గ్రేటర్ పై గులాబీ జెండా… అనుకోని అవాంతరం తప్పదా…!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితంపై మొన్నటి వరకూ తెరాస శ్రేణులు అనుమానంగా ఉండేవి. తర్వాత కొంత నమ్మకం కలిగినట్టు కనిపించింది. ఓటర్లు ఆధార్ తో అనుసంధానం చేయించుకోలని ఎలక్షన్ కమిషన్ సూచించడంతో, గులాబీ శ్రేణుల్లో హుషారు వచ్చింది. ఏపీకి చెందిన చాలా మందికి హైదరాబాద్ లో ఓటు ఉంది. ఆధార్ కార్డు మాత్రం స్వస్థలంలో తీసుకున్నారు. కాబట్టి వారంతా ఏపీలోనే ఆధార్ అనుసంధానం చేయించుకుంటారని, హైదరాబాదులో ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లను తొలగిస్తారని భావించారు. కానీ అలా తొలగించే అవకాశం లేదంటున్నారు సీమాంధ్రులు.

ఆధార్ పై సుప్రీం కోర్టు తాజా ఆదేశాల ప్రకారం, వంట గ్యాస్, రేషన్ సరుకులకు మాత్రమే ఆధార్ ను తప్పనిసరి చేయాలి. మిగతా దేనికైనా స్వచ్ఛందమే తప్ప నిర్బంధం కాదు. ఈలెక్కలన ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం కూడా నిర్బంధం కాదు. తప్పనిసరి కాదని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈలెక్కన, ఏపీ ఓటర్లు ఆధార్ అనుసంధానం చేయించుకోక పోయినా వారి ఓటును తొలగించే అధికారం ఎన్నికల కమిషన్ కు ఉండదని, ఒక వేళ తొలగిస్తే కోర్టుకు పోతామని సీమాంధ్రులు చెప్తున్నారు.

ఆధార్ అనుసంధానం చేయకపోతే ఓటు పోతుందని ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్య, సుప్రీం కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడే అని కూడా పలువురు విమర్శిస్తున్నారు. ఆధార్ అనుసంధానం లేదని ఓటు తీసే అధికారం లేదనే విషయం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ హెచ్ ఎస్ బ్రహ్మ ప్రకటన ద్వారా కూడా స్పష్టమవుతోంది. ఆధార్ ప్రభుత్వ పథకాలకు తప్పనిసరి కాదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన విషయం తమకు తెలుసని, కాబట్టి ఓటర్ల విషయంలో తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఇటీవల బ్రహ్మ చెప్పారు. ఓటర్లే స్వచ్ఛందంగా నమోదు చేయించుకుంటున్నారని చెప్పారు.

ఈ పరిణామాలను గమనిస్తే, ఆధార్ కార్డుకు ఓటుకు సంబంధం లేదని పలువురు టీడీపీ నేతలు కూడా వాదిస్తున్నారు. తెరాస నాయకులు మాత్రం కొన్ని లక్షల మంది ఏపీ ఓటర్లు తగ్గిపోతారు కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలవవచ్చని ఆశలు పెట్టుకున్నారు. ఒకవేళ ఆధార్ తప్పనిసరి కాకపోతే సీమాంధ్రుల ఓట్లు కొనసాగే అవకాశం ఉంటుంది. దీంతో వారు పెద్ద సంఖ్యలో ఉన్న డివిజన్లలో టీడీపీ, బీజేపీకి అనుకూలంగా ఉండవచ్చనేది తెరాస శ్రేణుల అనుమానం. పైగా కొత్తగా పెరిగే 50 డివిజన్లలో అత్యధికం కొత్త నగరంలోనే పెరుగుతున్నాయి. అంటే సీమాంధ్రులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే డివిజన్లు పెరగడం తమకు కలిసి వస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. సరిగ్గా ఇదే అంశం గులాబీ శిబిరంలో గుబులు రేపుతోంది. రెండు రోజుల క్రితం సుప్రీం కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఇక అనుమానాలకు తావే లేదనే అభిప్రాయం వినవస్తోంది.

సీమాంధ్రుల ఎఫెక్ట్ తగ్గి కారు జోరు పెరుగుతుందన్న ఆశ నిరాశేనా అని గులాబీ నేతలు కొందరు డీలా పడ్డారు. తమకు విజయావకాశాలు మెరుగు పడ్డాయని భావించే సమయంలో ఈ అనుకోని అవాతరం ఏమిటని ఆ పార్టీ శ్రేణులు అంతర్గతంగా మధనపడుతున్నాయి. ఇంతకీ ఎవరి అంచనాలు నిజమవుతాయో, ఎవరి వాదన సరైందని తేలుతుందో చూద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీ వెళ్లి లోకేష్‌కు వాట్సాప్‌లో నోటీసులు ఇచ్చిన సీఐడీ !

ఏపీసీఐడీ అధికారులు ఢిల్లీలో మరోసారి తమ పరువు తీసుకున్నారు. 41A నోటీసులు ఇవ్వడానికి విజయవాడ నుంచి ఢిల్లీకి వచ్చి ...ముందుగా వాట్సాప్‌లో నోటీసులు పంపారు. అందుకున్నానని లోకేష్ రిప్లై ఇచ్చాక మళ్లీ.....

వారాహి యాత్రకు టీడీపీ క్యాడర్ కూడా !

జనసేనాని వారాహి యాత్ర కృష్ణా జిల్లాలో ఐదురోజుల పాటు సాగనుంది. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న యాత్ర కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నామని జనసేన...

ఎన్టీఆర్ హ్యాట్రిక్ సాధించలేకపోయారు – కేసీఆర్ సాధిస్తారు : కేటీఆర్

ఎన్టీఆర్ కన్నా కేసీఆర్ గొప్ప అని చెప్పుకోవడానికి కేటీఆర్ తరచూ ప్రయత్నిస్తూ ఉంటారు. మరోసారి అదే పని చేశారు. కానీ ఆయన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు మాత్రం మిస్ పైర్ అవుతూ ఉంటాయి....

రివ్యూ : కుమారి శ్రీమతి (అమెజాన్ వెబ్ సిరిస్)

కుటుంబకథా నేపధ్యంలో వెబ్ సిరిస్ చేసి అందరిని మెప్పించడం.. మిగతా జోనర్స్ కంటే కొంచెం కష్టమే. ఎందుకంటే ఇక్కడ మైండ్ బ్లోయింగ్ మలుపులతో, మెస్మరైజ్ చేసే ఎలిమెంట్స్ తో సంచలనాలు సృష్టించేసి, రానున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close