తెరాసకు సీమాంధ్రులే ఆధారం!!

ఆశ్చర్యపోతున్నారా? సీమాంధ్ర ఓట్లు తనకే అని తెరాస సంబరపడుతోందని భావిస్తున్నారా? విషయం అది కాదు. ఇది ఆధార్ కు సంబంధించిన విషయం. ఓటర్లు ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలని, లేకపోతే ఓటు హక్కు ఉండదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ విషయంలోనూ ఆధారం తప్పనిసరి అనే నిర్బంధం చెల్లదని సుప్రీం కోర్టు ఇప్పటికే చాలా సార్లు స్పష్టం చేసింది. అయితే బోగస్ ఓటర్ల ఏరివేతకు ఆధారే అత్యుత్తమ మార్గమని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.

దేశ వ్యాప్తంగా ఇదే పని చేస్తోంది. హైదరాబాదులో పెద్ద సంఖ్యలో ఉన్న సీమాంధ్రులు చాలా మందికి ఇక్కడ ఓటున్నా, సొంత ఊరిలోనే ఆధార్ కార్డు ఉంది. కాబట్టి వీరు హైదరాబాదులో ఆధార్ అనుసంధానం చేసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించక తప్పదని తెరాస నేతలు చెప్తున్నారు, ఇలా కొన్ని లక్షల మంది సీమాంధ్ర ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిస్తే, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కారు విజయావకాశాలు పెరుగుతాయని గులాబీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. తెలంగాణ జిల్లాల్లో ఈ అనుసంధానం జోరుగా జరుగుతుంటే హైదరాబాదులో మాత్రం మందకొడిగా సాగుతోంది.

అందుకే, త్వరగా చేయించకపోతే ఓటు పోతుందని కేసీఆర్ చెప్పారు. అయితే సుప్రీం కోర్టు ఉత్తర్వులను భిన్నంగా ముఖ్యమంత్రి ప్రకటన చేయడమే ఆశ్చర్యకరం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ బ్రహ్మ కూడా ఆధార్ తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేస్తామని చెప్పలేదు. చేస్తే అది సుప్రీం కోర్టులో చెల్లదని ఆయనకు తెలుసు. అందుకే, ప్రజలే స్వచ్ఛందంగా అనుసంధానం చేయించుకుంటున్నారని, తాము మాత్రం అలాంటి ఆదేశాలు జారీ చేయాలని భావించడం లేదని ఈ మధ్య చెప్పారు. తెరాస శ్రేణులు మాత్రం ఆధార్ అనుసందానం ఆధారంగా సీమాంధ్ర ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తే మంచిదని కోరుకుంటున్నాయి. ఇప్పటికే తొలగింపు ప్రక్రియ మొదలైందని వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే, ఎవరైనా సీమాంధ్రులు దీన్ని సవాలు చేస్తూ కోర్టుకు వెళ్తే ఏమవుతుందో చూడాలి. అయితే, పార్టీ బలాన్ని పెంచుకోకుండా ఇతర పార్టీల వారిని ఆకర్షించడానికి ప్రయత్నించడం, ఆధార్ ను నమ్ముకోవడం ఏమిటని కొందరు పరిశీలకులు ఆశ్చర్యం వ్చక్తం చేస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తూ, ఎప్పటి నుంచో పార్టీకి సేవ చేసే వారిని జెండా మోయడానికే పరిమితం చేస్తున్నారనే టాక్ కూడా ఉంది.

గ్రేటర్ ఎన్నికలు జరిగే లోగా ఇంకెంత మంది ఇతర పార్టీల వారిని ఆకర్షిస్తారో్. వారికి ఎలాంటి పదవులు కట్టబెడతారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఖైరతాబాద్ మహా గణపతికి వీడ్కోలు.. ట్యాంక్ బండ్ వద్ద ఇదీ పరిస్థితి!

ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన ఘట్టం పూర్తి అయింది. ఎన్టీఆర్ మార్గ్ లోని నాలుగో నెంబర్ క్రేన్ వద్ద గణనాథుడిని నిమజ్జనం చేశారు. 70 అడుగుల సప్తముఖ మహాశక్తి గణపతి నిమజ్జనోత్సవాన్ని...

ఢిల్లీ కొత్త సీఎంగా ఆమెకే బాధ్యతలు

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆప్ నేత, విద్యాశాఖ మంత్రి అతిశీ మర్లీనా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో అతిశీకి సీఎం పగ్గాలు అప్పగించాలని నిర్ణయించారు. కేజ్రీవాల్...

జానీ మాస్ట‌ర్ కేసు: ఛాంబ‌ర్ ఏం చేస్తోంది?

జానీ మాస్ట‌ర్ పై లైంగిక వేధింపుల కేసు న‌మోదు అవ్వ‌డంతో ప‌రిశ్ర‌మ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. హేమ క‌మిటీ నివేదిక దేశం మొత్తాన్ని షేక్ చేస్తున్న నేప‌థ్యంలో ఇలాంటి విష‌యాల్ని సీరియ‌స్ గా తీసుకొని,...

నెల్లూరులోనూ పెరుగుతున్న గేటెడ్ విల్లాల సంస్కృతి

ప్రజలు రాను రాను జీవన విధానంలో మార్పులు కోరుకుంటున్నారు. పని నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏ సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇళ్ల చుట్టూ రణగొణ ధ్వనులు.. ఇతర...

HOT NEWS

css.php
[X] Close
[X] Close