నేడే ఫైనల్ : అమరావతి తరలింపునకు “షార్ట్ కట్స్” ..!

రాజధానిగా అమరావతికి ముగింపు పలికేందుకు జగన్ సిద్ధమయ్యారు. ప్రజలు ఇచ్చిన 151 సీట్ల బలంతో.. వచ్చిన పోలీసు పవర్స్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ.. ఆయన రాజధానిని విశాఖకు తరలించడానికి అసెంబ్లీలో బిల్లు పెట్టబోతున్నారు. అయితే.. ఈ తరలింపును.. నేరుగా చేయలేని పరిస్థితిని ప్రభుత్వం ఎదుర్కొంటోంది. అందుకే.. షార్ట్ కట్స్‌నే నమ్ముకుంది. అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రత్యేకంగా ఓ అడ్డదారిని హుటాహుటిన నిర్మించుకోవడం మాత్రమే కాదు.. రాజధాని తరలింపు అనే విషయాన్ని కూడా.. నేరుగా.. తాను ప్రవేశ పెట్టబోయే బిల్లుల్లో చెప్పడం లేదు. అక్కడ అడ్డదారి మార్గాన్నే ఎంచుకుంది.

ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పుడూ వెళ్లే రోడ్డులో కాకుండా.. ఓ షార్ట్ కట్‌ ను నిర్మించారు అధికారులు., కృష్ణాయపాలెం చెరువు నుంచి శాసనసభకు రావడానికి వీలుగా రోడ్డును మట్టి రోడ్డును నిర్మించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ కూడా.. మందడం మీదుగా కాకుండా.. ఈ అడ్డదారిలోనే వెళ్లనుంది. ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్న బిల్లుల్లో కూడా.. ఎక్కడా రాజధాని తరలింపు అనే పదం రాకుండా.. జాగ్రత్త పడుతున్నారు. నాలుగు డెలవప్‌మెంట్ కౌన్సిళ్లను ఏర్పాటు చేస్తున్నామని.. మాత్రమే చెబుతున్నారు. వాటికి రాజధానిని తరలించే అధికారులను కట్టబెట్టి.. ఆ తర్వాత.. వాటిని ఉపయోగించుకుని… విశాఖకు రాజధానిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇది కూడా… షార్ట్ కట్‌నే. రాజధాని తరలిస్తున్నామని చెబితే.. రైతులకు రూ. నాలుగు లక్షల కోట్ల పరిహారం చెల్లించాల్సి వస్తుంది. అందుకే.. రాజధాని తరలిస్తున్నామనే మాట లేకుండా.. పని పూర్తి చేస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం… అడ్డదారుల్లో వెళ్లడానికి సిద్ధమయిందన్న విషయం.. సింబాలిక్‌గా.. అటు.. అసెంబ్లీకి వెళ్లే విషయంలోనూ.. ఇటు.. బిల్లులో ఉన్న అంశాలతోనూ స్పష్టమయిందన్న అభిప్రాయం.. ప్రజల్లో ఏర్పడుతోంది. విపక్ష పార్టీలు కూడా ఇదే అంశాన్ని హైలెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వం తీరును చర్చనీయాంశం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close