కోస్తాలో అభ్యర్థుల కొరత, వంగా గీత కి ఫోన్ చేసిన జగన్?

గత కొద్ది సంవత్సరాలుగా తమ పార్టీ, కోస్తాంధ్ర తో సహా రాష్ట్రం మొత్తం బలంగా ఉందని, ఏ క్షణాన ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నామని చెబుతూ వచ్చిన వై ఎస్ ఆర్ సి పి మాటలు డొల్ల ఏమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ మధ్య కొంత కాలంగా కోస్తాంధ్రలో తనను గతంలో తీవ్ర పదజాలంతో విమర్శించిన నాయకులను సైతం చేర్చుకుంటూ వారికి టికెట్లు కూడా కన్ఫామ్ చేస్తున్న జగన్ ఇప్పుడు కాకినాడ ఎంపీ స్థానం కోసం అభ్యర్థుల వేటలో పడ్డారు. ఏనాడు తన గురించి కానీ, తమ పార్టీ గురించి కానీ ఒక్క ముక్క కూడా మాట్లాడని వంగ గీత కు జగన్ స్వయానా ఫోన్ చేశారని తెలుస్తోంది. తమ పార్టీలోకి రమ్మని ఆవిడను ఆహ్వానించినట్టు, ఒకవేళ పార్టీలో చేరితే కాకినాడ ఎంపీ టికెట్ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు జగన్ స్వయంగా తానే ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఈ రూమర్ తెగ హల్చల్ చేస్తోంది.

https://www.telugu360.com/te/ysrcp-lacks-candidates-in-coastal-andhra/

మొన్నామధ్య రఘురామకృష్ణరాజు కు, దాడి వీరభద్ర రావుకు కండువా కప్పిన వైయస్ జగన్ వారిద్దరికీ సీటు ఇస్తానని హామీ ఇచ్చినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే కిల్లి కృపారాణి ని కూడా ఆఖరి నిమిషంలో పార్టీలో చేర్చుకున్నారు. ఆవిడకు కూడా శ్రీకాకుళం ఎంపీ టికెట్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే బాటలో వంగా గీత ని చేర్చుకోవడానికి వై ఎస్ ఆర్ సి పి గట్టిగా ప్రయత్నిస్తోంది. గీత గతంలో టిడిపి తరఫున రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యంలో చేరి పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే గత ఐదేళ్లుగా రాజకీయాల్లో చురుగ్గా లేరు. జగన్ కాకినాడ ఎంపీ స్థానానికి తన పార్టీలో ఉన్న అభ్యర్థులు ఎవరు గెలిచే స్థాయిలో లేరని అనుకున్నారో, లేదంటే కాపు సామాజిక వర్గం ఓట్లు బలంగా ఉన్న ఈ స్థానం నుండి జనసేన కు గట్టిపోటీ ఇవ్వాలంటే వంగ గీత లాంటి అదే సామాజిక వర్గానికి చెందిన వారే సరి అని అనుకున్నారో తెలియదు కానీ ఆవిడను ఆయనే స్వయంగా పార్టీలోకి ఫోన్ చేసి ఆహ్వానించినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. జగన్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించే సరికి వంగ గీత కూడా వై ఎస్ ఆర్ సి పి లో చేరడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.

ఒకవేళ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ఈ రూమర్ నిజమైనదే అయితే మరో రెండు మూడు రోజుల్లో వంగ గీత వైఎస్ఆర్సిపి కండువా కప్పుకోవడం ఖాయం అని తెలుస్తోంది. మరి ఇన్ని సంవత్సరాలుగా పార్టీని అంటిపెట్టుకున్న వారిని కాదని ఈవిడకు టికెట్ ఇవ్వడం పార్టీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఆఖరి నిమిషంలో లో చేరిన ఈవిడ గెలుస్తుందా అన్న విషయాలు తెలియాలంటే ఫలితాలు వచ్చే దాకా ఆగాల్సిందే

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

ఖ‌మ్మం పంచాయితీ మ‌ళ్లీ షురూ… ఈసారి కాంగ్రెస్ లో!

ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాలు అంటేనే ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ న‌డుస్తూనే ఉంటుంది. అధికార పార్టీలో నాయ‌కుల మ‌ధ్య స‌యోధ్య చాలా క‌ష్టం. మొన్న‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో తుమ్మ‌ల‌,...

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close