జ‌గ‌న్ ప‌ట్టు: ఏపీలో షూటింగ్ చేయాల్సిందే!

చాలా కాలంగా… టాలీవుడ్ ఏపీకి దూర‌మైంది. చిత్ర‌సీమ అంతా హైద‌రాబాద్ చుట్టూనే తిర‌గ‌డం, ఇక్క‌డే ప్ర‌ధాన‌మైన స్టూడియోలు ఉండ‌డంతో.. ఏపీ వైపు ఎవ‌రూ చూడ‌డం లేదు. మ‌హా అయితే విశాఖ‌ప‌ట్నం వెళ్తున్నారు. బీచ్ అందాల కోసం. ప‌ల్లెటూరి క‌థైతే.. అమలాపురం, రాజోలు అంటూ ఓ ప‌ది, ప‌దిహేను రోజుల ట్రిప్‌వేస్తున్నారు. అవి కూడా చిన్న సినిమాల వ‌ర‌కే. స్టార్లున్న సినిమా అయితే.. ప‌ల్లెటూరి క‌థంటూ వ‌స్తే.. పొల్లాచ్చీ పోతున్నారు. పెద్ద సినిమాలు ఏపీలో షూటింగ్ చేసిన దాఖ‌లాలు చాలా త‌క్కువ‌. దీనిపై ఏపీ ప్ర‌భుత్వం దృష్టి పెట్టింది. ఏపీలో షూటింగ్ చేయాల్సిందే.. అంటూ నిర్మాత‌ల‌కు ష‌ర‌తులు విధిస్తోంది. ఈ మేర‌కు.. సీఎం జ‌గ‌న్ కూడా ఈరోజు జ‌రిగిన మీటింగ్ లో త‌న అభిప్రాయం బ‌ల్ల‌గుద్దిన‌ట్టు మ‌రీ చెప్పార‌ని తెలుస్తోంది.

స‌గం సినిమా ఏపీలో చేయాల‌ని, అలాంటి సినిమాల‌కే స‌బ్సీడీలు, 5వ ఆట‌కు అనుమ‌తులూ, టికెట్ రేట్ల పెంపులో మిన‌హాయింపులు ఇస్తామ‌ని స్ప‌ష్టం చేసిన‌ట్టు స‌మాచారం. కనీసం 20 శాతం షూటింగ్ జ‌ర‌పాల‌ని, లేని ప‌క్షంలో.. ప‌రాయి రాష్ట్రం నుంచి వ‌చ్చిన సినిమాలానే చూస్తామ‌ని జ‌గ‌న్ చెప్పార్ట‌. ఏపీలో షూటింగులు చేసుకోవ‌డానికి మేం రెడీ అంటూ.. సినిమా పెద్ద‌లు చెప్పార‌ని, దాంతో జ‌గ‌న్ సంతృప్తి వ్య‌క్తం చేశార‌ని తెలుస్తోంది. అయితే ఏపీలో స‌రైన స్టూడియోలు లేవు. విశాఖ‌లో రామానాయుడు స్టూడియో ఉన్నా… అందులో స‌క‌ల స‌దుపాయాలూ లేవు. చాలా కాలంగా అక్క‌డ షూటింగులు జ‌ర‌గ‌డం లేదు. కొత్త స్టూడియోల‌కు అనుమ‌తి ల‌భిస్తే.. స్టూడియోల సంఖ్య పెరిగితే క‌చ్చితంగా ఏపీలో షూటింగులు చేసుకోవ‌డానికి ఎలాంటి అభ్యంత‌రం లేదు. ఇప్ప‌టికే కొంత‌మంది అగ్ర క‌థానాయ‌కులు, నిర్మాత‌లు ఏపీలో స్టూడియోల కోసం స్థ‌లాల‌ను ఇవ్వాల‌ని ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు వాళ్లంద‌రికీ అనుమ‌తులు ఇచ్చే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close