ఎడిటర్స్‌ కామెంట్ : అందరికీ చేరని పథకాల వల్ల ప్రయోజనం ఏంటి..?

బడ్జెట్‌లో చెప్పిన విధంగా నగదు బదిలీ పథకాలకు డబ్బులను ప్రజలకు బదిలీ చేయడానికి రూ., 80,500 కోట్లు కావాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ లెక్క చెప్పారు. ఇది కేవలం వైఎస్ఆర్, జగనన్న పేరుతో ప్రవేశ పెట్టిన పథకాలకు పంచాల్సిన దానిపై ఆయన వేసిన లెక్క. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం గత ఏడాది రూ. లక్ష కోట్లకు అటూ ఇటూగా ఉంది. మరో ఎనభై వేల కోట్లను అప్పు తెచ్చి.. బడ్జెట్ నడిపించారు. ఈ ఏడాది బడ్జెట్‌లోనే రూ. 80, 500 కోట్లు పంచుడు పథకాలకు కేటాయించారు. ఇక ఉద్యోగుల జీత భత్యాలు, పెన్షన్లు ఏటా రూ. 70వేల కోట్ల వరకూ అవుతాతాయి. అంటే ఇక్కడే లక్షన్నర కోట్ల వరకూ లెక్క తేలుతోంది. అప్పులు ఈఎంఐలకు ప్రభుత్వం ఏటా నలభై వేల కోట్ల వరకూ చెల్లించాల్సి వస్తోంది. అంటే.. దాదాపుగా రూ. రెండు లక్షల కోట్ల బడ్జెట్ దాటిపోయింది. ఇక ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా… పెట్టుబడి వ్యయం లేకుండానే.. రెండు లక్షల కోట్లు అయిపోతుంది. మరి ఆదాయం ఎక్కడ్నుంచి వస్తుంది..? అంత మొత్తం బడ్జెట్ ఖర్చు పెట్టడం సాధ్యమేనా..?. పథకాలను కొంత మందికే పరిమితం చేసి .. ప్రచారం ఎక్కువ చేసుకుంటే .., పనైపోతుందా..?

ప్రభుత్వ పథకాలు ఎంత మందికి అందుతున్నాయి..?

నిజమే ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోంది. కానీ ఎంత మందికి ఇస్తోంది..? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం.. గత ఏడాదిలో రూ. 44వేల కోట్ల వరకూ పథకాల కోసం ప్రజలకు పంపిణీ చేశారు. అయితే అంత పెద్ద మొత్తం ఏ పథకాల కింద పంపిణీ చేశారో ప్రభుత్వం వివరణ ఇవ్వడం లేదు. ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం రైతు భరోసాకు రూ. 3,500 కోట్లు.. అమ్మఒడికి ఆరు వేల కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. ఈ రెండే బడా స్కీమ్‌లు. మిగతా పథకాలన్నింటికీ… రూ. 250 కోట్లు మించకుండా.. ఓ క్యాప్ పెట్టుకున్నట్లుగా అమలు చేస్తున్నారు. ఇక రూ. 44వేల కోట్లు ఎలా…? ఎవరికి పంపిణీ చేశారన్నది ప్రభుత్వమే వివరణ పత్రం విడుదల చేస్తే కానీ లెక్క తెలియదు. అయితే.. ప్రభుత్వం వేసే లెక్కలు చాలా చిత్రంగా ఉంటాయి. అన్ని పథకాల్లో భాగంగా.. ప్రజంలందరికీ పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని కూడా… వివిధ వర్గాలుగా విడగొట్టి.. ఆ కులానికి లబ్ది చేస్తున్న ఖాతాలో రాసేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా.. ఇలా చేయలేదు. ఆయా వర్గాలకు.. ప్రత్యేకంగా కార్పొరేషన్లు పెడితే.. ప్రభుత్వం కామన్‌గా అమలు చేసే పథకాలను అందులో కలపదు. ఆ వర్గానికి సాయం చేయడానికి విడిగా కార్పొరేషన్‌కు నిధులు కేటాయిస్తాయి. ఆవర్గం యువత ఆర్థికంగా ఎదుగడానికి .. సాయం చేసేవారు. కానీ ప్రభుత్వం ఇప్పుడు.. సామాజిక పించన్ల దగ్గర్నుంచి రేషన్ బియ్యం వరకూ మొత్తం.. లెక్క వేసి చెబుతోంది. అందుకే.. రూ. 44వేల కోట్ల లెక్క తేలుతోంది.

అతి తక్కువ లబ్దిదారులు.. ప్రచారం మాత్రం ఫుల్..!

