ఏపీలో ఆరోగ్య వ్యవస్థ సూపర్ అని, కరోనా రాగానే హైదరాబాద్ పరుగెత్తిన విజయసాయి

వైఎస్ఆర్సిపి నేత ఎంపీ విజయసాయి రెడ్డి కి కరోనా సోకింది. కరోనా టెస్టులలో పాజిటివ్ అని తేలడంతో ఆగమేఘాలమీద విజయవాడ నుండి హైదరాబాద్ పరిగెత్తుకొచ్చి జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్ లో చేరి పోయారు విజయ సాయిరెడ్డి. మామూలుగా ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో చక్కటి కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకుంటే తప్పుపట్టాల్సిన పని లేదు కానీ, దేశంలోనే ఆరోగ్య వ్యవస్థలో ఏపీ దూసుకెళ్లి పోతోందని, ఇక్కడ ఉన్నన్ని వైద్య సదుపాయాలు ఇంకెక్కడా లేవని నిన్నటిదాకా ట్విట్టర్ లో ఊదరగొట్టిన విజయసాయి, తనకు ఆరోగ్య సమస్య రాగానే ఆంధ్రప్రదేశ్ వదిలేసి హైదరాబాదుకు పరిగెత్తుకుంటూ రావడం చర్చనీయాంశం గా మారింది. అంతేకకుండా అచ్చెన్నాయుడు ని ఈఎస్ఐ ఆస్పత్రి పంపిన సమయంలో, ” ఏం నీకు కార్పొరేట్ ఆసుపత్రే కావాలా, ఈఎస్ఐ ఆస్పత్రి సరిపోదా ” అంటూ వెటకారం చేసిన విజయసాయి, ఇప్పుడు తనకు మైల్డ్ సింప్టమ్స్ రాగానే కార్పొరేట్ ఆసుపత్రికి పరిగెత్తుకుంటూ రావడం విమర్శలకు దారి తీస్తోంది.

ఇటీవలికాలంలో ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య వ్యవస్థ సూపరో సూపరు అంటూ విజయ్ సాయి చేసిన కొన్ని ట్వీట్స్ ఇవీ:

” అనంతపురం జిల్లాలో 1500 పడకల కరోనా ఆసుపత్రిని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గూగూల్ లో వెతికి చూడండి పచ్చ తమ్ముళ్లూ. ఇంకెక్కడైనా ఇంత వేగంగా, సకల సౌకర్యాలతో తాత్కాలిక హాస్పిటల్ తయారైందేమో. ఈ కష్టకాలంలో చిరునవ్వుతో భరోసా ఇచ్చే సిఎం ఉండటం రాష్ట్రం అదృష్టం.” అని ఇటీవల రాసుకొచ్చిన విజయసాయి, తమ ప్రభుత్వ హయాంలో సకల సౌకర్యాలతో ఏర్పడ్డ తాత్కాలిక హాస్పిటల్ పై నమ్మకం లేక హైదరాబాద్కు పరిగెత్తుకుంటూ రావడం విశేషం.

అదేవిధంగా, “కొత్త మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లు. పది రెట్లు పెరిగిన ఐసియూ బెడ్లు, వెంటిలేటర్లు. కొత్తగా 108 అంబులెన్సులు, పబ్లిక్ హెల్త్ కేర్ రంగం సాచ్యురేషన్ స్థాయికి దూసుకెళ్తోంది. ఆరోగ్యశ్రీలో కరోనాను కూడా చేర్చారు సిఎం జగన్ గారు. విద్య, ఆరోగ్యం ఆయన ప్రాథమ్యాలలో ముందున్నాయి.”అని చెప్పిన విజయసాయిరెడ్డి తన కరోనా ని ట్రీట్ చేయడానికి , తమ ప్రభుత్వ హయాంలో పది రెట్లు గా పెరిగిన ఐసియు బెడ్ లలో బహుశా ఒక్క ఖాళీ బెడ్ కూడా దొరకలేదేమో అన్న అనుమానం వచ్చేలా హైదరాబాదులోని అపోలో హాస్పిటల్ లో చికిత్స కు రావడం గమనార్హం.

ఇక హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో వైయస్ జగన్ విజన్కు ఒక రేంజ్ లో కితాబిచ్చిన విజయసాయి,

” Big boost to healthcare infrastructure in AP.
-16 medical colleges
-1 Super specialty hospital
-1 Cancer hospital
-1 mental health hospital
-Medical infra development at existing hospitals
-11,197 village clinics
VISION + ACTION = YS JAGAN
#NaduNedu” తమ ఇన్ఫ్రా పై తనకే నమ్మకం లేదని నిరూపించినట్టు అయిందని విమర్శలు వినిపిస్తున్నాయి.

