వైసీపీ నేతలకు “రాజీనామా”ల రివర్స్ టెండరింగ్..!

రివర్స్ టెండరింగ్.. రివర్స్ టెండరింగ్ అని వైసీపీ నేతలు కలవరించారు కానీ.. ఇప్పుడు అన్ని విషయాల్లోనూ రివర్స్ టెండరింగులే ఎదురవుతున్నాయి. దీంతో గతంలో అన్న మాటలు.. చేసిన చాలెంజ్‌లు మొత్తం రివర్స్ చేసుకోవాల్సి వస్తోంది. విద్యుత్ పీపీఏల దగ్గర్నుంచి జీఎంఆర్ ఎయిర్ పోర్టు వరకూ గత ప్రభుత్వం హయాంలో చేసిన ఆరోపణలన్నింటినీ తమకు తామే ఖండిస్తున్నట్లుగా నిర్ణయాలు తీసుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు..రాజీనామాల విషయంలోనూ అదే రివర్స్ అయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అందరూ రాజీనామాలు చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతూండటంతో వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఏం చెప్పాలో తెలియక… రాజీనామాలు చేస్తే ప్రైవేటీకరణ ఆగిపోతుందా… అని ఎదురుదాడికి దిగుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి… స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం కోసం తాము రాజీనామా చేసే ప్రశ్నే లేదని తేల్చేశారు. రాజీనామాలు చేస్తే పోరాడెదెవ్వరని.. పాత కాలం డైలాగ్ ను కొత్తగా చెప్పారు. ఇతర వైసీపీ నేతలు కూడా అదే చెబుతున్నారు. ఒక వేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరితే…170 అసెంబ్లీస్థానాల్లో గెలుస్తామని కూడా ఆయన జోస్యం చెప్పారు. అదే సమయంలో పెద్దిరెడ్డి అండ్ వైసీపీ కో ప్రత్యేక హోదా ఉద్యమ సమయంలో చేసిన వ్యాఖ్యలను అనేక మంది గుర్తు చేస్తున్నారు.

చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా…రాజీనామాలు చేస్తే కేంద్రం ఎందుకు దిగిరాదో చూస్తానంటూ సవాళ్లు చేశారు. అప్పట్లో టీడీపీ ఇప్పుడు పెద్దిరెడ్డి చెప్పిన కబుర్లే చెప్పింది.రాజీనామాలు చేస్తే.. ఎవరు పోరాడతారని చెప్పింది. ఇప్పుడు పాత్రలు రివర్స్ అయ్యాయి. అప్పుడు టీడీపీ చెప్పిన కథలను ఇప్పుడు వైసీపీ చెబుతోంది. రాజీనామాలపై వైసీపీ నేతల యూటర్న్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. ఇప్పుడు అలా ఇప్పుడు ఇలా ఏమిటని ప్రశ్నలు సంధిస్తున్నారు. విమర్శిస్తున్నారు. ఎవరేమి అనుకున్నా.. తాము మాత్రం రాజీనామాలు చేసే ప్రసక్తే లేదని వైసీపీ నేతలందటున్నారు.

ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిన అవసరంలేదని.. ఎంపీలు రాజీనామా చేసి పోరాడాలని సబ్బంహరి లాంటి నేతలు సలహాలిస్తున్నారు. పార్టీలకు అతీతంగా అందరూ రాజీనామాలు చేసి రాజ్యాంగ సంక్షోభం ఏర్పడేలా చేయాలని స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులు కోరుతున్నారు. అయితే.. వైసీపీ నేతలు మాత్రం… ఇరుక్కుపోయారు. తమకు రివర్స్ టెండరింగ్ పడుతోందని.. ఆవేదన చెందుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close