ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో నడుస్తున్న సినిమా “మైండ్ గేమ్..”..!

  • టీడీపీ నుంచి గెలవని ఓ ఎమ్మెల్యే వైసీపీలో చేరారు..!
  • అసెంబ్లీ టిక్కెట్, మంత్రి పదవి అనగానే మరో ఎంపీ వెళ్లిపోయారు..!
  • 19 ఏళ్ల నుంచి రాజకీయాల్లో లేని మరో డబ్బున్న వ్యక్తి టీడీపీ పేరు చెప్పుకుని వైసీపీలో చేరాడు..!

ఇప్పటి వరకు జరిగింది ఇదే.. ! కానీ ..మైండ్ గేమ్ మాత్రం… ఆకాశంలో ఉంటోంది. అదిగో… రాయలసీమ నుంచి ఆయనొస్తున్నారట..! ఇదిగో..ఉత్తరాంమధ్ర నుంచి ఈయన వస్తున్నారట..! జగన్‌ను… చెడామడా తిట్టేసిన ఆమె కూడా.. వైసీపీలో చేరుతోందట..!…అంటూ మైండ్ గేమ్ ప్రారంభించారు. నిజానికి ఎవరో తెలిసేలా.. చెబుతూ.. వైసీపీకి అనుకూలంగా ఉన్న మీడియా… నేరుగా చెప్పకుండా ప్రచారం చేస్తోంది. కానీ.. వైసీపీ సోషల్ మీడియాలో మాత్రం… ఎంత మంది అవకాశం ఉంటే.. అంత మంది పేర్లూ.. ప్రచారంలోకి తెస్తున్నారు.

మేము పార్టీ మారడం లేదు బాబోయ్.. అని.. టీడీపీ నేతలు.. మీడియా ముందుకు వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితిని .. మైండ్ గేమ్ ద్వారా సృష్టిస్తున్నారు. ఎమ్మెల్యే మాగుంట శ్రీనివాసులరెడ్డి … ఎప్పట్లాగే.. తన వద్దకు వచ్చిన అనుచరులతో సమావేశం అవ్వగానే.. పార్టీ మార్పు కోసమే… అంటూ.. బ్రేకింగులేసేశారు. ఆయన తీవ్రంగా ఖండన ప్రకటన చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత.. ఏలూరు ఎంపీ మాగంటి బాబు మీద కూడా అదే పరిస్థితి. వైఎస్ చేతిలో అవమానాలకు గురై… టీడీపీలో చేరిన ఆయన కుటుంబం… వైసీపీలోకి వెళ్లడం ఏమిటనేది.. చాలా మందికి అర్థం కాలేదు. ఇలాంటి ప్రచారం.. పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత మీద కూడా వచ్చింది. ఇక గంటా దగ్గర్నుంచి… ప్రచారం చేసుకోవడానికి చాలా మంది నేతల పేర్లు ఉన్నాయి. కానీ.. ఈ మైండ్ గేమ్‌ వెనుక వారిని టీడీపీకి దూరం చేసి… ఇక వేరే పార్టీలోకి పోలేక.. వైసీపీలోకి వచ్చేలా చేయాలనే ప్లాన్ ఉందని… రాజకీయాల్లో ఓనమాలు తెలిసిన వారందరికీ..అవగతమయ్యే విషయం. టీడీపీలో పార్టీ నేతలు.. కొంతగా అసంతృప్తిగా ఉన్న వారెవరిని ఇలా టార్గెట్ చేస్తున్నారు. పార్టీ నేతలు ఏమీ చెప్పకపోయినా.. వచ్చేస్తున్నాడని ప్రచారం చేసి.. మెల్లగా టీడీపీకి దూరం చేస్తే.. ఆయనకు మరో ప్రత్యామ్నాయం ఉండదనేది వైసీపీ నేతల భావన. అందుకే.. ప్రధాన మీడియాతో పాటు.. సోషల్ మీడియానూ వాడేసుకుంటున్నారు.

ఈ విషయంలో టీడీపీ కూడా వెనక్కి తగ్గడం లేదు. తమ పార్టీలోకి వైసీపీ ముఖ్యనేతలు వస్తున్నారనే ప్రచారం ప్రారంభించారు. గుంటూరు జిల్లాలో జగన్ ఆశలు పెట్టుకున్న కాసు కృష్ణారెడ్డి కుటుంబం… టీడీపీలోకి రావడానికి సిద్ధమయిందని తాజా కబురు… టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. నర్సరావుపేట టిక్కెట్ ను మాత్రమే.. కాసు కుమారుడు మహేష్ రెడ్డి ఆశిస్తున్నారు. కానీ జగన్ గురజాల ఇస్తామంటున్నారు. అక్కడ ఇన్చార్జిగా నియమించారు. నర్సరావుపేట టిక్కెట్ కోసం..టీడీపీతో మాట్లాడుకుని… నేడో రేపో సైకిలెక్కబోతున్నారని.. తాజా సమాచారం. దీనికి కోడెల కూడా అంగీకరించారట. ఈ లెక్క.. టీడీపీలో చాంతాడండ జాబితా కనిపిస్తోంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్, కొణతాల రామకృష్ణ, సబ్బం హరి, దాడి వీరభద్రరావు, డీఎల్ రవీంద్రారెడ్డి లాంటి దిగ్గజాలుగా పేరు పొంది… ప్రజల్లో అభిమానం ఉన్న నేతలంతా వరుసగా టీడీపీలో చేరబోతున్నారు. వైసీపీలో టిక్కెట్ల లెక్క తేలే కొద్దీ… జిల్లా, నియోజకవర్గ స్థాయి నేతల్ని సైకిలెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కాటంరెడ్డి విష్ణువర్థన్‌రెడ్డి, వంటేరు వేణుగోపాల్‌రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. టీడీపీలో చేరబోతున్నారు. ముందు ముందు…ఈ రెండు పార్టీల మైండ్ గేమ్.. చాలా దూరం పోయే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close