అంతే కాకుండా, ఇటీవల ఒక సందర్భంలో
, ” ప్రభుత్వ ఆస్పత్రులకు అదనపు బలం చేకూరుస్తున్న జగన్ గారి ప్రభుత్వం. ఒకే నోటిఫికేషన్ ద్వారా దాదాపు 10వేల వైద్యపోస్టుల భర్తీ. గత ప్రభుత్వాలు నియామకాలు చేపట్టకపోవడంతో ప్రభుత్వాసుపత్రులు నిర్వీర్యమయ్యాయి. ఇకపై 24 గంటలూ పూర్తి స్టాఫ్ తో పనిచేస్తాయ్.” అని గొప్పగా వ్యాఖ్యానించిన విజయసాయిరెడ్డి, 24 గంటలు పూర్తిస్థాయిలో పనిచేసే తమ హాస్పిటల్లో ఎందుకు చేరలేదా అన్న అనుమానం ప్రజలకు కలుగుతోంది.

ఇక ప్రజారోగ్యంపై జగన్ చేస్తున్న పనులను మెచ్చుకుంటూ, ” ప్రజారోగ్యం పట్ల సిఎం జగన్ గారి తపనకు కార్యరూపం జూలై 1 నుంచి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. 203 కోట్లతో కొనుగోలు చేసిన అత్యాధునిక 104, 108 అంబులెన్సులు, మొబైల్ క్లినిక్ ల సేవలు మొదలవుతాయి. వెంటిలేటర్లు, ఇసిజి, ప్రాణాపాయ స్థితిలో అత్యవసర లైఫ్ సపోర్ట్ వ్యవస్థలు వీటిల్లో ఉంటాయి.” అని చెప్పిన విజయసాయిరెడ్డి తన చికిత్స కోసం హైదరాబాద్కు రావడంతో, జగన్ నెలకొల్పిన ఈ సేవలు ఏవి తనకు పనికి రావని చెప్పినట్లయింది అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

అచ్చెన్నాయుడు ని వెటకారం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఆస్పత్రులకు అన్ని హంగులను తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెబుతూ, ” ఆరోగ్యంగా గుండ్రాయిలా ఉన్నా ఈ డ్రామాలేంటి అచ్చన్నా? కార్పొరేట్ ఆస్పత్రే కావాలా? ఏం ఈఎస్ఐ ఆస్పత్రి వద్దా? మీ CBN హయాంలా కాదు జగన్ గారి ప్రభుత్వం. ఆస్పత్రులకు అన్ని హంగులు అద్దింది. సమస్య వస్తే చూసుకుంటుంది.” అని రాసిన విజయసాయిరెడ్డి, అన్ని హంగులు ఉన్న ఆంధ్ర ఆసుపత్రులను వదిలి హైదరాబాదులోని అపోలో హాస్పిటల్ లో ఎందుకు చేరాల్సి వచ్చిందో, ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది.

ఇక కరోనా వచ్చిన కొత్తలో, ” కోవిడ్ నియంత్రణ, చికిత్సలో సిఎం జగన్ గారి కార్యదీక్ష, ముందు చూపును ప్రతి రాష్ట్రం ప్రశంసిస్తోంది. 7 లక్షల టెస్టులు పూర్తికాగా, ప్రతి కుటుంబానికి పరీక్షలు జరిపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. 30 వేల బెడ్లు అందుబాటులోకి వచ్చాయి. వచ్చే 2 నెలల్లో మరో 40 వేల పడకలు సిద్ధమవుతాయి.” అంటూ దేశం మొత్తం జగన్ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ ఉందని చెప్పిన విజయసాయిరెడ్డి, తాను మాత్రం జగన్ ప్రభుత్వంలో ని ఆరోగ్య వ్యవస్థ , తన ప్రాణాలను కాపాడే విషయంలో ఎందుకు కొరగానిదని చేతులతో విజయసాయిరెడ్డి నిర్మించినట్లు అయిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి తమ ప్రభుత్వం, తాము, చేస్తున్న పనులు సూపర్ అంటూ ఊదరగొట్టే నేతలు, తమ దాకా సమస్య వస్తే మాత్రం, తాము వసతులు ఏర్పాటు చేసిన ఆసుపత్రులలో కాకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రమే చికిత్స తీసుకుంటారని, తమ ప్రభుత్వాన్ని పొగుడుతూ పైకి తాము చెప్పే మాటల పై తమకే నమ్మకం ఉండదని విజయసాయి రెడ్డి ఉదంతం మరొకసారి నిరూపించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close