ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పరిస్థితి చూస్తుంటే తన ఒళ్లు కాలుతున్నా.. పక్కోడి చుట్ట వెలగలేదని సంతోషపడినట్లుగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమై, కేడర్ అంతా చెల్లాచెదురై పోతుంటే.. ఆ పార్టీ నేతలు మాత్రం తమిళనాడులో విజయ్ గెలుపును చూసి మురిసిపోతున్నారు. విజయ్ గెలిస్తే పవన్ కళ్యాణ్‌కు ఓటమి అని సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. అసలు విజయ్ను చూసి పవన్ నేర్చుకోవాలని చెబుతున్న వైసీపీ నేతలు.. అదే విజయ్‌ని చూసి జగన్ నేర్చుకోవాల్సిన పాఠాల గురించి ఎందుకు మాట్లాడటం లేదు?
జగన్‌తో కలిసేందుకు ఒక్క పార్టీ అయినా ముందుకు వస్తుందా?
నిజానికి విజయ్ తన పార్టీ టీవీకే ను ఎలా నడిపిస్తున్నారో చూస్తే జగన్‌కు కనువిప్పు కలగాలి. విజయ్ గెలుపును పవన్ కళ్యాణ్‌తో పోలుస్తూ ఎద్దేవా చేయడం చూస్తుంటే.. ఇంట్లో ఈగలు తోలలేనోడు.. అడవిలో పులుల్ని వేటాడతానని ప్రగల్భాలు పలికినట్లు ఉంది. విజయ్ ఎన్నికల తర్వాత అయినా పాటు మరికొన్ని శక్తులను కలుపుకుని, చిన్న పార్టీలను గౌరవిస్తూ ముందుకు వెళ్లారు. కానీ జగన్ తో కలిసేందుకు ఒక్క పార్టీ కూడా ముందుకు రావడం లేదు. ఎందుకు ఆయన అంటరాని వాడయ్యాడో వైసీపీ నేతలకు తెలుసా.
పవన్ ను చూసి నేర్చుకోవాల్సింది జగన్
గెలిచిన పవన్‌ను చూసి నేర్చుకోవాల్సింది పోయి, పక్క రాష్ట్రంలోని విజయ్ను అడ్డం పెట్టుకుని విమర్శలు చేయడం వ్యక్తిగత ద్వేషమే. విజ తన క్యాడర్‌ను ఎలా గౌరవిస్తున్నారో, సెకండ్ లైన్ లీడర్షిప్ను ఎలా తయారు చేస్తున్నారో జగన్ గమనించాలి. చంకలో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు”.. సొంత పార్టీలో నియంతృత్వ ధోరణిని మార్చుకోకుండా, పక్కోడి విజయాల్లో ఓదార్పు వెతుక్కుంటున్నారు వైసీపీ నేతలు. పవన్ కళ్యాణ్ పదేళ్ల పాటు ఓపికగా పోరాడి, జీరో నుంచి హీరో స్థాయికి ఎదిగారు. కానీ వైసీపీ మాత్రం ఉన్న అధికారాన్ని పోగొట్టుకుని ఇప్పుడు అడ్రస్ కోసం వెతుక్కుంటోంది. విజయ్ సాధించిన విజయం ఆయన టీమ్ వర్క్, పవన్ సాధించిన విజయం ఆయన నిబద్ధత. ఈ రెండింటిలోనూ వైసీపీకి దక్కిన క్రెడిట్ సున్నా!
పార్టీ కనమరుగు అవుతున్నా అదే విద్వేషం
ఇప్పటికైనా వైసీపీ నేతలు గోడకు కొట్టిన సున్నం లాంటి తమ పరిస్థితిని గుర్తిస్తే మంచిది. పక్క రాష్ట్రం మీద చూపే శ్రద్ధలో కాస్తయినా సొంత పార్టీ మీద చూపిస్తే, వచ్చే ఎన్నికలకైనా కనీసం ప్రతిపక్ష హోదా దక్కుతుందేమో ఆలోచించుకోవాలి. లేదంటే.. తినబోతూ రుచి అడిగినట్లు .. పార్టీ మొత్తం ఖాళీ అయ్యాక, ఏడ్చి ప్రయోజనం ఉండదు. పవన్ కళ్యాణ్‌ను విమర్శించే నైతిక అర్హత కోల్పోయిన వైసీపీ, ముందు విజయ్ లాగా అందరినీ కలుపుకుని వెళ్లడం ఎలాగో నేర్చుకుంటే జగన్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. కానీ ఆ పార్టీ నేతలకు అలాంటి ఆలోచనలే లేవు.


