ఆంధ్రాతీరం తిమింగలాలకు విషం 3 ఏళ్ళలో 71 దుర్మరణాలు

తెల్లమచ్చల నల్లటి భారీ శరీరం గల వేల్ షార్క్ చేపల సంతతి బాగా వృద్ధి చెందే సహజమైన వాతావరణం బంగాళా ఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోవుంది. బొగ్గసొర లేదా నల్లమీను లేదా తిమింగలం అని జనం పిలిచే
ఈ చేపల్ని నాలుగురోజుల క్రితం ఒక వేల్ షార్క్ పిల్ల కాకినాడ సమీపంలోని వాకలపూడి వద్ద సముద్రతీరానికి కొట్టుకు వచ్చింది. ఏడాదిలో 13, మూడేళ్ళలో 71 వేల్ షార్క్ కళేబరాలు కోస్తాంధ్ర తీరానికి కొట్టుకు వచ్చాయి. ”ఇవన్నీ రెండుటన్నులలోపు పిల్లలే దీన్నిబట్టే ఈ ప్రాంతం వేల్ షార్క్ ల పునరుత్పత్తికి అనుకూలంగా వుందని అర్ధమౌతోంది. అలజడులులేని సురక్షితమైన ప్రాంతాల్లోనే బ్రీడింగ్ జరుగుతుంది. ఆ జోన్ దాటి కాలుష్య సముద్రంలోకి చేరిన పిల్లలు చనిపోతున్నాయి. మూడేళ్ళుగా ఇలా చనిపోయిన వేల్ షార్క్ పిల్లల సంఖ్య ఆధారంగానే ఇది చెప్పగలుగుతున్నాము” అని డాక్టర్ టి తులసీరావు telugu360.com కి వివరించారు. సముద్రముఖద్వారాల పర్యావరణాన్ని కాపాడే చైతన్యం పెంచడానికి పనిచేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్ధకు ఆయన సలహాదారుగా వున్నారు.

బాగా ఎదిగిన వేల్ షార్క్ పొడవు పదిమీటర్ల పొడవు 20 టన్నుల బరువు వుంటుంది. చర్మం మందం పది పన్నెండుసెంటీమీటర్లు వుంటుంది. తెరచినప్పుడు నోరువ్యాసం ఒకటిన్నరమీటర్లు. 300 వరుసల్లో పదునైన పళ్ళు వుంటాయి. ఇంత భారీ దేహాల తిమింగలాలు సాధారణంగా లోతు జలాల్లోనే వుంటాయి. ఢీకొట్టి బోటునే దెబ్బతీయగల శక్తి కారణంగా వీటి వేట చాలా కష్టం.

అతిభారీ శరీలాల తిమింగలాలు సొర చేపలకు ఒండ్రుమట్టిలోకలసిపోయిన వృక్షసంబంధ, జంతు సంబంధ మృతకణాలే ప్రీతిపాత్రమైన ఆహారం. అదికూడా చాలా ఎక్కువ ఎక్కువగా కావాలి. ఇది లభించే నదులు, సముద్రంలో కలిసే ముఖద్వారాల (సీమౌత్) పరిసరాలకు భారీ చేపలు చేరుకుంటూవుంటాయి.

వేల్ షార్క్ లాంటి భారీ సముద్రచేపలకు లోతైన గాఢమైన గోరువెచ్చటి నీళ్ళుండే పశిఫిక్ మహాసముద్రం బాగా అనువైన స్ధావరం. సైబీరియా నుంచి పక్షులు సీజన్లవారీగా ప్రపంచమంతా వలసలుపోయి తిరిగి స్వస్ధలాలకు చేరుకునే విధంగానే భారీ చేపలు పశిఫిక్ నుంచి సముద్రాలు, మహాసముద్రాల్లో తిరిగేస్తూ సీమౌత్ ల పరిసరాలకు చేరుకుంటాయి. పునరుత్పత్తికి అనువైన వాతావరంణం వుంటే అదే బ్రీడింగ్ ప్లేస్ అవుతుంది.

భారతదేశపు పశ్చిమతీరంలో మహారాష్ట్ర, గుజరాత్ తీరాల్లో నర్మద, తపతి నదులు అరేబియా మహాసముద్రంలో కలుస్తాయి. ఆయా సీమౌత్ లలో మూడునాలుగు దశాబ్దాలక్రితం విరివిగా సంచరించిన భారీచేపలు ఆయారాషా్ట్రల్లో ఓడరేవుల కార్యకలాపాల వల్ల సముద్రకాలుష్యానికి అంతరించి, అటువైపు వెళ్ళడం మానుకున్నాయి.

