బీజేపీ, కాంగ్రెస్‌లను కలిపే ప్రయత్నంలో షర్మిల !

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు ఫోన్ చేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ ఇష్యూ మీద కలిసి పోరాటం చేద్దామని ప్రతిపాదన పెట్టారు. నిజానికి షర్మిల ఇలా ఇద్దరికి ఫోన్ చేస్తున్నట్లుగా తెలియదేమో కానీ ఇద్దరూ స్పందించారు. కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కానీ.. పార్టీలో చర్చించుకుని చెబుతామన్నారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ కలిసి పోరాటం చేసే చాన్స్ లేదు. షర్మిల కావాలనుకుంటే ఆ పార్టీతో కలిసి ఆ పార్టీతో పోరాటం చేయవచ్చు.

తాను ఇలా ఇద్దరికీ ఫోన్లు చేశానని షర్మిల ప్రకటించుకోవడంతో అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్ నేతులు కూడా ఆశ్చర్యపోయారు. బీజేపీ, కాంగ్రెస్ లు కలిసి పోరాటం చేయడం ఎలా సాధ్యమని షర్మిల మాత్రమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తారని సెటైర్లు వేస్తున్నారు. గతంలో షర్మిలపై దాడి జరిగినప్పుడు బీజేపీ నేతలు మద్దతుగా నిలిచారు. ప్రధాని కూడా పరామర్శించారన్న ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత మళ్లీ రెండు పార్టీలు కలిసి నడుస్తున్నట్లుగా ప్రచారం అయితే జరగడంలేదు.

షర్మిల పాదయాత్ర హఠాత్తుగా పోలీసులు నిలిపివేసిన తర్వాత చేయడానికి ఏమీ కనిపించడంలేదు. ఎప్పుడో ఓ సారి ట్యాంక్ బండ్‌పై ధర్నా చేయడం.. లాంటి కార్యకలాపాలుతప్ప ఏమీ లేవు. పార్టీ నిర్మాణంపై కూడా దృష్టి పెట్టలేదు. పాలేరులో తాను పోటీ చేాయలనుకుంటున్నందున అక్కడ మాత్రం కొంత ఖర్చుపెట్టి ప్రజలకు నగదు పంపిణీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భాగ‌మ‌తి ద‌ర్శ‌కుడి ‘ఎస్‌.. బాస్‌’

పిల్ల‌జ‌మిందార్‌, భాగ‌మ‌తి చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు అశోక్. ఆ త‌ర‌వాత‌.. అశోక్ ఓ సినిమా చేశాడు. అది ఫ్లాప్ అయ్యింది. అప్ప‌టి నుంచి అశోక్ ఏం చేస్తున్నాడు? త‌న త‌దుప‌రి సినిమా ఎవ‌రితో అనే...

దక్షిణాదిలో తగ్గిపోయే లోక్‌సభ సీట్లపై కేటీఆర్ ఆందోళన!

దక్షిణాదికి దేశంలో ప్రాధాన్యం తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని చాలా కాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లోక్ సభ సీట్లను తగ్గించబోతున్నారని చాలా కాలంగా పార్టీలు ఆరోపిస్తున్నాయి. 2026వ...

రైతు భరోసా క్యాలెండర్ తప్పింది !

జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేసినా సంక్షేమ క్యాలెండర్ ను మాత్రం వదిలి పెట్టకుండా అమలు చేస్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ అది కూడా దారి తప్పుతోంది. చెప్పిన...

బింబిసార-2కి కొత్త దర్శకుడు?

కల్యాణ్‌ రామ్‌ సోషియో ఫాంటసీ 'బింబిసార’ మంచి విజయాన్ని అందుకుంది. పటాస్ తర్వాత కళ్యాణ్ రామ్ కి మళ్ళీ జోష్ తెచ్చింది. దీనికి పార్ట్ 2 వుంటుందని సినిమా ముగింపులోనే చెప్పారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close