కేసుల చట్రం..రాజకీయ వ్యూహం..! పట్టు బిగిస్తున్న వైసీపీ..!

తెలుగుదేశం పార్టీని .. ఆ పార్టీ నేతల్ని కట్టడి చేయాడనికి వైసీపీ భయమనే వ్యూహాన్ని అమలు చేస్తోంది. పాత కేసుల లెక్క బయటకు తీస్తోంది. కాదంటే… ఫిర్యాదులతో కేసులు నమోదు చేయిస్తోంది. నెల్లూరులో సోమిరెడ్డి… పశ్చిమగోదావరి జిల్లాలో చింతమనేనిపై నమోదైన కేసులు కలకలం రేపుతున్నాయి. దీంతో నేతలు వణికిపోతున్నారు. జిల్లాల్లో దిగ్గజాలని పేరు తెచ్చుకున్న నేతుల నోరెత్తడానికి భయపడుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంకోచిస్తున్నారు. ప్రజల తరపున …వీధుల్లోకి రావాలంటే.. ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తున్నారు. ఏం జరిగినా.. ఏం జరగకపోయినా.. ప్రతీ చిన్న విషయానికి కేసులంటూ.. పోలీసులు పరుగులు పెట్టుకుంటూ వస్తూండటమే దీనికి కారణం.

జిల్లాల వారీగా టీడీపీ ముఖ్య నేతలపై కేసుల వల..!

జిల్లాల వారీగా ప్రధానమైన నేతల్ని టార్గెట్ చేసి.. ఇతర నేతలను భయాందోళనలకు గురి చేసేందుకు వైసీపీ సర్కార్.. ఈ తరహా వ్యూహాం అమలు చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాల వారీగా వైసీపీ ఇప్పటికే లెక్క తీసిందని.. దాని ప్రకారం యాక్షన్ ప్లాన్ అమలవుతోంది. టీడీపీ నేతల ఇళ్లలో సోదాలు చేస్తూ పోలీసులు భయాందోళనలు కలిగిస్తున్నారనే ఆరోపణలు ప్రతిపక్ష పార్టీ నుంచి వస్తున్నాయి. ఈ వ్యూహం జిల్లాల వారీగా అమలవుతోంది. శ్రీకాకుళం జిల్లాలో కూన రవికుమార్, విశాఖ జిల్లాలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును టార్గెట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో… వైసీపీ బెదిరింపులకు భయపడి.. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఓ అభ్యర్థి టీడీపీకి రాజీనామా చేశారు. పాత కేసుకు భయపడి మరో నేత బయటకు రావడం లేదు. పశ్చిమగోదావరి జిల్లాలో చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేయడానికి పోలీసులు తిరుగుతున్నారు. ఫిర్యాదులు ఇచ్చిన వాళ్లు.. అసలు తాము ఫిర్యాదు ఇవ్వలేదనని చెప్పడం ఈ కేసులో కొస మెరుపు.

అయితే పార్టీ మారాలి.. లేకపోతే సైలెంటవ్వాలి..!

ఇక కృష్ణా జిల్లాలోనూ ఓ టీడీపీ ముఖ్యనేతపై వైసీపీ గురి పెట్టిందని చెబుతున్నారు. ఆయన మంత్రిగా నిర్వహించిన శాఖలో ఎలాగైనా అవినీతి వెలికి తీయాలనే ప్రయత్నం గత మూడు నెలలుగా చేస్తున్నారు. వైసీపీ నేతల దూకుడుతో.. ఇతర టీడీపీ నేతలు వీలైనంత మౌనం పాటిస్తున్నారు. ఇక గుంటూరు జిల్లాలో .. మూడు నెలల్లో టీడీపీ కీలక నేత కోడెల కుటుంబంపై పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. మరో నేత యరపతినేనిపై సీబీఐ విచారణకు రంగం సిద్ధమయింది. ప్రకాశం జిల్లాలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంను ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొనకుండా.. వైసీపీ నేతలు అడ్డుకున్నారు. అయితే.. కేసును తిరిగి కరణం బలరాంపైనే పెట్టారనే ఆరోపణలు టీడీపీ నేతలు చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు,ప్రకాశం జిల్లాల్లో పలువురు టీడీపీ నేతలపై ఉన్న పాత ఫిర్యాదులను బయటకు తీస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాటిని అడ్డం పెట్టుకుని.. పార్టీ మారడమో.. లేదా .. సైలెంట్ గా ఉండటమో చేయాలనే సూచనలు వస్తున్నట్లుగా టీడీపీ నేతలు అంతర్గతంగా చెప్పుకుంటున్నారు.

ముందు ముందు మరింత ఒత్తిడి ఖాయమే..!

నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయినప్పటికీ.. జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న సోమిరెడ్డి చంద్రహమోహన్ రెడ్డిపై ఓ కేసు నమోదైంది. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఓ తప్పుడు ఫిర్యాదును.. సివిల్ కేసును ఇప్పుడు… ఇలా బయటకు తెచ్చారని సోమిరెడ్డి ఆరోపిస్తున్నారు. సోమిరెడ్డి తరహాలో… మాట్లాడే ఇతర నేతలు సైలెంటయ్యారు. ఇలా ఒక్కో జిల్లాలో ఒక్కో టీడీపీ నేతను టార్గెట్ చేసి.. అడపాదడపా.. ద్వితీయ శ్రేణి నేతలపై దాడులతో … వేధిస్తున్నారని టీడీపీ నేతలంటున్నారు. ఇలా చేయడం వల్ల టీడీపీ తరపున యాక్టివ్ గా పని చేయకుండా.. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా చేసే వ్యూహం ఉందని.. టీడీపీ అగ్రనేతలంటున్నారు. ప్రస్తుతానికి ఇది వర్కవుట‌్ అవుతున్నట్లుగానే కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close