ఈ శుక్రవారం ఆబ్సెంట్..!

న్యాయస్థానం సీరియస్ అవడంతో.. అక్రమార్కుల కేసులో ఒక్క శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి. కానీ తర్వాత శుక్రవారమే.. ఆయన డుమ్మాకొడుతున్నారు. ఈ శుక్రవారం.. సీబీఐ కోర్టుకు హాజరవడానికి ఆయన ఎలాంటి ప్రణాళికలు వేసుకోలేదు. తెలంగాణ పోలీసులకు.. వస్తున్నట్లుగా సమాచారం అందలేదు. అందుకే వారు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయలేదు. అదే సమయంలో.. జగన్మోహన్ రెడ్డి.. అమరావతిని తరలించేందుకు నియమించిన హైపవర్ కమిటీతో భేటీ అవుతున్నారు. దీంతో.. ఈ రోజు ఆయన కోర్టుకు డుమ్మానేనని అర్థం చేసుకోవచ్చు.

వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు మినహాయింపు ఇవ్వాలని.. జగన్ పెట్టుకున్న పిటిషన్లను.. కోర్టు నిర్మోహమాటంగా తోసి పుచ్చింది. సీబీఐ కూడా.. తీవ్రంగా వ్యతిరేకించింది. అదే సమయంలో.. జగన్మోహన్ రెడ్డి కావాలనే.. రకరకాల పిటిషన్లు వేసి.. విచారణను ఆలస్యం చేస్తున్నారన్న ఆరోపణలను సీబీఐ చేస్తోంది. అయినప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి..  కోర్టుకు హాజరు కావడానికి సిద్ధంగా లేరు. ప్రతీ సారి .. ఏదో కారణంతో ఆబ్సెంట్ పిటిషన్లు వేయిస్తూనే ఉన్నారు. నిజానికి ఈ వారం.. కీలక విచారణ జరగాల్సి ఉంది.

పెన్నా సిమెంట్స్ కేసులో.. అదనపు చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు.. నిందితులందరికీ.. సమన్లు జారీ చేసింది. ధర్మాన, తెలంగాణ మంత్రి సబిత ఇందులో ఉన్నారు. జగన్ కూడా హాజరు కావాల్సి ఉంది. కానీ ఆయన లైట్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close