బిజెపి బాటలోనే కాంగ్రెస్ ఆట

అదే ఆట…అదే ఆటస్ధలం…ఆటగాళ్ళే అటూ ఇటూ మారారు…మిగిలిందంతా సేమ్ టు సేమ్. ఇది మౌనముని నరేంద్రమోదీ సాక్షిగా రచ్చగా మారిపోయిన చర్చల పార్లమెంటు. 2జి స్పెక్ట్రమ్‌‍మీద జాయింట్ పార్లమెంటరీ వేయాలని పట్టుబట్టిన బిజెపి 2011లో పార్లమెంటు శీతాకాలపు సమావేశాల్ని ఒక్కరోజు కూడా జరగనివ్వలేదు. నాలుగేళ్ళ తరువాత వర్షాకాలపు సమావేశాల్లో ఇపుడు కాంగ్రెస్ అదేపని చేస్తోంది. ఎవరెంతచెప్పినా సుష్మా, వసుంధర, చౌహాన్ లు రాజీనామా చేయరని పార్లమెంటు సమావేశాలకు ముందుగానే ప్రధాని ప్రకటించేసి చేతులు కట్టుకుని కూర్చున్నారు.

ఐదురోజులపాటు సస్పెండయిన కాంగ్రెస్ ఎంపీలకు సంఘీభావంగా తామూ సభకు వెళ్ళేది లేదని 9 ప్రతిపక్షాలూ ప్రకటించడం కాంగ్రెస్ నైతిక బలాన్ని పెంచింది. సభనియమనిబంధనలను తాను రాయలేదని ఎప్పటినుంచో వున్నవాటినే అమలు చేస్తున్నానని స్పీకర్ చర్యను సమర్ధించుకుంటే, సభను నడవనీయకపోవడం తానుపెట్టిన సాంప్రదాయం కాదని, ”రాజీనామాలే ముందు, ఆతరువాతే మాటలు” అని ప్రభోధించింది బిజెపి యేనని సోనియా దెప్పిపొడిచారు.

చట్టసభలో బాధ్యతా యుతమైన చర్చలకంటే, రెండునెలల్లో బీహార్ ఎన్నికలు జరుగుతూండగా మెట్టుదిగినట్టు కనిపించకపోవడమే పాలక, ప్రతిపక్షాలకు ముఖ్యం. సభను సజావుగా సాగనివ్వండి ప్రధానే సమాధానం చెబుతారు అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సంప్రదించినా సోనియా ససేమిరా అన్నారంటే తాడు తెగిపోయినా సరే సాగలాగడమే కాంగ్రెస్ ధోరణిగా స్పష్టమైంది.

అధికార దుర్వినియోగానికి , ఆశ్రిత పక్షపాతానికి మించి నిందితుడైన లలిత్ మోడీని విదేశీపర్యటనకు అనుమతించవలసిందిగా మరొకదేశాన్ని ఒక కేంద్రమంత్రి స్వయంగా కోరి దేశం పరువుప్రతిష్ఠలను దిగజార్చిన అంశం. అందుకు పాల్పడిన విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ ”నేనేమీతప్పుచేయలేదని” పొడిపొడిగా సమాధానంచెప్పి తప్పుకోవడానికి సడలని కాంగ్రెస్ పట్టే కారణమైతే, రాజీనామాలే ముందు, ఆతరువాతే మాటలు అనే ఎత్తుగడను అప్పట్లోనే అమలు చేసిన బిజెపి యే మార్గదర్శి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close