నరికేస్తామన్నా సరే పట్టించుకోడం లేదు కదా అని రెచ్చిపోతున్న రప్పారప్పా బ్యాచ్‌కు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అయినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ పట్టించుకోనట్లుగా ఉన్నా.. అదే అలుసుగా తీసుకుని వారు రెచ్చిపోతున్న వైనంతో ఇక కఠినంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఇటీవల పవన్ కల్యాణ్ తో పాటు నారా లోకేష్ కూడా ఇదే తరహా హెచ్చరికలు జారీ చేశారు. రప్పారప్పా అంటున్నారని తాము అనుకుంటే ఇప్పుడు రెండు రప్పారప్పాలిస్తామని లోకేష్ హెచ్చరిస్తే.. రాజకీయ నిర్ణయం తీసుకునే వరకూ అతి చేయవద్దని పవన్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వీరి మాటల్ని తరచూ ప్రస్తావిస్తూ రాజకీయ రౌడీయిజాన్ని సహించే ప్రశ్నే ఉండదని అంటున్నారు.
పెట్టుబడులపై కుట్ర చేయడంతోనే కఠిన వైఖరికి నిర్ణయం
ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుడులు వస్తున్నాయి. ఆ పెట్టుబడులు రావడానికి ప్రధాన కారణం గతంలో జరిగిన ఘోరాలు మళ్లీ జరగవని.. ఆ దెయ్యం మళ్లీ రాదని ఆ పెట్టుబడిదారులకు హామీ ఇవ్వడం వల్లనే సాధ్యం అవుతోంది. జగన్ రెడ్డి ఇప్పుడు తాను వస్తే పెట్టుబడిదారుల్ని జైల్లో పెడతానని హెచ్చరిస్తున్నారు. ఇది చంద్రబాబును తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది. వచ్చే వారిని రానివ్వకుండా చేసే కుట్ర చేయడాన్ని మొదట్లోనే కట్టడి చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. దానికి తగ్గట్లుగానే రాజకీయ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని భావిస్తున్నారు.
కుట్రలు చేస్తున్న వారి గురించి ప్రభుత్వం వద్ద సమగ్ర సమాచారం
వైసీపీ నాయకత్వం బయటకు రాజకీయం చేయడం చేత కాలేదు. ప్రజల్లో స్పందన ఉండని అంశాలను పట్టుకుని హడావుడి చేస్తారు. కానీ అంతర్గతంగా ప్రభుత్వం కూడా ఊహించని విధంగా కుట్రలు చేస్తారు. ఆ కుట్రల్ని సామాన్యులు ఎవరూ ఊహించలేరు. దానికి నకిలీ లిక్కర్ స్కామే ఉదాహరణ. తాము చేసిన లిక్కర్ స్కామ్‌ను తామే బయటపెట్టినట్లుగా నటించి.. ఆ తర్వాత సహజ మరణాలన్నింటినీ ఆ నకిలీ లిక్కర్ స్కామ్ ఖాతాలో వేసి.. జగన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేయాలనుకున్నారు. కానీ పోలీసులు చురుకుగా వ్యవహరించి అసలు కుట్రలో పాత్రధారి జోగి రమేష్ ను పట్టుకోవడంతో గుట్టు రట్టు అయింది. వైసీపీ ఇలా చేస్తుందని ప్రభుత్వం కూడా ఊహించలేకపోయింది. ఆ తర్వాత అప్రమత్తమయి.. పూర్తి స్థాయి వైసీపీ రాజకీయ కుట్రలపై దృష్టి పెట్టారు.
క్యాడర్ ను బలి చేసి తాను బలపడటమే జగన్ ప్లాన్ !
అధికారంలోకి రాగానే అందర్నీ నరుకుతామంటూ పోస్టర్లు వేసి కార్యకర్తలతో ప్రదర్శించ చేస్తున్నారు. కానీ వారు అధికారంలోకి రావాలి. ఇప్పుడు అధికారంలో ఉన్న వారే వాళ్లను ఆ విధంగా చేయాలంటే ఎవరు బలవుతారు?. వైసీపీ పెద్దలకు తెలుసు. అయినా తమ పార్టీ నేతల్ని కార్యకర్తల్ని బలి చేసి అయినా తాము లాభపడాలని అనుకుంటారు.. అందుకే వారిని బలి పశువుల్ని చేస్తున్నారు. ప్రభుత్వం వారి ప్రణాళికల్ని. ..వైసీపీ క్యాడర్ కే తెలిసేలా చేయనుంది. రప్పారప్పా అనేది వైసీపీ క్యాడర్ ు బలి చేసి తాను బలపడాలనుకున్న జగన్ కుట్ర అనేది అందరికీ తెలిసేలా చేయనుంది. దీని కోసం కార్యాచరణ రెడీ అవుతోంది.
