమరం ప్రారంభం కానుంది. పార్టీలో ఉన్న వారందరూ ఆమోదిస్తేనే తీసుకోవాలని కొంతమంది సూచిస్తున్నప్పటికీ జగన్ మాత్రం వలసలు వద్దని చెబుతున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో ఉన్న వారికే అవకాశం ఇవ్వాలని ఆయన చెబుతున్నారంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com