చెవిరెడ్డి మార్క్ స్పెషల్ ట్రైన్‌..! కరో.. కరో జల్సా..!

రెండు రోజుల క్రితం.. చంద్రగిరి నుంచి ఓ స్పెషల్ ట్రైన్ షిర్డి వెళ్లింది. అందులో దాదాపుగా రెండు వేల మంది ఉన్నారు. అందరూ.. చెవిరెడ్డి అనుచరలే. మందులు, విందులు, పేకాటలతో.. ఆ ట్రైన్ హోరెత్తిపోయింది. వెళ్లేది దేవుడి దర్శనానికి.. చేసింది మాత్రం.. జల్సాలు. అదీ కూడా.. ఏ మాత్రం.. మద్యాన్ని, పేకాట లాంటి అసాంఘిక కార్యకలాపాలను అనుమతించని.. రైల‌్లో. కానీ ఏ ఒక్క రైల్వే అధికారి కూడా అడ్డుకోలేదు. ఎందుకంటే.. అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెట్టిన స్పెషల్ ట్రైన్ మరి..!

తాయిలాలతో ఆకట్టుకోవడంలో చెవిరెడ్డి స్టైలే వేరు..!

నియోజకవర్గంలోని ఓటర్లకు తాయిలాలు పంచడంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్టైలే వేరు. ఆయన ఏడాది ముందు నుంచి… ఓటర్లకు… పండుగలకు.. పబ్బాలకు కానుకలు పంపడం ప్రారంభించారు. ఇక ఎన్నికలకు ముందు ఆయన చేసిన హడావుడి.. చేసిన ఖర్చు లెక్క పెట్టడం కష్టమేననేది చాలా మంది చెప్పే మాట. ఇక ఫామ్ సెవన్‌లు పెట్టడంలోనూ వైసీపీలో ఆయనే నెంబర్ వన్. తన నియోజకవర్గంలో ఉన్న రెండు లక్షల ఓటర్లలో ఏకంగా ఇరవై వేల ఓట్లు తీసేయాలని… ఫామ్‌ 7లు పెట్టించారు. వాటి సంగతి తేలిన తర్వాత… గొడవలు పడ్డారు. కొట్టారు.. కొట్టించుకున్నారు. పోలింగ్ అయిపోయిన నెలరోజుల తర్వాత టీడీపీ గ్రామాల్లో రీపోలింగ్ పెట్టించి…మరో సారి వివాదాల్లోకి వచ్చారు. ఇలాంటి చెవిరెడ్డి .. ఎన్నికల్లో తన కోసం పని చేసిన అనుచరుల కోసం షిర్డీకి ఓస్పెషల్ ట్రైన్ బుక్ చేశారు. సకల విందు ఏర్పాట్లతో.. చంద్రగిరి నుంచి షిర్డికి పంపారు.

రూ. 70 లక్షలతో స్పెషల్ ట్రైన్..! కరో కరో జల్సా..!

అయితే.. ఈ స్పెషల్ ట్రైన్‌తో చాలా చిక్కులు చెవిరెడ్డికి.. వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. అ ట్రైన్‌ను చెవిరెడ్డి భార్య పేరుతో బుక్ చేశారు. వెళ్లిన వాళ్లంతా.. వైసీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులు. కోడ్ అమల్లో ఉంది కాబట్టి.. అభ్యర్థుల ఖర్చు… కౌంట్ అవుతుంది. ఇప్పుడీ స్పెషల్ ట్రైన్ ఖర్చును ఎలా చూపుతారన్నది చర్చనీయాంశం అవుతోంది. దాదాపుగా.. రూ. 70 లక్షలు ఈ ట్రైన్ కోసం వెచ్చించినట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. అత్యవసర కోటాలో … దక్షిణ మధ్య రైల్వే నుంచి… ఈ రైలును బుక్ చేసుకున్నారు. గుంతకల్లు డివిజన్ ను పట్టించుకోలేదు. ఆ రైలు రావడం… అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారడంతో… విషయం… రైల్వే బోర్డు చైర్మన్ వరకూ వెళ్లింది. దీనిపై అంతర్గత విచారణ కూడా ప్రారంభమయింది. కొంత మంది రైల్వే అధికారులు చెవిరెడ్డి దెబ్బకు వణికిపోతున్నారు.

చెవిరెడ్డి దెబ్బకు.. రైల్వే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చిక్కులు..!

అంతే కాదు.. ప్రయాణికుల్లో … ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు.. ఇతర ఉద్యోగులకు పెద్ద ఎత్తున సీట్లు రిజర్వ్ చేశారు. ఓ రాజకీయ పార్టీ నేత ఏర్పాటు చేసిన విహారయాత్రకు ఉద్యోగులు వెళ్లడం.. కలకలం రేపుతోంది. మొదటి నుంచి ఉద్యోగులకు తాయిలాలు పంపిణీ చేయడంలో ముందుండే.. చెవిరెడ్డి.. చాలా మందిని ఆకట్టుకున్నారు. అలాంటి వారినందర్నీ ఇలా .. ఫలితాలకు ముందే విహారయాత్రకు పంపారు. వారందరూ.. ఇప్పుడు వివాదంలో ఇరుక్కున్నట్లయిది. ఎవరినైనా కాకా పట్టడంతో.. చెవిరెడ్డికి పీహెచ్‌డీ ఉంది. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు… ఆయన పాలనపై నిజంగానే పీహెచ్‌డీ చేసి… ఆయన ప్రాపకం పొందారు. అప్పట్నుంచి … అన్ని రకాల ఆదాయాలు పెంచుకుని.. రాజకీయ వ్యాపారం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close