‘పక్షపాతం’ పులమడానికి పునాది వేసేశారు!

ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించడానికి సంబంధించి స్పీకరు నిర్ణయం తీసుకోవడానికి కూడా ఒక నిర్దిష్టమైన ప్రక్రియ ఉంటుంది. నిర్ణయం అనేది అంతిమంగా ఆయన విచక్షణకు లోబడే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే చర్య తీసుకోవడానికి సంబంధించిన పద్ధతిని ఆయన అనుసరించాల్సిందే. అందుకే తెలంగాణలో కూడా తెదేపా ఫిర్యాదులు చేసినా.. నిర్ణయం రాకుండా ఏళ్లూ పూళ్లూ గడచిపోతూనే ఉన్నాయి.

ఇలాంటి నేపథ్యంలో ఇవాళ ఏపీ లో వైకాపా నాయకులు కూడా స్పీకరును కలిసి.. పార్టీ ఫిరాయించిన తమ 8 మంది ఎమ్మెల్యేలను అనర్హులు చేయాలంటూ ఫిర్యాదు చేశారు. 8 మంది తెదేపాలో చేరారు గనుక.. వారిని తక్షణం వేటు వేసేయాలన్నది వారి డిమాండు. అందులో సహేతుకత కూడా ఉంది.

అయితే ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేల తరఫున జ్యోతుల నెహ్రూ మాట్లాడిన మాటలు మాత్రం ప్రత్యేకంగా గమనించాలి. తాము స్పీకరుకు ఫిర్యాదుచేసిన సంగతిని వెల్లడిస్తూనే.. స్పీకరు ముందరిక కాళ్లకు బంధాలు కూడా వేశారు.

‘ఎమ్మెల్యే చర్యలతో ప్రజాస్వామ్యాన్ని మీరే రక్షించాలి’ అంటూ వారు కోరారు. స్పీకరు ప్రజాస్వామ్యాన్ని రక్షించడం సంగతి తర్వాత.. ”ఆయన నిష్పక్షపాతంగానే వ్యవహరిస్తారని అనుకుంటున్నాం” అంటూ జ్యోతుల నెహ్రూ సెలవిచ్చారు. ఇక్కడ టెక్నికల్‌గా నెహ్రూ వాడిన పదాలను గమనించాలి. స్పీకరు న్యాయమైన, ధర్మమైన, రాజ్యాంగబద్ధమైన నిర్ణయం తీసుకుంటారు అని భావిస్తున్నాం అని చెప్పిఉంటే అదొక తీరుగా ఉండేది. అయితే ఆయన అందుకు భిన్నంగా.. స్పీకరు నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకుంటున్నారని భావిస్తున్నాం అని చెప్పారు. ఇండైరక్టుగా తాము కోరినట్లు నిర్ణయం తీసుకోకపోతే.. స్పీకరు పక్షపాతం ప్రదర్శించినట్లే.. అని నెహ్రూ ఇప్పటినుంచే జనం మెదళ్లలోకి ఇంజెక్ట్‌ చేస్తున్నారని అనిపిస్తోంది.

అంటే స్పీకరు నిర్ణయం తీసుకోకుంటే ఎలా తిట్టాలని, ఎలా పోరాటం చేయాలని అనుకుంటున్నారో.. ఇప్పటినుంచే వైకాపా ప్రిపేర్‌ అయిపోతున్నట్లుగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close