హీరోతో పెళ్లి కోసం.. హీరోయిన్ ఇంట్లో గొడ‌వ‌

tollywood

రీలు లైఫులో జంట‌గా క‌నిపించిన నాగ‌చైతన్య – స‌మంత రియ‌ల్ లైఫులోనూ పెళ్లి చేసుకుని జంట‌గా గ‌డుపుతున్నారు.
త్వ‌ర‌లో టాలీవుడ్‌లో అలాంటి మ‌రో జంట పెళ్లి చేసుకోబోతోంది. వాళ్ల క‌థే ఇది.

ఎలాంటి బ్యాక్ గ్రౌండూ లేక‌పోయినా, సొంతంగా క‌ష్ట‌ప‌డి హీరో అయ్యాడు ఆ కుర్రాడు. త‌న ఖాతాలో కొన్ని హిట్లు కూడా వేసుకున్నాడు. సొంతంగా ఓ సినిమా కూడా తీశాడు. ఆ అమ్మాయి మాత్రం మంచి ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్‌తో అడుగుపెట్టింది. ఇద్ద‌రూ క‌ల‌సి ఓ సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ‌కు ఇప్పుడు పెద్ద‌లు కూడా అంగీకారం తెలిపారు.

అయితే క‌థానాయిక త‌ల్లి కి మాత్రం ఈ పెళ్లి అంత‌గా ఇష్టం లేదు. అంద‌రూ ఒప్పుకున్నా ఆమె మాత్రం `నో` చెబుతుండ‌డంతో… ఈ పెళ్లి మేట‌రు తేల‌డం లేదు. ఈ విష‌య‌మై ఆ హీరోయిన్ ఇంట్లో ప్ర‌స్తుతం చిన్న‌సైజు గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయ‌ట‌. `ఈ పెళ్లి ఎలాగైనా చేయాల్సిందే` అని ఆ అమ్మాయి ప‌ట్టుబ‌డుతుండ‌డంతో ఇంట్లోవాళ్లు మెత్త‌బ‌డుతున్నార‌ని స‌మాచారం. ఈ యేడాదే ఈ జంట పెళ్లి చేసుకోబోతోంద‌ని, అప్ప‌టి వ‌ర‌కూ ఈ విష‌యం బ‌య‌ట‌కు పొక్కుండా ఇరు కుటుంబాలూ జాగ్ర‌త్త ప‌డుతున్నాయ‌ని తెలుస్తోంది. ఓ శుభ ముహూర్తం చూసి, పెళ్లి మేట‌రు అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com