అతి తక్కువగా లబ్దిదారులను ఎంపిక చేస్తూ.., ప్రభుత్వం మరో వంచనకు పాల్పడుతోంది. డ్రైవర్లందరికీ రూ.పదివేలు ఇస్తామన్నట్లుగా ఎన్నికలకు ముందు హడావుడి చేశారు. చివరికి సొంత వాహనం ఉండాలని రూల్ పెట్టారు. రజకులు, బార్బర్లు, టైలర్లు అందరికీ రూ. పదివేలు ఇస్తామని చెప్పారు. చివరికి సొంత దుకాణం ఉండాలనే రూల్ పెట్టారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న కాపు మహిళలకు ఏటా రూ. 15వేలు ఇస్తామన్నారు. లెక్క తీస్తే తేల్చింది కేవలం రెండున్నర లక్షల మందికి. ఏ పథకం కూడా నియోజకవర్గానికి వెయ్యి మంది కన్నా ఎక్కువగా లబ్ది చేకూరడం లేదు. నేతన్నలకు సాయం చేస్తానంటూ.. ప్రభుత్వం ఆర్భాటంగా ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చి మరీ చేస్తున్న సాయం కేవలం 80వేల మందికి. ఏపీలో చేనేత రంగంపై ఆధారపడిన కుటుంబాలు అంత తక్కువా అని మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ప్రభుత్వం అలా ప్రమాణాలు పెట్టుకుంది. అంత వరకే ఇవ్వాలనుకుంది. ఇస్తోంది. ఈ పథకాలను నియంత్రించడం వల్ల జరగబోయే అనర్థాలను ప్రభుత్వం అంచనా వేయడం లేదు. పథకాలు అందుకుంటున్న పదిశాతం మంది సంతృప్తిగా ఉండవచ్చు. కానీ.. తమకు ఇవ్వడం లేదని.. తొంభై శాతం మందిలో అసంతృప్తి ప్రారంభమవుతోంది. ఇది దావాలనంలా మారిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే .. ఆ అసంతృప్తి ప్రభుత్వాన్ని దహించి వేస్తుంది.

స్కీమ్‌ల సాయం కోసం ప్రభుత్వాఫీసుల చుట్టూ తిరుగుతున్న ప్రజలు..!

ప్రభుత్వ ఆదాయానికి… అమలు చేస్తున్న పథకాలకు పొంతన లేదు. అప్పులు తెచ్చి ఎల్ల కాలం పంచలేరు. అంటే.. ప్రభుత్వానికి ఉన్న మార్గం… వంద మందికి అందాల్సిన పథకాన్ని పది మందికి పరిమితం చేసింది.. 150 మందికి ఇస్తున్నామని ప్రచారం చేసుకోవడం. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. చేసుకుంటున్న ప్రచారం కొండంత… కానీ ప్రజలకు అందుతున్న సాయం మాత్రం గోరంత. సంక్షేమ పథకాల పేరుతో.. జగనన్న.. వైఎస్అర్ పేర్లతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. కానీ తమకు.. పథకం వర్తిస్తుందని.. ఎంతో ఆశలు పెట్టుకున్న కుటుంబాలు ఇప్పుడు.. మీరు నెలకు రూ. పదివేలు కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారన్న కారణంగా అర్హత లేదని వాలంటీర్లు… చెబుతూంటే.. మోసపోయామని గగ్గోలు పెడుతున్నారు. అందుకే.. నేతన్న హస్తం సాయం అందించిన రోజు… వివిధ జిల్లాల్లో నేతన్నలు చేసిన ఆందోళనలు వెలుగులోకి వచ్చాయి. అమ్మఒడి కోసం గ్రీవెన్స్ పెడితే… వేల మంది తరలి వచ్చే పరిస్థితి. ఇలాంటి పరిస్థితులే.. ప్రభుత్వం పథకాల పేరుతో.. ప్రజల అంచనాలను పెంచింది కానీ.. అందుకోలేకపోతోందని అర్థమవుతోంది.

కార్పొరేషన్ల పేరుతో సాయంలోనూ ప్రజలకు వేదనే..!

