ఆయన పేరు చెప్పుకోకపోతే వైకాపా మనుగడ కష్టమే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా క్రమంగా తన స్వశక్తి మీద నిలబడగలిగే పరిస్థితికి రాగలిగినా తెలంగాణాలో మాత్రం ఇంకా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొన్నట్లుగా తన మనుగడ కోసం ఎప్పుడో చనిపోయిన రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకోక తప్పడం లేదు. మిగిలిన రాజకీయ పార్టీల మాదిరిగా ప్రజా సమస్యలపై తెరాస ప్రభుత్వంతో పోరాడలేని వారి బలహీనతే అందుకు ప్రధాన కారణం. అదే ఆంధ్రప్రదేశ్ లో జగన్ నిత్యం చేస్తున్న పోరాటాల కారణంగా జగన్ తో సహా ఆ పార్టీ నేతలు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి నామ స్మరణ చేయవలసిన అవసరం బాగా తగ్గింది. ఇప్పుడు వాళ్ళు కేవలం ప్రజా సమస్యలు, వాటిపై ప్రభుత్వ వైఖరి గురించే ఎక్కువగా మాట్లాడుతుండటం అందరూ గమనించవచ్చును. కానీ తెలంగాణాలో ఆ పరిస్థితి లేదు కనుక రాజశేఖర్ రెడ్డి నామ స్మరణ తప్పడం లేదు. హన్మకొండలో నిన్న జరిగిన పార్టీ సమావేశంలో వైకాపా నేతలు మాట్లాడిన మాటలు వింటే ఆ సంగతి అర్ధం అవుతుంది.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ “రాజశేఖరరెడ్డి లేని పాలనను ప్రజలు గమనిస్తున్నారు. కనుక కార్యకర్తలు అందరూ ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్ పథకాలను ప్రచారం చేయూలి. మరే ముఖ్యమంత్రి చేయలేని సంక్షేమ పధకాలను స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి అమలుచేసారు. కాని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కేవలం బంగారు తెలంగాణ పేరుతో హామీలు గుప్పిస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. మన అందరికీ నచ్చిన అభ్యర్ధి పేరును జగన్ స్వయంగా ప్రకటిస్తారు. ఆ వ్యక్తి 4వ తేదీన నామినేషన్ వేస్తారు. వైకాపా నేతలు, కార్యకర్తలు అందరూ కలిసి మన అభ్యర్ధి విజయానికి కృషి చేయాలి,” అని కోరారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి సమావేశానికి హాజరయిన నేతలు, కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన అనేక సంక్షేమ పథకాల వలన జిల్లాలో అనేకమంది జీవితాలలో వెలుగులు నిండాయి. షర్మిల తెలంగాణాలో పరామర్శ యాత్రలు చేసినప్పుడు అందరూ ఆమెను స్వంత ఆడబిడ్డగా భావించి ఆదరించారు. వారందరూ ఈ ఎన్నికలలో మన పార్టీ అభ్యర్ధికే ఓటువేసి ఆయన రుణం తీర్చుకొంటారని నమ్ముతున్నాను,” అని అన్నారు.

జిల్లా వైకాపా అధ్యక్షుడు జె. మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ “వరంగల్ జిల్లాలో మన పార్టీ అంటే తెరాస, కాంగ్రెస్, టీడీపీలకు భయం ఏర్పడినట్లుంది. ఈ ఎన్నికలో మనం తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పడానికి అదే నిదర్శనం. మనం అందరం కలిసి మన పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలి,” అని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close