ఏపీ రాజ‌కీయాల్లో హోరాహోరీకి బ్రేక్ ఉండ‌ద‌న్న‌మాట‌..!

ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌మాణం చేసిన త‌రువాత, తొలి ప్ర‌సంగంలోనే త‌న రాజ‌కీయ వైఖ‌రి ఎలా ఉండ‌బోతుందో స్ప‌ష్టం చేసేశారు. ప్ర‌తిప‌క్ష పార్టీ ప‌ట్ల తాము అనుసరించ‌బోతున్న విధానాలు ఏ విధంగా ఉంటాయో కూడా సంకేతాలు ఇచ్చేశారు. అంతేకాదు, చివ‌రికి మీడియాకి కూడా చెప్పాల్సింది చెప్పేశారు. తాము పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించే టెండ‌రింగ్ విధానాల‌పై అడ్డ‌గోలు విమ‌ర్శ‌లు చేస్తే… ప‌రువు న‌ష్టం కేసులు పెడ‌తామ‌ని హెచ్చ‌రించారు! ఏడాదిలోగా సుప‌రిపాల‌న ఏలా ఉంటుందో చూపించ‌డ‌మే త‌న ప్ర‌థ‌మ ల‌క్ష్యం అని చెప్పినా… రాజ‌కీయంగా తెలుగుదేశం పార్టీపై విరుచుకుప‌డ‌ట‌మే అధికార పార్టీ అప్ర‌క‌టిత మొద‌టి ల‌క్ష్యంగా క‌నిపిస్తోంద‌న‌డంలో సందేహం లేదు.

నిజానికి, ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర ముందుగానే ఏపీలో రాజ‌కీయ వేడి మొద‌లైపోయింది. తెదేపా, వైకాపా నేత‌ల మ‌ధ్య విమ‌ర్శ‌లతో రాజ‌కీయాలు హీటెక్కిపోయాయి. ఎన్నిక‌ల్లో ఓట‌మి ఎదుర్కొన్న వెంట‌నే, టీడీపీ కూడా ఇప్ప‌ట్లో ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల‌కు దిగ‌దు అనే వాతావ‌ర‌ణ‌మే క‌నిపించింది. పార్టీ నేత‌ల‌తో ఇదే మాట చంద్ర‌బాబు నాయుడు కూడా చెప్పారు. ప్ర‌జ‌ల‌కు వైకాపా చాలా హామీ ఇచ్చింద‌నీ, కొన్నాళ్ల‌పాటు వేచి చూద్దామ‌ని పార్టీ నేత‌ల‌తో చంద్ర‌బాబు అన్నారు. అయితే, ముఖ్య‌మంత్రి హోదాలో జ‌గ‌న్ తొలి ప్ర‌సంగం చూశాక‌… ఆ విరామం ఏపీ రాజ‌కీయాల్లో ఉండ‌దేమో అనిపిస్తోంది. ప్ర‌తిప‌క్ష‌మైన టీడీపీ మీద మాటల దాడి ప్రారంభించేశారు. ఇక‌, శాస‌న స‌భ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు అన్న‌ట్టుగా ఉంది!

తొలిరోజు నుంచే టీడీపీ మీద మాటల దాడులు చెయ్య‌డం త‌ప్పా, గ‌త పాల‌న‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం త‌ప్పా, మీడియాపై మాట్లాడ‌కూడ‌దా అంటే… అన్నీ చెయ్యొచ్చు. కానీ.. ముఖ్య‌మంత్రి తొలి ప్ర‌సంగంలోనే అవి ప్ర‌ముఖంగా క‌నిపించ‌కుండా ఉంటే బాగుండేది. ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో మాదిరిగానే… తొలి ప్ర‌సంగంలో కూడా టీడీపీ మీద విమ‌ర్శ‌లు చేయ‌డం అనేది ప్ర‌స్తుతం అన‌వ‌స‌రం క‌దా! టీడీపీని ప్ర‌జ‌లు విశ్వ‌సించ‌లేదు కాబ‌ట్టే… వైకాపాకి అధికారం క‌ట్ట‌బెట్టారు. ఇప్పుడు ప్ర‌జ‌లు జ‌గ‌న్ నుంచి ఎదురుచూసేది… టీడీపీని బాగా ఎండ‌గ‌డుతున్నార‌నో, గ‌ట్టి విమ‌ర్శ‌లు చేస్తున్నార‌నో కాదు క‌దా! జ‌గ‌న్ చేసే రాజ‌కీయ ప్ర‌సంగాల‌కు ఇక‌పై ప్ర‌జ‌ల్లో ప్రాధాన్య‌త త‌గ్గిపోతుంది. ప‌రిపాల‌నాప‌రంగా మాత్ర‌మే ఆయ‌న్ని చూస్తారు. ఏదేమైనా, మ‌రికొద్ది రోజుల్లో ఎండ‌ల తీవ్ర‌త త‌గ్గుతాయేమోగానీ… ఏపీలో రాజ‌కీయాల వేడి త‌గ్గేట్టుగా ప్ర‌స్తుతానికి క‌నిపించ‌డం లేదు..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close