జైష్-ఏ-మహమ్మద్ అధినేతని అరెస్ట్ చేసిన పాక్

పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడికి కుట్రపన్నినట్లు అనుమానిస్తున్న జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మౌలానా మన్సూద్ అజహార్ ని పాకిస్తాన్ పోలీసులు బుదవారం అరెస్ట్ చేసినట్లు పాకిస్తాన్ కి చెందిన ‘డాన్ పత్రిక’ పేర్కొంది. పాకిస్తాన్ లోని వివిధ ప్రాంతాలలో గల జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన కార్యాలయాలపై ఈరోజు పోలీసులు దాడులు చేసి అనేక మందిని అరెస్ట్ చేసి దాని కార్యాలయాలకు తాళాలు వేసినట్లు ఆ పత్రికలో పేర్కొంది. భారత్ అందించిన అనుమానితుల జాబితా ఆధారంగా ఈ అరెస్టులు చేసినట్లు తెలిపింది.

ఈ దాడికి పాల్పడినవారి గురించి మరిన్ని వివరాలు అందించాలని పాకిస్తాన్ కోరుతోంది. భారత్ అనుమతించినట్లయితే ఈ కేసుపై దర్యాప్తు కోసం పాక్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన జాయింట్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ పఠాన్ కోట్ సందర్శించి, మరిన్ని ఆధారాలు సేకరించాలనుకొంటున్నట్లు ఆ పత్రిక పేర్కొంది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ దర్యాప్తును స్వయంగా రోజూ సమీక్షిస్తున్నారు. ఈరోజు మౌలానా మన్సూద్ అజహార్ ని అరెస్ట్ చేసిన తరువాత పాక్ ఆర్మీ జనరల్ రహీల్ షరీఫ్, ఐ.ఎస్.ఐ. చీఫ్ లెఫ్టినెంట్ జెనెరల్ రిజ్వాన్ అక్తర్ తో సమావేశమయినట్లు పాక్ మీడియా పేర్కొంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విష్ణు నిర్ణ‌యం బాగుంది.. కానీ!?

`మా` అధ్య‌క్షుడిగా ఇటీవ‌లే ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు మంచు విష్ణు. వీలైనంత త్వ‌ర‌గా త‌న మార్క్ ని చూపించాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. `మా` బై లాస్ లో కొన్నింటికి మార్చాల‌న్న‌ది విష్ణు ఆలోచ‌న‌. ...

ఏపీ చీకట్లే తెలంగాణ వెలుగులకు సాక్ష్యాలన్న కేసీఆర్

టీఆర్ఎస్ అధినేతగా 9వసారి ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్ తన ప్రసంగంలో .. తెలంగాణ అభివృద్ధిని.. ఏపీతో పోల్చి విడిపోవడం వల్ల ఎంత ప్రగతి సాధించామో వివరించారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకట్లోకి...

పూరి గ‌ట్స్‌.. రెండ్రోజుల ముందే ప్రీమియ‌ర్‌

సినిమాకి టాక్ చాలా ముఖ్యం. పాజిటీవ్ టాక్ వ‌స్తే - క‌ల‌క్ష‌న్లు వ‌స్తాయి. ఏమాత్రం తేడా వ‌చ్చినా - ఫ‌ట్‌మ‌న‌డం ఖాయం. రిలీజ్ డే టాక్ అనేది వ‌సూళ్ల‌లో కీల‌క పాత్ర పోషిస్తుంటుంది....

‘RRR’కి పోటీనే లేదా?

సంక్రాంతి బ‌రిలోకి RRR దిగ‌డంతో... స‌మీక‌ర‌ణాలు పూర్తిగా మారిపోయాయి. ఈ సంక్రాంతికి భీమ్లా నాయ‌క్‌, ఎఫ్ 3, స‌ర్కారు వారి పాట‌, రాధే శ్యామ్ ముందుగానే క‌ర్చీఫ్ లు వేసుకున్నాయి. అయితే స‌డ‌న్...

HOT NEWS

[X] Close
[X] Close