వైసీపీ అడగదు.. కేంద్రం ఇవ్వదు..! ఏపీకి దారేది..?

ప్రత్యేకహోదా ఇచ్చే ప్రశ్నే లేదని కేంద్రం మరోసారి తేల్చి చెప్పినా అధికార పార్టీలో ఎలాంటి స్పందన లేకపోవడం.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ చర్చకు కారణం అవుతోంది. ఆ పార్టీ ముఖ్య నేతలెవరూ హోదాపై ఎలాంటి మాటలు మట్లాడటం లేదు. మరో వైపు విపక్ష పార్టీ నేతలు.. సీఎం జగన్ స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రంపై యుద్ధం ప్రకటించాలని కోరుతున్నారు. సోషల్ మీడియాలో గతంలో హోదా కోసం.. జగన్ చేసిన ప్రకటనలు.. ఆయన విద్యా సంస్థల్లో సమావేశాలు పెట్టి.. కొంత మంది విద్యార్థులతో మాట్లాడించిన మాటలు వైరల్ అయ్యాయి. ఇలాంటి సమయంలో వైసీపీ నేతలపై ఒత్తిడి పెరుగుతోంది. అయినా ఎవరూ స్పందించడానికి సిద్ధపడటం లేదు.

వైసీపీ మౌనం.. విపక్షాలకు ఆయుధంలా మారుతోంది. కేసుల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారన్న విమర్శలు పెరగడానికి కారణం అవుతోంది. కేంద్రం .. ఆంధ్రప్రదేశ్‌కు వరుసగా అన్యాయం చేస్తున్నా… రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటంటే.. ఒక్క మాట మాట్లాడటం లేదు. ప్రత్యేకహోదా దగ్గర్నుంచి స్టీల్ ప్లాంట్ వరకూ ఏ విషయంలోనూ ఏపీకి మేలు జరగడం లేదు. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వడం లేదు. పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదు. సవరించిన అంచనాలను ఆమోదించడం లేదు. అయినా ఏపీ వైపు నుంచి తమ రాష్ట్రానికి కావాల్సిన సాయం కోసం ఎంపీలు కానీ ప్రభుత్వం కానీ అడుగుతున్నదేమీ లేదు. ప్రతిపక్ష పార్టీలకు ఎంపీలు ముగ్గురు ఉన్నారు.

వారి వాయిస్ పార్లమెంట్‌లో వినిపిస్తున్నప్పటికీ… వారు ప్రతిపక్ష ఎంపీలుగానే పరిగణనలోకి వస్తున్నారు. దీంతో వారి వాయిస్‌ను కేంద్రం పట్టించుకునే పరిస్థితి లేదు. ఏపీ పరిస్థితి దారుణంగా ఉందని.. కేంద్రం రూపాయి ఇవ్వదు.. అడిగేవారు లేరన్న చర్చలుఢిల్లీలో వినిపిస్తున్నాయి. అయితే.. ఏపీకి వచ్చి మాత్రం వైసీపీ నేతలు రీసౌండింగ్ ప్రకటనలు చేస్తున్నారు. దీంతో వారి రాజకీయం వారు చేసుకుంటున్నారు. కానీ రాష్ట్ర ప్రయోజనాలు మాత్రం… వాటి దారిన అవి పోతున్నాయన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close