కేంద్రంపై కాదు..రాష్ట్రంపైనే యుద్ధం..! బంద్‌కు పిలుపునిచ్చిన జగన్..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. దీనికి కారణం… ప్రత్యేకహోదాపై కేంద్రం తీరుకు నిరసనగానట. కేంద్రం ప్రత్యేకహోదా ఇవ్వలేదు.. అందుకనే.. సొంత ప్రజలను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు జగన్. పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ వాయిస్‌ని వినిపించే అవకాశాన్ని రాజీనామాల ద్వారా కావాలనే పోగొట్టుకున్న వైసీపీ అధినేత.. జరిగిపోయిన డ్యామేజీని కొద్దిగా అయినా కంట్రోల్ చేసుకునేందుకు కాకినాడలో ప్రెస్‌మీట్ పెట్టారు. నరేంద్రమోడీ.. పార్లమెంట్‌లో చెప్పిన మాటలను సాక్ష్యంగా చేసుకుని… తెలుగుదేశం పార్టీ మీద…చంద్రబాబు మీద ఆరోపణలు చేశారు. నాలగేళ్లు పాటు హోదా కోసం పోరాడిన హోదాయోధుడ్ని తానేనని స్వయం సర్టిఫికెట్ ఇచ్చుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు.

కానీ అసలు ప్రత్యేకహోదా ఇవ్వాల్సిన కేంద్రాన్ని కానీ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీని కానీ.. ఎక్కడా ఒక్క మాట అనడానికి సాహసించలేకపోయారు.. ప్రతిపక్ష నేత జగన్. ఏపీపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు చూసి తనకు బాధేస్తోందన్నారు కానీ… అలా ఎందుకు చేస్తున్నారు.. ప్రత్యేకహోదా ఎందుకు ఇవ్వరని మాత్రం డిమాండ్ చేయలేకపోయారు. కనీసం నరేంద్రమోడీ పేరు ఎత్తే ధైర్యం కూడా చేయలేకపోయారు. ప్రత్యేకహోదా విషయంలో పార్లమెంట్‌లో జరిగినచర్చలో పాల్గొనే అవకాశాన్ని రాజీనామాలతో కోల్పోయిన వైసీపీ.. తన వాదనను… కాకినాడలో వినిపించింది. విభజన హామీలపై.. పార్లమెంట్‌లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ ముగిసింది. ఆ చర్చను వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ఫాలో అవలేదు. సాయంత్రం వరకూ ఆయన కోర్టులో ఉన్నారు. కానీ సాయంత్రం మాత్రం.. తాను చాలా దగ్గరగా పార్లమెంట్‌ సమావేశాల్ని ఫాలో అవుతున్నానని… ఉదయమే స్పందిస్తానని ట్వీట్ చేశారు. అనుకున్నట్లుగానే ప్రెస్‌మీట్ పెట్టారు.

నాలుగేళ్ల పాటు అసెంబ్లీలో హోదా కోసం పోరాడామని.. జగన్ చెప్పుకొచ్చారు. కానీ ఏడాది నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వైపే చూడటటం లేదు. ప్రెస్ మీట్ మొత్తం మీద.. కేంద్రం తీరుపై కానీ… విభజన హామీల విషయంలో చేస్తున్న నయవంచనపై కానీ.. ఎక్కాడ పోరాటం చేస్తునట్లు ప్రకటించలేదు. కేవలం నాలుగేళ్లుగా తాము ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నామని చెప్పుకునేందుకు ఎక్కువ సమయం కేటాయించారు. ఆ తర్వాత చంద్రబాబును దోషిగా చూపెట్టేందుకు ఉత్సాహం చూపించారు. పార్లమెంట్‌లో ఏం జరిగిందో చూసిన తర్వాత బీజేపీతో చంద్రబాబు కుమ్మక్కయారని చెప్పేందుకు జగన్ వెనుకాడలేదు. దానికి ఆయన చెప్పిన కారణాలు.. టీటీడీ బోర్డు మెంబర్‌గా… మహారాష్ట్ర బీజేపీ నేత భార్యకు చాన్సివ్వడం… ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ప్రారంభోత్సతవానికి వెంకయ్యనాయుడు రావడం. జగన్ అన్నీ చెప్పారు.. కానీ అసలు రాజకీయం మాత్రం మిస్సయ్యారు. జగన్‌ చేస్తున్న రాజకీయం ఆ పార్టీ నేతలకే అర్థం కావడం లేదు. ఎన్నికలకు ముందు అయినా.. బీజేపీపై యుద్ధం ప్రకటించి ఉంటే… బాగుండేదన్న అభిప్రాయం వైసీపీ నేతల్లో ఉంది. కానీ అది జగన్ వల్ల కావడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close