నేరస్తులపై బాలీవుడ్‌కు ఎందుకు సానుభూతి?

అదేంటో, నేరస్తులను సమర్థించడానికి బాలీవుడ్ జనాలు ఎప్పుడూ ముందే ఉంటారు. తోటి నటులే కాదు, కరుడుగట్టిన క్రిమినల్స్ ను కూడా సమర్థిస్తుంటారు. వారు మన అభిమాన నటులైన పాపానికి మనం కూడా ఓహో అని ఫాలో అవుతుంటాం. రీల్ లైఫ్ హీరోలే రియల్ లైఫ్ విలన్లుగా మారిన సందర్భాలు చాలానే ఉన్నాయి. బొంబాయి పేలుళ్ల కేసులో దోషులతో దోస్తీ చేసి, అక్రమంగా ఏకే 56 రైఫిల్ ను పొందిన సంజయ్ దత్ కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. అంతే, బాలీవుడ్ జనాలు చాలా మంది క్యూకట్టి మరీ సంజయ్ ఇంటికి వెళ్లి ఓదార్చారు. అదేదో మహాత్మా గాంధీకి అన్యాయం జరిగినట్టు పోజులిచ్చారు. లగే రహో మున్నాభాయ్ లో నటించగానే అతగాడు మహాత్మా గాంధీ అయిపోయినట్టు బిల్డప్ ఇచ్చారు. అతడికి అన్యాయం జరిగిందన్నారు. అలాంటి వాడు ఈ భూ ప్రపంచంమీద ఇంకొకడు పుట్టడు అన్నంత హడావుడి చేశారు.

జింకల వేట కోసం ఓ ఐదేళ్లు, హిట్ అండ్ రన్ కేసులో మరో ఐదేళ్లు జైలు శిక్ష పడిన క్రిమినల్ సల్మాన్ ఖాన్ ఇంటికీ క్యూకట్టారు బాలీవుడ్ జనాలు. పాపం అమాయకుడికి అన్యాయం జరిగిందని కొందరు మీడియా ముందే ఆక్రోశించారు. ఏడ్చారు. కండతడిపెట్టారు. అది గ్లిజరిన్ ఎఫెక్ట్ కాదని చెప్పడానికి నానా తంటాలు పడ్డారు. సల్మాన్ తో సినిమాలు తీస్తున్న వారు, కలిసి సినిమా చేస్తున్న నటీమణులు ఘొల్లుమని విలపించారు. అతడు దైవ స్వరూపుడని కూడా ఓ నటీమణి పొగిడింది. సల్మాన్ తో ఓ సినిమా చాన్స్ వచ్చిన నటి ఆమె. ఇలా, సల్మాన్ తో ఏదో ఒక అవసరం ఉన్న వారు, లేని వారు కూడా బోలెడంత సానుభూతి ఒలకబోశారు. రోదించే పాత్రలో జీవించారు.

సల్మాన్ తక్కువ తిన్నాడా, 257 మందిని పొట్టనపెట్టుకున్న బొంబాయి పేలుళ్ల ఉగ్రవాదుల్లో ఒకడైన యాకూబ్ మెమన్ ను ఉరితీయ వద్దని దబాయించాడు. దబంగ్ హీరో దుష్టుడిని సమర్థిస్తూ గట్టిగానే ట్వీట్ చేశాడు. చివరకు కన్న తండ్రే చడా మడా ఖండించడంతో సారీ చెప్పాడు.

బాలీవుడ్ సినిమా పరిశ్రమలకు పాకిస్తాన్ థియేటర్లు కావాలి. వాటిలో సినిమాలు ఆడాలి. లాభాలు రావాలి. ఆ కారణంగా వేర్పాటు వాదులను, జీహాదీ ఉగ్రవాదులను సమర్థించే బాలీవుడ్ ప్రముఖులు చాలా మందే ఉన్నారు. అలా వారిని పొగడటం వల్ల మన దేశంలో వ్యతిరేక ఫలితం రావాలి. కానీ మనం ఉదార స్వభావులం కాబట్టి, అవేమీ పట్టించుకోం. ఇంత జరిగిన తర్వాత సల్మాన్ అభిమానులు అసలు విషయం అర్థం చేసుకున్నారా? అతడిని అసహ్యించుకుంటున్నారా? లేదు. అతడు మన దృష్టిలో మహా గొప్ప హీరో. మనకు మన దేశం కంటే తెరమీద అబద్ధాలు చూపించే సినిమాలు, వాటిలోని హీరోలే ముఖ్యం. దేశం తగలబడిపోతే మనకేంటి, మన హీరో సినిమా హిట్టయితే చాలనుకునే విశాల హృదయం గల వాళ్లం. అందుకే, సల్మాన్ వంటి క్రిమినల్స్ ఇంకా క్షేమంగా, దర్జాగా, సెలెబ్రిటీ హోదాతో వెలిగిపోతున్నారు. అమ్మాయిలతో సయ్యాటలు ఆడుతూనే ఉన్నారు. మనకంటే పాకిస్తానీలే నయం, తమ దేశానికి వ్యతిరేకంగా ఒక్క డైలాగ్ ఉన్నా, సల్మాన్ సినిమాను కూడా తిరస్కరిస్తారు. హీరో కంటే దేశమే ముఖ్యమనుకుంటారు. మనం ఆ స్థాయికి ఎప్పుడు ఎదుగుతామో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close