హోదా, జోన్, పోలవరం…ఏదీ లేదు! వైసీపీ నోరెత్తదేం ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిస్సహాయత, వైసీపీ చేతకానితనం కారణంగా ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతోంది. పార్లమెంట్‌ సమావేశాల్లో దొరికింది ఇదే సందు అని రాష్ట్రానికి రావాల్సిన అన్ని ప్రయోజనాలపై కేంద్రం వేటు వేసింది. ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని ఇచ్చే ప్రశ్నే లేదని తేల్చి చెప్పింది.పోలవరం ప్రాజెక్ట్ వచ్చే ఏప్రిల్‌కు పూర్తికాదని.. సవరించిన అంచనాలను ఇచ్చే ప్రశ్నే లేదని చెప్పింది. చివరికి అధికారిక ప్రకటన చేసిన రైల్వే జోన్ విషయాన్ని కూడా లైట్ తీసుకున్నట్లుగా తెలిపింది. ఇంకా విభజన సమస్యల విషయంలో అత్యంత దారుణంగా ప్రకటనలు ఇస్తున్నారు. మొత్తంగా చూస్తే ఏపీకి రావాల్సిన.. చేయాల్సిన సాయాలను కూడా కేంద్రం నిలిపివేస్తోంది.

పార్లమెంట్ సమావేశాల్లో ఏపీ పరిస్థితిని చూసిన వారికి.. ఇంత మోసమా అని అని కడుపు మండిపోవడం ఖాయం. అయితే అధికార పార్టీ ఎంపీలు… లోక్‌సభలోనాలుగో అతి పెద్ద పార్టీగా ఉన్న వైఎస్ఆర్‌సీపీకి మాత్రం చీమ కుట్టినట్లుగా కూడా లేదు. కనీస ఆందోళన కూడా చెందడం లేదు. కేంద్రాన్ని నిలదీయం కాదు కదా కనీసం ప్రశ్నించడం లేదు. ఈ పరిస్థితిని ఆసరా చేసుకుని కేంద్రం తమకు ఆర్థిక భారం అనుకున్న ప్రతి అంశాన్ని కుదరదని తేల్చేస్తుంది. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యతే డొలాయమానంలో పడింది. రాజధాని లేదు.. పోలవరం లేదు.. హోదా లేదు.. జోన్ లేదు.. అన్నింటికి మించి ఇవి కావాలని అడిగి ఎంపీలూ లేరు.

ఢిల్లీలో పోరాడి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన ఎంపీలు…ఎవరి ప్రయోజనాల కోసం ఢిల్లీలో పని చేస్తున్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. చివరికి పార్లమెంట్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి విమర్శలు చేసినా స్పందించలేని దౌర్భగ్య స్థితిని ఎంపీలు ఎదుర్కొంటున్నారు. అన్నమయ్య ప్రాజెక్ట్ డ్యాం వైఫల్యం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెబుతూంటే… సీరియస్‌గా వింటూ ఉన్న విజయసాయిరెడ్డి సైలెంట్‌గా ఉన్నారు. కానీ బయట మాత్రం వైసీపీ నేతలు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. కొసమెరుపు ఏమిటంటే… పార్లమెంట్‌లో రఘురామకృష్ణరాజు రాష్ట్ర సమస్యలపై మాట్లాడుతూంటే మాత్రం వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు బూతులతో విరుచుకుపడుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే కేంద్రం మాత్రం ఎందుకు సాయం చేయాలని అనుకుంటుంది..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close