ఎన్డీఏలోకి జగన్ వెళ్తారా..? ఆహ్వానాలపై ఎలా స్పందిస్తారు..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి దూరంగా ఏమీ గా లేదు. నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టక ముందే.. వైఎస్ జగన్ వెళ్లి… కలిసి శుభాకాంక్షలు చెప్పి వచ్చినప్పటి నుంచి ఆ బంధం ఉంది. తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తులో.. ఉన్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉన్నా.. జగన్ పట్టించుకోలేదు. బీజేపీతో స్నహబంధాన్ని కొనసాగించారు. చివరికి ఆయన .. తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి వెళ్లిపోతే..నేనున్నాననే భరోసాను బీజేపీకి కల్పించారు. ఆ పరిణామమే.. ఎపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు. కానీ జగన్ అధికారికంగా ఎన్డీఏలోకి వెళ్తారా ..? లేదా..? అన్నది చాలా పెద్ద క్వశ్చన్‌గా మారింది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో.. బీజేపీతో పొత్తు పెట్టుకునేంత సాహసం ఎవరూ చేయరు. ఎంత సన్నిహితంగా ఉన్నా.. జగన్, పవన్ కూడా ఈ ప్రయత్నం చేయరు. ఏమైనా ఉంటే.. ఎన్నికల తర్వాత చూసుకుందామని… సర్దుబాటు చేసుకుంటారు. కానీ బీజేపీ దీనికి సుముఖంగా ఉంటుందా ఉండదా అన్నదే సందేహం. ఎందుకంటే.. రాజకీయాలంటే.. అవకాశవాదం. ఎన్నికల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు లోపాయికారీ ఒప్పందం చేసుకుని పొత్తుల్లేకుండా పోటీ చేస్తే.. రేపు వేరే కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే..వైఎస్ జగన్ ఒక్క నిమిషం కూడా ఆలోచించరు. ఆ కూటమి వైపు వెళ్లిపోతారు. ఆ కూటమిలో కీలకంగా చంద్రబాబు ఉన్నా సరే… జగన్‌కు మరో చాయిస్ ఉండదు. ఎన్డీఏలోనే చంద్రబాబు ఉంటే.. బీజేపీకి మద్దతివ్వడానికి జన్ వెనుకడలేదు. ఎందకంటే.. ఆయన అవసరం అలాంటిది మరి.

అందుకే బీజేపీ.. జగన్‌ను వీలైనంత త్వరగా ఎన్డీఏలోకి లాగే ప్రయత్నం చేస్తోంది. ఎన్డీఏలోకూటమిలో ఓ ముఖ్యపార్టీగా ఉన్న రిపబ్లికన్ పార్టీ ఆప్ ఇండియా అధ్యక్షుడు.. కేంద్రమంత్రి రాందాస్ అథవాలే.. ఏపీకి కానీ..తెలంగాణకు కానీ వచ్చినప్పుడు .. ఎన్డీఏలోకి జగన్‌ను ఆహ్వానించి వెళ్తున్నారు. గతంలో విజవాడకు వచ్చినప్పుడూ…జగన్‌ ఎన్డీఏలోకి వస్తామంటే.. ఆహ్వానిస్తామన్నారు. నిన్న హైదరాబాద్‌లో ఇంకొంచెం గట్టిగా ఆహ్వానించారు. ఇదంతా వ్యూహాత్మకంగా జరుగుతోందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. విచిత్రంగా.. ప్రత్యేకహోదా గురించి కూడా అథవాలే మాట్లాడారు. జగన్ ఎన్డీఏలోకి వస్తే.. ప్రత్యేకహోదా అంశాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్తామంటున్నారు. జగన్ కూడా అదే చెబుతున్నారు. ప్రత్యేకహోదా ఇస్తామంటే.. పొత్తుకు రెడీ అంటున్నారు. అంటే.. గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లేగా..? క్లారిటీ కోసం.. ఇంకో రెండు మూడు నెలల ఆగాల్సిందే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close