బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో ఇటీవల కుల చిచ్చు పెట్టేందుకు వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చిన్న చిన్న విషయాలను ఘర్షణలకు దారి తీసేలా చేస్తున్నారు. వైసీపీ ఇంచార్జ్ తీరుపై స్థానికంగా తీవ్ర చర్చ నడుస్తోంది. నియోజకవర్గంతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తిని జగన్ ఇక్కడ పోటీకి పెట్టారు. తర్వాత ఆయననే ఇంచార్జ్‌గా నియమించడంపై ఇప్పటికే అసంతృప్తి నెలకొనగా, సదరు నేత తన ఉనికిని చాటుకోవడానికి కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
చుండూరు మండలంలో ఓ గ్రామంలో మూడు రోజులుగా వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఓ ఫ్లెక్సీ వివాదంలో ఈ గొడవలు ప్రారంభమయ్యాయి. కేఎన్‌పల్లిలో వైసీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు కత్తులు, కర్రలతో పరస్పరం దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో తమ పార్టీ కార్యకర్తలు గాయపడ్డారని ఇంచార్జ్ అశోక్ బాబు ర్యాలీగా బయలుదేరి పరిస్థితిని మరింత విషమింప చేయడానికి ప్రయత్నించారు.
పోలీసులు ఆయనను అడ్డుకుని ఇంటి వద్దే అడ్డుకున్నారు నియోజకవర్గంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, అధికార పార్టీ ఒత్తిడితోనే పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఉద్దశపూర్వకంగా గ్రామాల్లో చిచ్చు పెట్టి ..దాన్ని పెంచే ప్రయత్నాలు చేయడమే కాకుండా ఇలా రివర్స్ లో ప్రకటనలు చేయడం వైసీపీ వారికే చెల్లింది.


