వైసీపీ నేతల్ని ఒక్క మాటతో పవన్ అంతగా భయపెట్టారా..? బాధపెట్టారా..?

వైసీపీలోని కాపు నేతలకు జగన్ అంటే భయం..! .. అంటూ.. పవన్ కల్యాణ్ చేసిన ఒకే ఒక్క విమర్శ… ఆ పార్టీలోని… కాపు నేతలందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. ఆ మాకేం భయం అంటూ.. ఒక్కొక్కరు తెర ముందుకు వస్తున్నారు. పవన్ కల్యాణ్ ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు సైలెంట్ గా ఉన్న నేతలందరూ.. తర్వాత ఆదేశాలు వచ్చినట్లుగా.. ఒక్కొక్కరు.. ఎక్కడ మైక్ దొరికితే.. అక్కడ పవన్ కల్యాణ్ పై విరుచుకుపడటం ప్రారంభించారు. వీరందరి కామన్ పాయింట్ ఒక్కటే… తాము జగన్ కు భయపడటం లేదని చెప్పుకోవడం. జగన్ తమకు అవకాశాలు కల్పిస్తున్నారని.. వివరించుకోవడం. పవన్ కల్యాణ్‌పై..  కుల సమీకరణాలు చూసుకుని వైసీపీ పెద్దలు.. కేవలం కాపు నేతలతోనే విమర్శలు చేయిస్తున్నారు.

కాపు రిజర్వేషన్లు తీసేసిన కాపు నేతలు మాట్లాడటం లేదని… పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు.. ఒక్కరంటే.. ఒక్క నేత కూడా కౌంటర్ ఇవ్వలేదు. కాపు రిజర్వేషన్ల విషయంలో కాపులకు.. జగన్ చేసిన అన్యాయం గురించే పవన్ కల్యాణ్ మాట్లాడారు. కానీ ఆ విషయం గురించి కాకుండా.. మిగతా అన్ని విషయాలను… వైసీపీ కాపు నేతలు మాట్లాడటం ప్రారంభించారు. ఎదురుదాడి చేసి.. విమర్శించడం.. పెయిడ్ ఆర్టిస్టని విమర్శించడం… అంతగా కాకపోతే.. టీడీపీ స్క్రిప్ట్ చదవుతున్నారని విమర్శించడం తప్ప…  తమ వర్గ ప్రయోజనాల కోసం.. తాము పోరాడలేకపోతున్నామని.. అధికార పార్టీలో ఉండి.. తాము… తమ సామాజికవర్గం కోసం… ఒక్క మాట మాట్లాడలేకపోతున్నామని..వారు అంగీకరించలేకపోతున్నారు.

టీడీపీ హయాంలో.. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారి పది శాతం కోటాలో.. చంద్రబాబు ఐదు శాతం కల్పించారు. వాటిని కొనసాగించడానికి ఎలాంటి ఆటంకాలు లేకపోయినా… కోర్టుల్లో ఎలాంటి కేసులు లేకపోయినా… ఆ కోటాను రద్దు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయినా.. ఒక్కరంటే.. ఒక్క కాపు నేత కూడా.. నోరు మెదపలేదు. కొంత మంది వైసీపీ కాపునేతలయితే.. తమకు రిజర్వేషన్లు అక్కర్లేదన్నట్లుగా మాట్లాడారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు.. కాపు సామాజికవర్గంలోనూ… చర్చనీయాంశం అయ్యాయి. అందుకే.. వైసీపీ కాపు నేతలు ఆందోళన చెంది… పవన్ పై ఎదురుదాడి ప్రారంభించారని  భావిస్తున్నారు. కానీ అసలు విషయానికి మాత్రం సమాధానం చెప్పరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close