ఫ్యాక్ట్ చెక్ : జగన్ ప్రమాణ స్వీకార ఖర్చు ఎంత..!?

నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణస్వీకారోత్సవం.. అట్టహాసంగా జరిగింది. కనీసం 40 వేల మందికి ఆహ్వానాలు వెళ్లాయి. అంతకు మించిన ఏర్పాట్లు జరిగాయి. విజయవాడ నగరం మొత్తం.. ఎల్‌ఈడీ స్క్రీన్లతో నింపారు. అతిధుల కోసం స్టార్ హోటళ్లన్నీ బుక్ చేశారు. ఈ హంగామాతో.. ఎంత ఖర్చయిందనేది… ప్రజల్లో హాట్ టాపిక్‌గా మారింది. మామూలుగా అయితే విషయం అయ్యేది కాదు.. కానీ ఏపీ అప్పుల్లో ఉంది.. తాము నిరాడంబరంగా పని కానిచ్చేస్తున్నామని వైసీపీ నేతలు చెబుతూండటంతోనే ఈ చర్చ బయటకు వస్తోంది.

రూ. 29 లక్షల 10 వేలు అడ్వాన్స్ విడుదల..!

“ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణస్వీకారం ఉంటుంది. అక్కడ చేస్తే ఎంత ఖర్చవుతుందని జగన్ … సీఎస్ ఎల్వీని అడిగారు. ఆయన ఐదారు లక్షలవుతుంది చెప్పారు. కానీ.. జగన్ మాత్రం అంత ఖర్చవడానికి వీల్లేదు.. రూ. రెండు లక్షలతో పని కానిచ్చేయండి.. అని చెప్పారు. జగన్ పొదుపు ఈ అడుగుతోనే ప్రారంభమయింది”.. ఇది ఓ వైసీపీ అనుకూల మీడియాలో వచ్చిన వార్త. ఇన్ సైడ్ న్యూస్ కాబట్టి… అలా రాశారు. దీని ప్రకారం చూస్తే… జగన్ ప్రమాణస్వీకారం ఖర్చు రూ. రెండు లక్షల్లోపే ఉండాలి. కానీ… ప్రమాణస్వీకారం ముగిసిన రోజున… రూ. 29 లక్షల 10 వేల రూపాయలు.. ప్రమాణస్వీకార ఏర్పాట్ల కోసం అడ్వాన్స్‌గా విడుదల చేస్తూ.. ఓ జీవోను విడుదల చేశారు. అది కేవలం అడ్వాన్స్ మాత్రమే.. అసలు మొత్తం కాదు. అంటే కచ్చితంగా రూ. 29లక్షలకుపైనే ఖర్చయ్యాయి.

అడ్వాన్స్ గా ఇచ్చేది ఇరవై శాతం లోపే..!?

ప్రభుత్వానికి సంబంధించి ఏ పని చేయాలనుకున్నా… సంబంధిత సర్వీస్ ప్రొవైడర్లకు ముందుగా.. ఇచ్చే అడ్వాన్స్ పది నుంచి ఇరవై శాతానికి మించవు. అసాధారణ పరిస్థితుల్లో నలభై,యాభై శాతం వరకూ ఇస్తారు. కానీ ఇక్కడ అలాంటి అసాధారణ పరిస్థితులేమీ లేవు కాబట్టి… పరిమితంగానే అడ్వాన్స్ మంజూరు చేశారనుకుంటే… ప్రమాణస్వీకారం ఖర్చు.. రెండు, మూడు కోట్ల వరకూ లెక్క తేలే అవకాశం ఉంది. ఈ ఖర్చు కేవలం… స్టేజీ ఏర్పాటు, అతిధులకు మర్యాదలు, ఎల్‌ఈడీ స్క్రీన్ల ఏర్పాటు… వచ్చిన వారికి టీ, కాఫీలు, నీళ్లు.. ఇతర సౌకర్యాల కోసం.. వెచ్చించినవే. ప్రమాణస్వీకానికి అధికారికంగా ఆహ్వానించిన వారు.. దాదాపుగా పదిహేను వేల మంది ఉన్నారు. అలాగే.. వీఐపీ అతిధుల కోసం… విజయవాడలో స్టార్ హోటళ్లను బుక‌ చేసినట్లు తెలుస్తోంది. ఎలా చూసినా… ఏర్పాట్లు, సౌకర్యాల ఖర్చు.. రెండు, మూడు కోట్ల దాకా తేలుతుందని.. ఇలాంటి ఏర్పాట్లు చేసిన కాంట్రాక్టర్ల అంచనా.

