జగన్ రెడ్డి హయాంలో ఏపీలో జేపీ వెంచర్స్ అనే సంస్థ ఇసుకను కొనేసింది. అడ్డగోలుగా ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు చేసింది. వేల కోట్లు సంపాదించుకుంది. కానీ పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి అడ్డంగా దొరికిపోయింది. దోపిడీ గురించి ప్రభుత్వం వద్ద అన్ని ఆధారాలు ఉన్నా ఇంకా సీరియస్ గా దృష్టి పెట్టలేదు. కానీ పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినందుకు మాత్రం జరిమానా కట్టాల్సి వస్తోంది. శిక్షలూ ఉంటాయి. అందుకే జేపీ వెంచర్స్ కొత్తగా ఆలోచించింది. ఆ ఇసుక తవ్వకాలకు.. అనుమతులు తీసుకుంది ప్రభుత్వమేనని కాబట్టి ప్రభుత్వమే జరిమానా కట్టాలంటోంది. అబ్బా ఎంత తెలివి..దోచుకుంది.. వాళ్లు.. కట్టాలంటోంది ప్రభుత్వం. ఇలాంటి ప్లాన్ చేసింది గత ప్రభుత్వ పెద్దలే.
ఇసుక దోపిడీ వ్యవస్థీకృతం
జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఏపీలో చేసిన నిర్వాకాలు అన్నీ ఇన్నీ కావు. మద్యం స్కాం చేసి వేల కోట్లు దోపిడీ చేసి అంతా ప్రభుత్వ రంగంలో ఉంటే అవినీతి ఎలా జరుగుతుందని వింత వాదన చేస్తారు. మద్యంతో పాటు ఇసుకను కూడా అలాగే దోచేశారు. ఎంతగా అంటే రాష్ట్రం మొత్తం ఓ బినామీ కాంట్రాక్టర్ ను పెట్టుకుని.. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి వేలం వేసి వసూలు చేసుకున్నారు. కానీ రికార్డుల్లోమాత్రం జేపీ వెంచర్స్ అనే సంస్థ మాత్రమే ఉంది. ఐదు సంవత్సరాల పాటు విచ్చలవిడిగా సాగిన ఇసుక దందా వల్ల వేల కోట్లు అక్రమార్కులు సంపాదించుకున్నారు.
దోపిడీ వాళ్లది.. జరిమానాలు ప్రభుత్వానికట
ఆ ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా తవ్వేశారు. నదీ లోతుల్లో కూడా తవ్వడం వల్ల అన్నమయ్య డ్యాం లాంటివి కొట్టుకుపోయాయి. నదుల్లో నీళ్లు లేనప్పుడు తవ్వడం వల్ల ఎంతో మంది ఇసుక మేటల్లో ఉన్న గొయ్యిల్లో పడి ప్రాణాలు కోల్పోయారు. అసలు ఆ తవ్వకాలకు అనుమతులు లేవు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారు. ఎన్జీటీ వరకూకేసు వెళ్లింది. పెద్ద ఎత్తున జరిమానా వేసింది. అయితే ఆ తవ్వకాలకు అనుమతులు ప్రభుత్వమే తీసుకుందని .. ప్రభుత్వమే జరిమానా కట్టాలని కొత్తవాదన తీసుకు వచ్చారు. వారి తెలివి చూసి.. కరుడు గట్టిన గజదొంగలకూ మైండ్ బ్లాంక్ అయిపోతుంది.
ఇలాంటి దొపిడీదారులు రాజకీయాలు చేస్తే ప్రజలకే క్షవరం
రాజమండ్రిలోఇసుక దొరకడంలేదు. వ్యవస్థీకృతం అయిపోయింది. దోపిడీ నగదు అంతా తాడేపల్లికే చేరుతోందని అప్పట్లో జగన్ రెడ్డి శ్రేయోభిలాషి ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా బాధపడ్డారు. అంతేనా .. జేపీ వెంచర్స్ పేరు పెట్టి.. తాడేపల్లి ముఠా ఎక్కడికక్కడ రేట్లు పెట్టి రీచ్‌లు లీజుకు ఇచ్చింది. ఆ రీచ్‌లను అనధికారికంగా తీసుకున్న వాళ్లనూ దోపిడీ చేశారు. కొంత మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఇలాంటి వారు ఇప్పుడు చట్టాలను బురిడీ కొట్టించి.. ఆ పాపానికి పడే జరిమానాలు, శిక్షలు కూడా ప్రజలకే పడేలా చేస్తున్నారు.
