పార్టీ కోసం కష్టపడి సర్వం పోగొట్టుకున్న వారిని జగన్ రెడ్డి అసలు పట్టించుకోరు.. ప్రాణాలు పోగొట్టుకున్నా సరే.. అటు వైపు వచ్చినప్పుడు వచ్చి ఓదారుస్తాలే అని లైట్ తీసుకుంటారు..కానీ పార్టీ నేత ఎవరైనా భారీ నేరం చేసి జైలుకెళ్తే మాత్రం అసలు తగ్గరు. వారిలో ఏ మాత్రం ధైర్యం సడలకుండా.. తాను అండగా నిలబడిపోతారు. ఆ విషయం బొల్లా బ్రహ్మనాయుడు విషయంలో మరోసారి రుజువైంది.
బ్రహ్మనాయుడికి జగన్ భరోసా
హైదరాబాద్ గండిపేట పరిసరాల్లో ఏకంగా ఐదు నకిలీ జీవోలు సృష్టించి, ఒకే దెబ్బకు వెయ్యి కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని స్వాహా చేయబోయి సైబరాబాద్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన బొల్లా బ్రహ్మనాయుడు సాహసకృత్యం తాడేపల్లి ప్యాలెస్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. అబ్బా.. జస్ట్ మిస్! లేకపోతే వినుకొండలో కాదు.. నేరుగా జూబ్లీహిల్స్‌లో వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయ్యేవాడు కదా” అని జగన్ రెడ్డి తెగ ఫీలవుతున్నట్లుగా ఉన్నారు. అందుకే, నిందితుడు కాంచీపురంలో దొరికి చంచల్‌గూడ జైలుకు వెళ్లినా.. ఆయనలోని నేరగాళ్ల పట్ల మక్కువ ఆపలేక, వెంటనే బ్రహ్మనాయుడు కుమాడు గిరిబాబుకు ఫోన్ చేసి పరమాన్నం వండినంతగా భరోసా ఇచ్చేశారు.
“నేనున్నా గిరి.. భయపడకు” — ఆడియో లీక్ వెనుక అసలు కథ!
“ఎలా ఉన్నావ్ గిరి? ఏమీ కాదులే.. ధైర్యంగా ఉండు, అందరమూ ఉన్నాం” అంటూ జగన్ రెడ్డి గారు కురిపించిన ఆప్యాయత చూస్తుంటే.. ఎవరైనా ఒలింపిక్స్‌లో దేశానికి మెడల్ తేవడం మిస్సైతే పెద్దలు ఫోన్ చేసి ఓదార్చినట్లుగా ఉంది. ఈ ఫోన్ కాల్ ఆడియోను బ్రహ్మనాయుడు గారి లాయల్ ఫ్యామిలీ “మా వెనుక దొర ఉన్నాడు జాగ్రత్త!” అని చెప్పుకోడానికో ఏమో గానీ, తామే స్వయంగా సోషల్ మీడియాకు ఎక్కించి పండగ చేసుకున్నారు. దీంతో, ‘ఎంత పెద్ద స్కామ్ చేస్తే మా బాస్ అంత పెద్దగా అండగా ఉంటాడు’ అనే వైకాపా అంతర్గత పాలసీని జగన్ రెడ్డి గారు మరోసారి ప్రపంచానికి చాటిచెప్పినట్లయింది.
పొన్నవోలు లీగల్ టచ్.. సజ్జల గారి అండ!
ఫోన్ లైన్లోకి వచ్చిన జగన్ రెడ్డి గారు ఊరికే ధైర్యం చెప్పి వదిలేయలేదు. దొంగ జీవోల కేసు నుంచి ఎలా తప్పించుకోవాలో పక్కా ప్లాన్ కూడా ఇచ్చారు. “మనవాళ్లంతా టచ్‌లోకి వచ్చారా? సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడా? పొన్నవోలు సుధాకర్‌రెడ్డి టచ్లోనికి వచ్చాడా?” అని అడిగి మరీ లీగల్ టీమ్‌ను లైన్లోకి తెచ్చారు. నాడు ఏపీలో అదనపు అడ్వకేట్ జనరల్‌గా ఉంటూ ఇష్టమొచ్చినట్లు కేసులు పెట్టిన పొన్నవోలు ని, తాడేపల్లి ప్రెస్ మీట్ల వీరుడు సజ్జల గారిని ఈ వెయ్యి కోట్ల కబ్జా కేసును మేనేజ్ చేయడానికి రంగంలోకి దించడం చూస్తుంటే.. కబ్జాలు, అక్రమాల్లో దొరికిన వాళ్లను కాపాడటమే ఈ బ్యాచ్ పూర్తి సమయ బాధ్యతలా అనిపిస్తోంది.
వైసీపీలో ఇలాంటి నేతలకే ప్రాధాన్యం
“దొంగలు.. దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్టు” — ఒకరు లిక్కర్, ఇసుక స్కాములతో ఏపీని పీల్చేస్తే.. మరొకరు నకిలీ జీవోలతో తెలంగాణ భూములను మింగేయాలని చూశారు. ఇద్దరి టేస్ట్లు ఒకటే కాబట్టి బంధం అంత గట్టిగా ఉంది! ఈ ఫోన్ కాల్ వ్యవహారంతో జగన్ రెడ్డి అసలు నైజం ఏంటో జనాలకి మరోసారి క్లియర్ కట్‌గా అర్థమైపోయింది. పార్టీ కార్యకర్తలు కష్టాల్లో ఉన్నా.. రాని ఫోన్ కాల్.. ఒక వెయ్యి కోట్ల భూకబ్జా దొంగ జైలుకు వెళ్లేసరికి జగన్ రెడ్డి గారికి ఎక్కడ లేని దేశభక్తి, మైత్రి నిలువెల్లా పొంగిపొర్లాయి. ‘నేరాలు, దోపిడీలు చేసే వాళ్లంటే జగన్ రెడ్డి కి ఎంత మక్కువో’ ఈ ఆడియోతో తేలిపోయింది. ఎవరైనా దీనిపై ఎంత నెత్తీ నోరూ బాదుకున్నా, జగన్ రెడ్డి గారు మాత్రం తన సిద్ధాంతాన్ని మార్చుకోరు; ఎందుకంటే పెద్ద దొరకు.. చిన్న దొరల కష్టాలు అర్థమైనంతగా సామాన్యుల కష్టాలు అస్సలు అర్థం కావు మరి!
