నాలుగైదు నెలల్లో ఎన్నికలొస్తాయని జగన్‌కు ఎవరు చెప్పారు..?

విశాఖలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అసెంబ్లీ, పార్లమెంట్ స్థాయి నేతలందరితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో.. జగన్ చేసిన వ్యాఖ్యలు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేశాయి. ఆ వ్యాఖ్యలేమిటంటే.. ” వచ్చే నాలుగైదు నెలల్లోనే” ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి… సర్వం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. దీంతో… వైసీపీ నేతలంతా ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. నాలుగైదు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి కానీ..ఏపీలో ఎలా జరుగుతాయని… వాళ్లు తికమకపడ్డారు. జగన్ ప్రకటనపై.. టీడీపీ నేత, ఏపీ మంత్రి లోకేష్‌ కూడా సెటైర్లు వేశారు. జగన్‌కు హాట్‌లైన్‌లో మోడీ చెప్పారా అని ప్రశ్నించారు.

షెడ్యూల్ ప్రకారం.. వచ్చే ఏప్రిల్, మే నెలలలో ఎన్నికలు జరుగుతాయి. ఎలా లేదన్నా.. ఏడెనిమిది నెలలు పడుతుంది. జగన్మోహన్ రెడ్డికి ఇది తెలియనిదేమీ కాదు. అయినా నాలుగు నుంచి ఐదు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో.. జనవరి నాటికి సర్వం సిద్ధంగా ఉండాలని జగన్‌పిలుపునిచ్చారు. పాదయాత్ర కొనసాగుతుండగానే నియోజక వర్గాలు, బూత్‌ల వారీగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. జగన్ తీరు చూస్తే. … కేంద్ర ప్రభుత్వం కూడా ముందస్తుకు వెళ్లే ఆలోచన చేస్తుందేమో… కేంద్రంతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా..ఆ విషయం తన దరిచి చేరిందేమోనన్న సందేహాలు.. వైసీపీలోనే వ్యక్తమవుతున్నాయి. మరికొంత మంది శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడను గుర్తుకు చేసుకుంటున్నారు. విచారణ సంస్థలు చంద్రబాబును అరెస్ట్ చేస్తాయని జగన్ భావిస్తున్నారని.. అందుకే నాలుగైదు నెలల్లోనే ఎన్నికలొస్తాయని చెబుతున్నారని విశ్లేషించుకున్నారు.

అయితే.. జగన్‌కు అలా చెప్పడం అలావాటేనని.. వైసీపీలో పండిపోయిన మరికొంత మంది నేతలు చెబుతున్నారు. దానికి సాక్ష్యంగా గతంలో జగన్ చేసిన ప్రకటలను ఉదహరిస్తున్నారు. నాలుగేళ్ల కిందటి నుంచి.. ఇంకా రెండేళ్లలో ఎన్నికలొస్తాయని.. మరో ఏడాదిలో సీఎం అవుతానని పదే పదే ప్రకటించుకునేవారని గుర్తు చేస్తున్నారు. నాలుగేళ్ల సమయం ఉన్నా.. రెండేళ్లే అని చెప్పుకునేవారని.. ఇప్పుడు తొమ్మిది నెలల సమయం ఉన్నా..ఆ తరహాలోనే మూడు నాలుగు నెలలు తగ్గించుకుని చెబుతున్నారని అంటున్నారు. అయితే ఏమీ లేకపోతే.. ఎన్నికలకు సన్నద్ధం కావాలని. నిర్దేశించేందుకు ప్రత్యేకంగా… అసెంబ్లీ, పార్లమెంటరీ స్థాయి నేతలందరితో.. సమావేశం ప్రత్యేకంగా పెట్టడమెందుకన్న ప్రశ్నలు సహజంగానే ఉదయిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close