మరి పేపర్ ప్రకటనలు.. ప్రచార ఖర్చు ఎంత..?

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకుండానే… వైసీపీ ప్రచార పోస్టర్లలా.. ఐ అండ్ పీఆర్.. పత్రికలు.. ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చింది. నిబంధనలకు మొదటి రోజే పాతరేసి.. జగన్‌కు చెందిన సాక్షి దినపత్రికకు.. రెండు పేజీల ఫుల్ యాడ్స్ ఇచ్చింది. సహజంగా అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికకు.. ఎక్కువ ఇవ్వాలి. కానీ ఇక్కడ మాత్రం… సాక్షికి ప్రాధాన్యత ఇచ్చారు. నిబంధనలు కాకపోయినా… జగన్ ప్రమాణస్వీకారానికి ప్రకటల రూపంలో.. ఐ అండ్ పీఆర్.. కనీసం నాలుగు కోట్ల వరకూ.. వ్యయం చేసి ప్రకటనలు ఇచ్చిందని… ఆయా పత్రికల.. ఫ్రంట్ పేజీ యాడ్స్ రేట్లు చూస్తే అర్థమైపోతుంది.

అన్నీ కలిపి కోట్లు దాటేసి ఉంటుందా..?

ప్రచార ఆర్భాటం, ఇందిరాగాందీ మున్సిపల్ స్టేడియం అలంకరణ, అతిధుల మర్యాదలు ఇలా… ప్రతీ ఒక్కదాన్ని లెక్క తీసి చూస్తే.. జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకార ఖర్చు కోట్లు దాటేసి ఉంటుందని అంచనా. అడ్వాన్స్ జీవో మాత్రమే బయటకు వచ్చింది. అసలు వివరాలు.. అధికారికంగా బయటపెట్టే అవకాశం లేదు. నిజానికి 30వ తేదీ వరకూ.. జగన్ ప్రమాణస్వీకారం చేయలేదు. అంటే.. అప్పటి వరకూ… ఆయన సీఎం కాదు. కానీ.. అవడం వంద శాతం పక్కా కాబట్టి.. ఆయన ఆదేశాలను ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలుగానే అధికారులు పరిగణించి.. ప్రమాణస్వీకార ఏర్పాట్లు చేయాలి. చేశారు కూడా. ప్రమాణస్వీకారం పూర్తయిన తర్వాత అడ్వాన్స్ ఇస్తూ జీవోలు జారీ చేశారు. కార్యక్రమం అయిపోయిన తర్వాత జీవోలు ఎందుకో చాలా మందికి అర్థం కాలేదు. అసలు లోగట్టేమిటో… ఎలా తెలుస్తుంది..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్ సర్కార్ చేస్తున్న అప్పుల కన్నా “రీ పే” ఎక్కువ !

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అప్పులు భారీగా చేస్తోందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. తాము తెచ్చిన అప్పుల కన్నా చెల్లించేది ఎక్కువని లెక్కలు విడుదల చేసింది. కేసీఆర్...

వైసీపీలో బొత్స వర్సెస్ విజయసాయి..!?

దశాబ్దాల చరిత్ర ఉన్న విశాఖ వాల్తేరు క్లబ్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు పార్టీలో కొత్త వివాదానికి తెరలేపాయి.2014లో వైఎస్ విజయమ్మ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా ...

కవిత కోసం బీజేపీకి కేసీఆర్ సరెండర్ అయ్యారా..?

లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవితను కాపాడుకునేందుకు కేసీఆర్ ప్రధాని మోడీతో కుమ్మక్కయ్యారా..? అందులో భాగంగానే ఐదు లోక్ సభ స్థానాల్లో బీజేపీకి సహకరించేందుకు కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారా..? రాష్ట్రంలో రేవంత్...

డబ్బుతో కొడుతున్నారు : లాజిక్ మిస్సవుతున్న వైసీపీ !

డబ్బుతో ఏమైనా చేయవచ్చా ?. ఏమీ చేయలేరని చాలా ఘటనలులు నిరూపించాయి. చివరికి ఎన్నికల్లో కూడా గెలవలేరని.. డబ్బులు విచ్చలవిడిగా పంచినా.. బీఆర్ఎస్ ఓటమి నిరూపించింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close