పంద్రాగస్ట్ లక్ష్యంగా పాక్ వ్యూహాలు?

స్వాతంత్ర్య దినోత్సవాలకు మనం ఒక రకంగా సిద్ధమవుతున్నాం. పాకిస్తాన్ మరో విధంగా రెడీ అవుతోంది. ఉగ్రవాద గుంపులను సరిహద్దులు దాటించి, మరణమృదంగం మోగించడానికి ప్లాన్ చేసిందని నిఘా వర్గాలు తాజాగా హెచ్చరించాయి. జమ్ము కాశ్మీర్లోని ఉధంపూర్లో బీఎస్ఎఫ్ కాన్వాయ్ పై కాల్పులు జరిపిన ముగ్గురు ఉగ్రువాదుల్లో ఒకరిని జవాన్లు కాల్చిచంపారు. మిగతా ఇద్దరినీ సజీవంగా పట్టుకున్నారు. వీరిద్ధరూ పాకిస్తానీ జాతీయులేనని అధికారులు తెలిపారు. గత వారం పంజాబ్ లోని గుర్దాస్ పూర్లో పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన ముగ్గురు ఉగ్రవాదులు భద్రతాదళాల కాల్పుల్లో హతమయ్యారు.

బుధవారం ఉధంపూర్లో దాడి చేసిన వారు కూడా ఆనాటి ముగ్గురు ఉగ్రవాదులతో కలిసే సరిహద్దులు దాటారని బయటపడింది. తాను పన్నెండు రోజుల క్రితం ఇండియాలో ప్రవేశించానని, పట్టుబడిన ఖాసిం ఖాన్ అనే ఉగ్రవాది చెప్పాడు. అంతేకాదు, భద్రతాదళాల విచారణలో ఉగ్రవాదుల నుంచి అనేక విషయాలు రాబట్టినట్టు సమాచారం. ఇటు జమ్ము కాశ్మీర్లో అమర్ నాథ్ యాత్రను టార్గెట్ చేయడంతో పాటు, ఢిల్లీలో పంద్రాగస్టు సందర్భంగా నరమేధం సృష్టించడానికి ఉగ్రవాదులు స్కెచ్ వేశారని నిఘా వర్గాల కథనం.

ఇప్పటికే కొందరు టెర్రరిస్టులు ఢిల్లీలో చొరబడి ఉంటారని నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. అందుకే, కేంద్ర హోం శాఖను, ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఐఎస్ఐలు మన స్వాతంత్ర్య దినోత్సవానికి తమదైన శైలిలో సన్నాహాలు చేస్తుంటాయి. అయితే, పన్నెండు రోజుల క్రితం రావీ నదిని దాటి గుర్దాస్ పూర్ సమీపంలో భారత్ లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు ఎంత మంది అనేది కచ్చితంగా తెలియలేదని సమాచారం. అది తెలిస్తే, ఇంకా ఎంత మందితో ముప్పు ఉందనేదానిపై కచ్చితమైన అంచనా సాధ్యమవుతుంది.

అయితే పట్టుబడిన ఉగ్రవాదులకు కూడా తెలియకుండా, మరో బృందం మరో చోట సరిహద్దులు దాటి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిఘావర్గాలు ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా అలర్ట్ సైరన్ మోగించాయి. భద్రత బలహీనంగా ఉన్న చోట ఉగ్రవాదులు జన సమ్మర్థం గల ప్రాంతాల్లో విరుచుకు పడే అవకాశం ఉందని రా, ఐబీ లు హెచ్చరిక జారీ చేశాయి. తాజాగా పట్టుబడిన ఇద్దరు ఉగ్రవాదులేనని, అందులో ఒకడి స్వస్థలం ఫైసలాబాద్ అని రూఢి అయింది. అయినా, వాళ్లు మావాళ్లు కాదని పాక్ దబాయించినా ఆశ్చర్యం లేదు. కసబ్ విషయంలో అదే జరిగింది. కాబట్టి, పాకిస్తాన్ ను నమ్మించడానికి సమయన్ని వృథా చేసే బదులు, అంతర్జాతీయ సమాజానికి ఈ వాస్తవం అర్థమయ్యేలా చేయడం ముఖ్యం. అలాగే, ఉగ్రదాడి జరిగితే పరిణామం తీవ్రంగా ఉంటుందని పాక్ కు తెలిసేలా ప్రతిస్పందన ఉంటేనే ఇంకోసారి మన జోలికి రాదని దేశ ప్రజలు భావిస్తున్నారు. ఈసారి పాక్ పంద్రాగస్ట్ టార్గెట్ కు మోడీ ప్రభుత్వం ఎలా కౌంటర్ ఇస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జంధ్యాల స్టైల్‌లో `పేక మేడ‌లు`

'నా పేరు శివ', 'అంధగారం', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషించిన వినోద్ కిష‌న్ ఇప్పుడు హీరోగా మారాడు. ఆయ‌న న‌టించిన 'పేక మేడ‌లు' ఈనెల 19న విడుద‌ల‌కు సిద్ధంగా...

బీజేపీలో బీఆర్ఎస్ రాజ్యసభపక్షం విలీనం ?

బీఆర్ఎస్ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనం అయ్యేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లుగా ఢిల్లీలో ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరబోతున్నారు. ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఉపరాష్ట్రపతి,...
video

విజ‌య్ తెలివి.. ‘పార్టీ’ సాంగ్‌లో పాలిటిక్స్

https://www.youtube.com/watch?v=ygq_g7ceook త‌మిళ స్టార్ హీరో విజ‌య్ కొత్త‌గా పార్టీ స్థాపించిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే రాజ‌కీయ అరంగేట్రం చేయ‌బోతున్నాన‌ని, వ‌చ్చే త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు. రాజ‌కీయాల‌కు ముందు త‌న చివ‌రి...

పొన్నవోలు వాదన జగన్‌కైనా అర్థమవుతుందా ?

రఘురామ ఫిర్యాదుతో జగన్ తో పాటు ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కేసు నమోదయింది. ఇది తప్పుడు కేసు అని వాదించడానికి పొన్నవోలు మీడియా సమావేశం పెట్టారు. ఇందు కోసం తన టేబుల్ నిండా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close