నదులు సముద్రంలో కలిసే ప్రాంతంలో వరద మైదానాన్ని డెల్డా అంటారు. గోదావరికి వున్నంత పెద్ద డెల్టా దేశంలో మరేనదికీ లేదు. సముద్రంలో కలిసే వృక్ష,జంతు మృతకణాలకు డెల్టాలు ఫిల్టర్లుగా కూడా పనిచేస్తాయి. ఇద మరింత రుచికరమైన పౌష్టికాహారం కాబట్టి గోదావరి ముఖద్వారమే బంగాళాఖాతంలో భారీ చేపలకు ఫీడింగ్ పాయింటుగా వుంది.

స్ధానిక జాలర్ల నుంచి తిమింగలాలు, సొరచేపలకు ఏహానీ లేదు. అవివలలో పడితే వలనుకొరికేస్తాయి. ఆనష్టం ముప్పై,నలభైవేలు వుంటుంది. చేపను ముక్కలుగా నరికే ఖర్చు మరో నాలుగైదు వేలు అవుతుంది. ఇంత ఖర్చయినా పెద్దచేపల మాంసం తినే అలవాటు ఈ ప్రాంతంలో లేదు. ముంబాయులో ఈ మాంసం కిలోధర 4000 వేలరూపాయల వరకూ వుంది. అయితే అరుదైన ప్రాణుల్ని కాపాడే చట్ట ప్రకారం పులిని మాదిరిగా వేల్ షార్క్ ని చంపినా కూడా ఏడు సంవత్సరాల జైలుశిక్ష పడుతుంది. అందువల్ల మత్య్సకారులు పెద్ద చేపల్ని వేటాడి చంపే రిస్క్ చేయడంలేదు.

అరుదైన సహజ సంపదలైన తిమింగలం, సొర వంటి భారీ చేపలగురించి కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు పరిశోధలను దాదాపు చేయడంలేదు.అధ్యయనాలు కూడా అంతంత మాత్రమే. పారిశా్రమికీకరణవల్ల గుజరాత్ తీరం కలుషితమై అక్కడ పెద్దచేపలు మాయమైపోతున్నాయి. కోస్తా ఆంధ్రాతీరంలో మూడేళ్ళలో 71 వేల్ షార్కుల పిల్లలు చనిపోయాయంటే ఏపారిశా్రమీకరణా ప్రారంభమే కాని 1000 కిలోమీటర్ల బంగాళాఖాతంలో కాలుష్యం ఎంత హెచ్చుగా వుందో అర్ధం చేసుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలిచ్చిన రేవంత్ రెడ్డి !

జర్నలిస్టులు సుదీర్ఘంగా చేస్తున్న పోరాటం ఫలించింది . జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ కింద గతంలో కేటాయించిన భూమిని ఇప్పుడు రేవంత్ రెడ్డి హ్యాండోవర్ చేశారు. ఈ భూమికి ఒక్కో జర్నలిస్టు...

కూల్చివేతలపై హైడ్రా కీలక నిర్ణయం!

ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా వరుసగా కొరడా ఝులిపిస్తోంది. ఓ వైపు హైడ్రా పనితీరుపై ప్రశంసల జల్లు కురుస్తున్నా..మరోవైపు ఉన్నపళంగా భవనాలను కూల్చివేస్తుండటంపై తీవ్ర విమర్శలు...

జయభేరీది కార్ సర్వీసింగ్ సెంటర్ !

జయభేరీ మూడున్నర దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది కానీ ఇప్పటి వరకూ ఆ సంస్థపై చిన్న ఆరోపణ రాలేదు. క్లీన్ ఇమేజ్ తో వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్న సంస్థ. అయితే...

దివ్వెలకు ఇల్లు రాసిచ్చేసిన దువ్వాడ !

దివ్వెల మాధురీ పది రోజులు సైలెంట్ గా ఉంటానంటే.. అందరూ ఏంటో అనుకున్నారు. ఈ పది రోజుల్లో ఆమె సైలెంట్ గా తన పని తాను పూర్తి చేసుకుంది. టెక్కలిలో ఉన్న దువ్వాడ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close