వైసీపీ రివ్యూ చేసుకోవాల్సిందే !

ఆరు నెలల కిందట జరిగిన ఎన్నికల్లో తిరుగులేని విజయాలొచ్చాయి. కానీ తర్వాత జరిగిన మినీ లోకల్ పోల్స్‌లో మాత్రం ఆ పరిస్థితి లేదు. డబ్బు, దస్కం పెట్టిన చోట మంచి ఫలితాలు వచ్చాయి. కానీ ఎన్నికలను ఎన్నికల్లా నిర్వహించిన చోట మాత్రం భిన్నమైన ఫలితాలొచ్చాయి. అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి మధ్య ఓట్ల తేడా చాలా స్వల్పంగా ఉంది. కమలాపురం, రాజంపేట వంటి చోట్ ఐదు వార్డులు వచ్చాయంటే చిన్న విషయం కాదు. బుగ్గున స్వగ్రామంలోనూ గట్టి పోటీ ఇచ్చారు. అక్కడ టీడీపీ ఆరు వార్డు వార్డు చాలా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయింది. లేకపోతే అక్కడ బుగ్గనకు షాక్ తగిలేది.

ఇక దర్శిలో వైసీపీకి ఎదురైన పరాజయం.. అన్ని రకాల వనరులు ఉన్న పల్నాడులో ఓట్లేసిన ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత .. కృష్ణా జిల్లాలోనూ అదే పరిస్థితి ఎదురు కావడం ఖచ్చితంగా ప్రమాద ఘంటికలు మోగించేవే. సాధారణంగా లోకల్ ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేక ఫలితాలు రావు. అసలు రాకూడదని… అన్ని జాగ్రత్తలు తీసుకున్న తరవాతక కూడా వచ్చాయంటే చిన్న విషయం కాదు. ఒక్క కుప్పం నియోజకవర్గంలో గెలిచేశామని ప్రచారం చేసుకుంటే పని పూర్తి కాదు. ఎందుకంటే అక్కడ ఎన్నికలు ఎలా జరిగాయో ప్రజలు చూశారు. ఓట్ల పోలింగ్ పర్సంటేజీ వచ్చిన మెజార్టీ… మొత్తం చూశారు. ఆ ఎన్నికపై ప్రజల్లో ఓ అభిప్రాయం ఏర్పడిపోయింది.

ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా వచ్చిన ఫలితాల గురించే చర్చ జరుగుతోంది. అన్ని ప్రయత్నాలు చేసినా ఎందుకు అంత వ్యతిరేకత వచ్చిందనేది ఇప్పుడు కీలకమైన అంశంగా వైసీపీ తీసుకోవాల్సి వస్తుంది. నవరత్నాలు.. సంక్షేమ పథకాలు.. జనరంజకమైన పాలన ఏమైపోయింది.. ఎందుకు వ్యతిరేక ఓట్లు పెరుగుతున్నాయన్నది చర్చించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అధికార వ్యతిరేకత అనేది సహజంగా ఉంటుంది. సాధారణంగా అది చివరి ఏడాది వస్తుంది.కానీ వైసీపీ ప్రభుత్వానికి అది మూడో ఏడాదే కనిపిస్తోంది. ఇది ప్రమాదకరమైన సంకేతం.

ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకత పెంచుకుంటూ పోతే అది ఎన్నికల నాటికి తీవ్రం అవుతుంది. గెలుపు మత్తులో ఉండి.. పోటీ దారుల్ని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే సక్సెస్ రాదు. రాజకీయంలో ప్రత్యర్థి ఎప్పుడూ ఉంటాడు. ఈ విషయం గుర్తుంచుకుని వైసీపీ… ఫలితాలను రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close