“మద్య నిషేధం”పై కిక్కురుమనని వైసీపీ !

మందు బాబుల నుంచి ఏటా రూ. ఇరవ వైల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పి లిక్కర్ బాండ్లను వేలం వేసి రూ. ఎనిమిది వేల కోట్లకుపైగా భారీ వడ్డీకి అప్పు తెచ్చుకున్న ఏపీ ప్రభుత్వంపై విమర్శలు పెరిగిపోతున్నాయి. మద్య నిషేధం హామీ ఇచ్చి ఇప్పుడు మద్యం ద్వారా ఆదాయం మాత్రమే తెచ్చుకుంటామని చెబుతున్న వైనంపై అన్ని పార్టీల నేతలే కాదు.. సామాన్య ప్రజలూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదేం పద్దతని ప్రశ్నిస్తున్నారు. మాటతప్పిన రాజకీయనేత రాజీనామా చేసి పోయేలా రాజకీయం మారుస్తానని ఆయన పాదయాత్ర సభల్లో దీర్ఘాలు తీస్తూ చెప్పిన మాటల్ని గుర్తు చేస్తున్నారు.

తెలుగుదేశం , జనసేన పార్టీలు లిక్కర్ బాండ్ల అమ్మకంపై విరుచుకుపడుతున్నాయి. పవన్ కల్యాణ్ కూడా జగన్ తీరును ఎద్దేవా చేశారు. అన్ని వైపుల నుంచి ప్రశ్నలు దూసుకొస్తున్నా… వైసీపీ నేతలు మాత్రం నోరు మెదపడం లేదు. సమర్థించుకోవడం కష్టం కాబట్టి.. ఏదో విధంగా ఈ ఇష్యూలో వీలైనంత వరకూ సైలెంట్‌గా ఉంటే చాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తాము స్పందిస్తే ఇంకా ఎక్కువ చర్చ జరుగుతుందని అలా జరిగితే తమకే నష్టమని అంచనా కు వస్తున్నారు. అయితే తాము స్పందిచకపోతే.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని కొంత మంది వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

మద్యం రేట్ల విషయంలో మందు బాబులే.. కాదు మద్యం అలవాటు ఉన్న వారి కుటుంబాల్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తమ సంపాదనలో చాలా భాగం మద్యం రూపంలో ప్రభుత్వమే తీసుకుంటోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మద్యాన్ని నిషేధిస్తామని .. తమ కుటుంబాల్ని బాగు చేస్తామని చెప్పి.. ఇప్పుడు మద్యంతోనే తమ ఆదాయాలను పిండుకునే ప్రయత్నం చేసి… తమ కుటుంబాలను మరింత దారుణంగా ముంచేస్తున్న వైనంపై వారిలో అసంతృప్తి పెరిగిపోతోంది. దీనికైనా వైసీపీ నేతలు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close