జంతర్ మంతర్‌లో ఇక షర్మిల దీక్ష !

తెలంగాణ రాజకీయాలు ఢిల్లీలో ధర్నాల వరకూ వెళ్తున్నాయి. మహిళా రిజర్వేషన్ల కోసమంటూ ఎమ్మెల్సీ కవిత జంతర్ మంతర్‌లో ధర్నా చేశారు. ఇప్పుడు ఆ బాధ్యత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీఅధ్యక్షురాలు తీసుకున్నారు. కానీ ఆమె లక్ష్యం కేంద్రం కాదు.. బీఆర్ఎస్సే. కాళేశ్వరంలో అవినీతిపై విచారణకు డిమాండ్ చేస్తూ ఆమె ఈ ధర్నా చేయబోతున్నారు. కాళేశ్వరంలో రూ. 70 వేల కోట్ల అవినీతి జరిగిందని కానీ విచారణ చేపట్టడం లేదని ఆరోపిస్తూ.. 14న ఢిల్లీలో జంతర్ మంతర్ లో ధర్నా చేసి అక్కడి నుంచి పార్లమెంట్ వరకు మార్చ్ చేసుకుంటూ వెళ్లాలని షర్మిల నిర్ణయించుకున్నారు.

కాళేశ్వరంకు లక్ష కోట్లకుపైగా ఖర్చు పెట్టాుర కానీ అట్టర్ ఫ్లాప్ అయిన ప్రాజెక్టని ఆరోపించారు. కమీషన్ల కోసమే చేసిన ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ .. అవసరం లేని బ్యారేజ్ లు పంప్ హౌస్ లు, సైడ్ కెనాల్స్, బాహుబలి మోటార్లు పెట్టారన్నారు. అవసరం లేని దాని మీద లక్షల కోట్లు ఖర్చు పెట్టి అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్ చేశారని ఇదంతా కమిషన్ల కోసమే చేశారని షర్మిల ఆరోపిస్తున్నారు. ఇంత వరకు కనీసం ఏ ఒక్క సంవత్సరం కూడా అర్ధ టీఎంసీ కి మించి నీళ్లు తీసుకోలేదని ..ప్రభుత్వ లెక్కలే ఒక సంవత్సరం 50 వేల ఎకరాలకు, ఒక సంవత్సరం 57 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని చెబుతున్నారన్నారు.

ప్రాజెక్ట్ ఖర్చు మూడింతలు పెంచారు.. మెగా కృష్ణా రెడ్డి అనే కంట్రాక్టర్ తో సంబంధాలు ఉన్నాయి కాబట్టి కమీషన్ల కోసం రీడిజైనింగ్ చేశారని షర్మిల ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టులు ఎలా ఇచ్చారనేది చూస్తే అన్నీ అవకతవకలే కనిపిస్తున్నాయన్నారు. లక్షా ఇరవై వేల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనన్నారు.- కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత బ్యాక్ వాటర్ తో వేల ఎకరాల్లో పంట నష్టం జరుగుంతోంది కానీ వారిని కేసీఆర్ పట్టించుకోలేదన్నారు.

ఈ ప్రాజెక్టుపై ఎన్నో ఆరోపణలు చేస్తున్న బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి ఎందుకు విచారణ చేయడం లేదని షర్మిల ప్రశ్నిస్తున్నారు. మేం ఏ ఒత్తిళ్లకు లొంగకుండా ధైర్యంగా ప్రశ్నిస్తున్నాం..
అందరూ ఎంపీలు తెలంగాణకు జరిగిన అన్యాయంపై కలిసి రావాల్సిన అవసరం ఉందిని పిలుపునిచ్చారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై మేం చేస్తున్న పోరాటానికి ఎంపీలంతా సంఘీభావం తెలపాలన్నారు. ఒక మహిళ బతుకమ్మ ముసుగులో లిక్కర్ స్కాం లో ఇరుక్కుంటే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా మద్దతు ఇస్తున్నారు బీఆర్ఎస్ ఎంపీలు కూడా దీనిపై ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close