ఒంటరిగానే వైసీపీ బంద్‌..! పట్టించుకోని పార్టీలు..!!

చంద్రబాబునాయుడుపై ఒత్తిడి తెచ్చి తెలుగుదేశం పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తామంటూ… వైసీపీ ఎంపీ అధినేత ఇచ్చిన బంద్ పిలుపునకు.. ఆ పార్టీ నేతలు తప్ప ఇంకెవరూ స్పందించలేదు. గతంలో ప్రత్యేకహోదా బంద్‌కు వైసీపీ పిలుపునిచ్చినా.. కమ్యూనిస్టులు పిలుపునిచ్చినా.. ఒకరికొకరు స్పందించేవారు. కానీ ఇప్పుడు వైసీపీ పిలుపును కమ్యూనిస్టులు కూడా పట్టించుకోవడం లేదు. ఎవరి పోరాటం వారు చేసుకుంటున్నారు. తాము పిలుపునిచ్చిన బంద్ కు మద్దతు ఇవ్వాలని వామపక్షాలను వైసీపీ కోరింది. జనసేన, సీపీఐ, సీపీఎం లు సుదీర్ఘ చర్చల అనంతరం బంద్‌కు మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించాయి. రెండు రోజుల నుంచి జరుగుతున్న సంప్రదింపులు కూడా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో వైసీపీకి షాక్ తగిలినట్లయింది.

బంద్‌కు మద్దతు కోసం… సజ్జల రామకృష్ణారెడ్డి.. సీపీఐ, సీపీఎం నేతలకు ఫోన్ చేసి చేశారు. మద్దతివ్వాలని కోరారు. తమను అడగకుండా, కనీసం మాట మాత్రం అయినా చెప్పకుండా బంద్ కు పిలుపునిచ్చి, ఆ తర్వాత మద్దతు ఇవ్వాలని కోరడం ఏమిటని ఈ మూడు పార్టీల నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. చీటికీ, మాటికీ బంద్ పిలుపులు ఇచ్చి, ప్రజాజీవనాన్ని స్తంభింపచేయడం కూడా మంచిది కాదని వారు భావించారు. దీంతో పాటు విడిగా కమ్యూనిస్టులు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. మళ్లీ ప్రత్యేకంగా బంద్ పిలుపు అవసరం లేదని సీపీఐ, సీపీఎంలు ఒక నిర్ణయానికి వచ్చాయి.

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బంద్‌కు పిలుపునిచ్చినా మద్దతు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సారి సైలెంట్ వెనక్కి తగ్గింది. బంద్‌కు మద్దతు ఇచ్చేప్రసక్తే లేదని…రఘువీరారెడ్డి అంతపురంలో తేల్చి చెప్పారు. విభజన హక్కుల పోరాట సమితి కూడా బంద్ కు మద్దతు ఇస్తూ ప్రకటన చేయలేదు. వైసీపీ ఎంపీలు రాజీనామాల చేసి పోరాటం నుంచి పారిపోవడం… సభలో గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేశినేని నానిల ప్రసంగాలకు ప్రజల్లో మంచి స్పందన రావడం కూడా ఈ పార్టీలను ఆలోచింపచేశాయి. పోరాడుతున్న టీడీపీని విమర్శిస్తూ ప్రజల్లోకి వెళ్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని వెనక్కి తగ్గారు. దీంతో వైసీపీ ఒంటరిగానే బంద్ చేసుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close