కులానికో కార్పొరేషన్ పెట్టి.. వేల కోట్ల నిధులు ఇస్తామని జగన్ పాదయాత్రల్లో ఉదరగొట్టారు. కానీ ఇప్పుడు ఆ కార్పొరేషన్లన్నీ… పథకాలకు నిధుల మళ్లింపులకే ఉపయోగపడుతున్నాయి. బీసీ కార్పొరేషన్ నుంచి కానీ.. కాపు కార్పొరేషన్ నుంచి కానీ.. ఆయన వర్గాల యువతకు ఉపాధి కల్పించేందుకు ఒక్కటంటే.. ఒక్క రూపాయి రుణం ఇవ్వడం లేదు. ఈ కార్పొరేషన్ల ఖాతా నుంచి ప్రతీ ప్రభుత్వం ఇచ్చే సామాజిక పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. అమ్మఒడి డబ్బులు పంపిణీ చేస్తున్నారు. వాటికి కార్పొరేషన్లకు సంబంధం ఏమిటనే ప్రశ్న ఇక్క వేయకూడదు. కాపు కార్పొరేషన్‌నే ఉదాహరణగా తీసుకుంటే.. చంద్రబాబు హయాంలో ఏటా వెయ్యి కోట్లు కేటాయించేవారు. దానితో.. ఆ వర్గం వారు వ్యాపారాలు చేసుకోవడానికి రుణాలు ఇచ్చేవారు. కానీ కొత్త ప్రభుత్వం రూ. 2845 కోట్లు కేటాయించామని చెబుతోంది. ఆ డబ్బులతో ఏం చేస్తోంది..? కాపు వృద్ధులకు సామాజిక పెన్షన్లకే ఏటా రూ. 1042 కోట్లు చెల్లిస్తున్నామని ప్రకటించేశారు. అది కాపు కార్పొరేషన్ ఖాతాలో వేసేశారు. ఇతర ప్రభుత్వాలు కూడా పెన్షన్లు ఇచ్చాయి. కానీ అది కాపు కార్పొరేషన్ కోటా కాదు. ఆ తర్వాత అమ్మఒడి పథకం కింద రూ. 571 కోట్లు, కాపు నేస్తం పథకానికి రూ. 350కోట్లు, ఆసరా అనే పథకం కింద రూ. 315 కోట్లు, పిల్లల చదువుల ఫీజు రీఎంబర్స్‌మెంట్ రూ. 301 కోట్లు, హాస్టల్ ఫీజులు రూ. 183 కోట్లు, వాహన మిత్ర రూ. 30కోట్లు.. చివరికి లా నేస్తం అనే పథకం పేరుతో కూడా రూ. 41 లక్షలు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఇవన్నీ కాపు కార్పేరేషన్‌కు సంబంధం లేని పథకాలు. విడిగా మేనిఫెస్టోలో ఇచ్చినహామీలు. వీటిని అమలు చేస్తూ.. కాపు కార్పొరేషన్‌కు రెండువేల కోట్లు ఇస్తామని జగన్ ప్రకటించారు. కానీ.. ఆ పథకాలకు ఇస్తున్న సొమ్ము అంతా… ఈ కార్పొరేషన్ నుంచే ఇస్తున్నట్లుగా ప్రకటించేసి.. కాపుల్ని అడ్డంగా మోసం చేసేస్తున్నారన్నమాట. ఈ ఫార్ములా ఒక్క కాపు కార్పొరేషన్ కే.. కాదు.. బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి ఎస్సీ కార్పొరేషన్ వరకూ.. అన్ని చోట్లా ఉంది. వారికి ప్రత్యేకంగా సబ్ ప్లాన్ ఉంది. ఆ నిధుల్ని మళ్లించకూడదు. మళ్లీస్తే నేరం. అయినప్పటికీ.. కార్పొరేషన్ కింద ఆ పథకాలను అమలు చేస్తున్నట్లుగా చూపిస్తున్నారు.

వర్తించలేని విధంగా అర్హతలను మారిస్తేనే పథకం పారుతుందా..!?

ముఖ్యమంత్రి జగన్ .. ఎప్పుడు సమీక్ష చేసినా.. అధికారులకు ఓ మాట చెబుతూ ఉంటారు. అర్హులకు ఎవరికైనా పథకం అందకపోతే… మీరే బాధ్యులు..మిమ్మల్నే శిక్షిస్తానని. ఆ మాటల సారాంశం. అర్హులు అనే పదాన్ని సీఎం జగన్ నొక్కి చెబుతూంటారు. ఇక్కడే మతలబు ఉంది. ఆ అర్హులు ఎవరు..?. 90 శాతం మందిని ఎలిమినేట్ చేసేలా అర్హతల్ని ఖరారు చేసేది ప్రభుత్వం. ఇక అర్హులు ఎక్కడి నుంచి వస్తారు. కులం చూడం..మతం చూడం.. అందరికీ సాయం అనేదే జగన్ నినాదం. కానీ.. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక..కనీసం యాభై అర్హతా ప్రమాణాలను పథకాలు పొందడానికి నిర్దేశించారు. ఫలితంగా.. పది శాతం మందికీ పథకాలు దక్కడం లేదు.

మేనిఫెస్టోలో ప్రతి కుటుంబానికి ఏటా రూ. రెండు నుంచి ఐదు లక్షల లబ్ది కలిగిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏపీలో సగానికిపైగా కుటుంబాలకు ఒక్కటంటే.. ఒక్క పథకమూ వర్తించడం లేదు. ప్రజలకు సాయం చేసినట్లు కనిపించడం.. ప్రచారం చేసుకోవడం మాత్రమే కాదు.. నిజంగా సాయం చేయాలి. అందర్నీ మెప్పించాలి. అప్పుడే ప్రయోజనం. లేకపోతే.. ప్రజల్లో గూడుకట్టుకునే అసంతృప్తి లావాలా బయటకు వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close