DIL RUBA TELUGU360 REVIEW: దర్శకుడిపై పూరి ప్రభావం చాలా వుంది. పూరి మ్యూజింగ్స్ లోని మాటలు బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తుంటాయి. హీరో క్యారెక్టరైజేషన్, మాట్లాడే పద్ధతిలోనూ పూరి మార్క్ వుంది. కొన్ని మాటలు బాగా రాసుకొన్నాడు. తనకు రైటింగ్ పరంగా మంచి గ్రిప్ వుంది. కానీ తాను చెప్పదలచుకొన్న పాయింట్ ని ప్రభావవంతంగా చెప్పలేకపోయాడు. సెకండాఫ్ పూర్తిగా ట్రాక్ తప్పేశాడు. కథకు సంబంధం లేని ఎమోషన్‌నీ, విలన్‌నీ తీసుకొచ్చి తాను గందరగోళంలో పడిపోయాడు. మొత్తానికి ‘క’ తరవాత ఓ మంచి సినిమా తీసి, మరో మెట్టు ఎక్కాల్సిన కిరణ్.. అడుగు వేయడంలో తడబడ్డాడు. Rating: 2/5